Jump to content

Remembering 'praja Kavi' Kaloji Narayana Rao


Recommended Posts

Posted

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=36&eddate=9/8/2013&querypage=1

Posted

ఇదే మనందరి గొడవ
Gowramma: Bathukamma editorial)

కాళోజీ జయంతి తెలంగాణకు సిసలైన పండుగ.
ఆయన శతజయంతి సంవత్సరంలోనే మన తెలంగాణ మనకు దఖలైతే ఒక సుదీర్ఘమైన ‘గొడవ’ పరిసమాప్తమైతది. అదే కాళోజీకి సరైన నివాళి.

ఆ కర్తవ్యంలో, బాధ్యతలో మనం పునరంకితం అవుదాం.
రండి, కాళోజీని ఆలింగనం చేసుకుందాం.
బతుకును నిత్య నూతనం చేసుకుందాం.
నమస్తే తెలంగాణ.
-Bathukamma

see for the e issue of Bathukamma:
[url="http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?eddate=9%2F8%2F2013&edcode=36"]http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?eddate=9%2F8%2F2013&edcode=36[/url]

Posted

చెమ్మగిలిన కన్నులలో
కమ్మపూన్నో చదివాను.
ఒలికి పారలేని బాధ
పలుకు జారనీని గాధ
చిలికి బయటపడెడి గుట్టు
బలిమినెటులో దాచినట్టు
చెమ్మగిలిన కన్నులలో
కమ్మపూన్నో చదివాను.
మనసు మాట మారలేదు
ఉనికి తప్పి జారిపోదు
తనువు యిపుడు నీది కాదు
‘మునుపు’ తిరిగి రాదు రాదు
చెమ్మగిలిన కన్నులలో
కమ్మపూన్నో చదివాను.
లోగా ఆడిన ఆట
సాగదనెను గట్టిమాట
సైగజేయు వీలుపడక
మూగనుడుల జాలినడక
చెమ్మగిలిన కన్నులలో
కమ్మపూన్నో చదివాను.
నలుగురి వలె మనము కూడ
వెలితి పడుట తగదు తగదు
కలితి లేని ప్రేమ మనది
కలకాలం మనగలదు
చెమ్మగిలిన కన్నులలో
కమ్మపూన్నో చదివాను.
చిత్తమెపుడు నీదె సొత్తు
చెత్త ఇపుడు పరుని తొత్తు
పల్లేరులు మదిని కెలక
మల్లెపూల మీది పడక
చెమ్మగిలిన కన్నులలో
కమ్మపూన్నో చదివాను.
చేరుకుంటి పరునిపంచ
కోరిగాదు పడకు కించ
‘తాళి’ పేర తలుగు పడగ
‘కేళి’ పేర గేలి జరిగె
చెమ్మగిలిన కన్నులలో
కమ్మపూన్నో చదివాను.
చెదరలేదు ప్రేమపటము
ప్రిదులలేదు ప్రీతిఘటము
ఎదుట ఉంతు ఎడదపలక
చదువుకొనుము చెలిమి వొలక
చెమ్మగిలిన కన్నులలో
కమ్మపూన్నో చదివాను.

(1961లో రాసిన కవిత)


[url="https://www.facebook.com/photo.php?fbid=537728912966167&set=a.102057079866688.3510.100001871881743&type=1&relevant_count=1"][img]https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-prn1/p480x480/546967_537728912966167_2046550710_n.jpg[/img][/url]

Posted

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితో మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం

ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం
తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే - మునుగును తప్పక


[url="https://www.facebook.com/photo.php?fbid=537728026299589&set=a.102057079866688.3510.100001871881743&type=1&relevant_count=1"][img]https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-ash4/p480x480/1175675_537728026299589_395721496_n.jpg[/img][/url]

Posted

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు
వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమక్షిగాంధ్ర వాదులను

ఏమనవపూనో తోచదు
‘రోడ్డని’ పలికేవారికి
సడకంటే ఏవగింపు
ఆఫీసని అఘోరిస్తూ
కచ్చేరంటే కటువు

సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు
సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంటె కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పోయినడంటే చావు
తోలడమంటే పశువు
దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవం దారి

బొక్కంటే ఏముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు
బర్రంటె నవ్వులాట
గేదం పాలు
పెండంటె కొంప మునుగు
పేడం ఎరువు
రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు

తక్కినోళ్ళ నోళ్ళ యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు
వహ్వారే! సమక్షిగాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహార్ధ్రమ్ము
బోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
బోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు
భోయి భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు
కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒక
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి
ఉర్దంటె మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జానపదుని లేఖ లేవో
జ్ఞాన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ బ్రతుకును
సాగిస్తూ తెనుగు తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపవూతయ పడుచున్నడు
బోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంవూధవాది వాడు
భీమశాస్త్రి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న


[url="https://www.facebook.com/photo.php?fbid=537727096299682&set=a.102057079866688.3510.100001871881743&type=1&relevant_count=1"][img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash3/p480x480/1236553_537727096299682_470199014_n.jpg[/img][/url]

Posted

[quote name='badrii' timestamp='1378730792' post='1304224412']
recha gottevi kaakunda, normal vi post chey guru
[/quote]
i posted best poems of him which every one must read and understand. Thanks

Posted

[quote name='bamchik' timestamp='1378730926' post='1304224413']
i posted best poems of him which every one must read and understand. Thanks
[/quote]

i know he is the best

×
×
  • Create New...