Jump to content

30 Vasanthala Mangamma Gaari Manavadu....


Recommended Posts

Posted

[color=#3D3D3D][font=helvetica, arial, sans-serif][size=3][background=rgb(48, 80, 129)][background=rgb(255, 255, 255)][color=#282828][size=4][b][color=#FF0000][size=5]30 వ వసంతం లో అడుగిడిన మా మంగమ్మ గారి మనవడు[/size][/color][/b]
[b][color=#006400]1984 సంవత్సరం, సెప్టెంబర్ 7 వ తేదీ. నందమూరి వంశాభిమానులకి
పండగ రోజు.[/color][/b] 35 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా తెలుగు చలన చిత్ర
రంగాన్ని ఏలి, రాజకీయాలలో తన ముద్ర వేయటానికి తారక రాముడు తరలి
వెళ్ళినప్పటి నుండి ఆయన సినీ అభిమానులు మళ్ళీ ఆ వంశం నుండి హిట్ సినిమా
ఎప్పుడా ఎప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణం. అప్పటికి చలన
చిత్ర జీవితాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు అయినా, స్వంత సంస్థ
నిర్మించిన చిత్రాలకు మాత్రమే పరిమితమైన ఆయన 5 వ కుమారుడు బాలకృష్ణ, ఆ
సంవత్సరమే బయటి సంస్థలు నిర్మించే చిత్రాలలో కథానాయకుడిగా నటించటం మొదలు
పెట్టి తన సినీ జీవితాంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. మొదటి మూడు చిత్రాలు ఆశించిన
ఫలితాన్ని ఇవ్వలేదు. [b][color=#B22222]ఆ సమయంలో రిలీజ్ అయ్యి కనీ వినీ ఎరుగని స్థాయిలో
ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మంగమ్మ గారి మనవడు చిత్రం.
బాలకృష్ణుడు తాండవకృష్ణుడై విజృంభించాడు.[/color][/b] [b][color=#0000FF]తెలుగు సినీ చిత్ర చరిత్రలో
శ్లాబ్ సిస్టం ప్రవేశ పెట్టిన తరువాత తొలి రజతోత్సవ, స్వర్ణోత్సవ చిత్రం
గా ఆ చిత్రం రికార్డ్స్ సృష్టించింది. మొత్తం 7 కేంద్రాలలో శతదినోత్సవం
జరుపుకుంది. తండ్రి విడిచి వెళ్ళిన ఖాళీని భర్తీ చేయటమే కాకుండా, ఆయన
అభిమానుల ఆశల మేరకు రాణించటం అనే బృహత్తర కార్యక్రమాన్ని తన
భుజ స్కంధాలపై వేసుకున్న ఒక 24 ఏళ్ళ యువకుడు సాధించిన అపూర్వ
విజయం. అతను కెమేరా ముందుకు మొట్ట మొదటి సారి అడుగు పెట్టిన తరువాత
ఇప్పటివరకు ఎన్నో విజయాలను సాధించినా, 'మంగమ్మ గారి మనవడు ' గా
సాధించిన ఈ విజయం మాత్రం అనిర్వచనీయమైనది. పల్లెటూరి పంచెకట్టు
పాత్రలు చెయ్యాలంటే ఈ తరంలో బాలయ్య తరువాతే ఎవరైనా అని చాటి చెప్పిన
చిత్రం. మాస్ కథానాయకుడిగా అతనికి ఒక సుస్థిర స్థానాన్ని అందించిన
చిత్రం. అదే నిర్మాతతో తరువాత పలు విజయవంతమైన చిత్రాలలో కలిసి పని
చేసే ప్రోత్సాహాన్ని అందించిన చిత్రం. ఈ మంగమ్మ గారి మనవడు చిత్రం.[/color][/b]

ఆ సంవత్సరమే కథానాయకుడిగా అడుగు పెట్టిన బాలయ్యతో సినిమా
తియ్యటానికి ముందుకు వచ్చారు, నెల్లూరుకు చెందిన ఎస్.గోపాల రెడ్డి గారు. అగ్రికల్చరల్
బి.ఎస్సీ చేసిన ఆయన, చిత్ర రంగం మీద మమకారంతో, తన కుమారుని పేరు
మీద భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థని స్థాపించి రెండు మూడు చిన్న
బడ్జెట్ చిత్రాలను నిర్మించి భారీ విజయాలను స్వంతం చేసుకున్నారు. స్వతహాగా
ఎన్.టి.ఆర్ గారి అభిమాని. ఆయనతో తియ్యలేక పోయినా, వారి అబ్బాయితో అయినా
చిత్రం తీయాలనే అభిలాషతో, తమిళ్ లో భారతీ రాజా గారు దర్శకత్వం
వహించి ఏవరేజ్ గా నడిచిన చిత్రం రీమేక్ హక్కులని కొన్నారు. దానికి కథ కూడా
భారతీ రాజా గారే రాసుకున్నారు. బాలయ్యకి కథ నచ్చింది, కానీ ఒక్క సారి
తన తండ్రి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని నిర్మాతని వెంటబెట్టుకొని
వెళ్ళి వినిపించారు. ఎన్.టి.ఆర్ గారు విని ఆయన అభిప్రాయం/సలహాలు చెప్పి,
చిత్రరంగం లో తన వెన్నంటి ఉండి ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చిన తన
తమ్ముడు త్రివిక్రమ రావు గారి సలహా కూడా తీసుకోమన్నారు. త్రివిక్రమ రావు
గారు తెలుగు నేటివిటీకి అనుగుణం గా మార్పులు చెప్పారు. కథలో ముఖ్య
పాత్రధారిణి అయిన నాయనమ్మ పాత్రకు పద్మశ్రీ భానుమతీ రామ కృష్ణ గారిని
తీసుకున్నారు (ఇది ఎన్.టి.ఆర్ గారు ఇచ్చిన సలహాల లో ముఖ్యమైనది). ఆవిడని సంప్రదించిన
మీదట ఆవిడ కూడా కొన్ని మార్పులు చేర్పులు
చెప్పారు. దర్శకుడిగా అప్పటికే తమ సంస్థలో విజయవంత మైన
చిత్రాలకు దర్శకత్వం వహించిన యువకుడు కోడి రామకృష్ణ ని తీసుకున్నారు. గణేష్
పాత్రో గారు సంభాషణలు. స్వరబ్రహ్మ మహదేవన్ గారు సంగీత
దర్శకత్వం. కథానాయకి పాత్ర కి అప్పుడే తెలుగు చిత్ర రంగం లో నిలదొక్కుకుంటున్న
సుహాసిని ని తీసుకున్నారు. మొదట్లో ఇలాంటి మాస్ డ్యాన్సులు ఇప్పటివరకు
వెయ్యలేదు, నేను వెయ్యలేనేమో అని సంశయం వ్యక్తం చేసిన ఆవిడని, మీరు
చేస్తేనే వెరైటీ గా ఉంటుంది అని నచ్చ చెప్పి ఒప్పించారు. పాటలు సి. నారాయణ
రెడ్డి గారు, ఆత్రేయ గారు రాసారు. సినిమాలోని రెండు పాటలకి బిగినింగ్ లో
వచ్చే జానపద పల్లవు లని కళాప్రపూర్ణ అనసూయాదేవి గారితో రాయించారు.
యువకుల ఉత్త్సాహం, ప్రముఖుల సహకారం వల్ల ఈ చిత్రం త్వరితగతిన పూర్తి
అయ్యి విడుదలకు సిద్దమయ్యింది. [b][color=#FF8C00]ఆ తరుణంలో ఆంధ్ర రాష్ట్రం ప్రజాస్వామ్య
పరిరక్షణ ఉద్యమంతో వేడేక్కి ఉంది. ముఖ్యమంత్రి గా ఎన్.టి.ఆర్ ని
అక్రమంగా గద్దె దించి అప్పటికి 10 రోజులయ్యింది. ఈ తరుణం లో చిత్రం విడుదల
చేయాలా వద్దా అని తర్జన భర్జనలు పడిన తరువాత చిత్రాన్ని రిలీజ్
చెయ్యాలనే నిర్ణయానికి వచ్చిన దర్శక నిర్మాతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ
ఉద్యమానికి ఉడతా భక్తిగా తమకు తోచినది చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా బాలయ్య, భానుమతి గార్ల ఆమోదం తో అప్పటికప్పుడు ఒక
పాటని రాయించుకుని స్వరబ్రహ్మ గారి పర్యవేక్షణలో, భానుమతి గారు
పాడగా రికార్డ్ చేసారు. ఆ పాటే టైటిల్స్ పడుతున్నప్పుడు బ్యాక్ గ్రౌన్డ్ లో వచ్చే
'శ్రీ రఘురామా సీతారామ రావాలయ్యా నీ రాజ్యం ' పాట. సినిమా విడుదల
అయ్యింది. రాష్ట్రమంతటా అంత హడవిడిగా ఉన్నా, ఈ చిత్రం ప్రజల దృష్టి ఒక్క
సారి తన వైపుకి కూడా తిప్పుకోగలిగిందంటే దానికి మొదటి కారణం ఆ
పాటే.[/color][/b] చిత్రం విడుదల అయిన పది రోజులకి, ప్రజా ఉద్యమం కారణంగా,
ఎన్.టి.ఆర్ ని తిరిగి ముఖ్యమంత్రిని చెయ్యక తప్పింది కాదు. [b][color=#B22222]అప్పటి నుండి ప్రజల
దృష్టిని ఆకట్టుకున్న పాట 'దంచవే మేనత్త కూతురా' అన్న మాస్ పాట.
ఆంధ్ర రాష్ట్రంలోని పల్లెలలో ఈ నాటికీ మారు మ్రోగుతూనే ఉంటుంది. పంచె కట్టి
న రైతు బిడ్డ గా బాలయ్యని చూసిన పల్లెటూరి యువకులు అతనిలో తమని
తాము చూసుకున్నారు. [/color][/b]మంచి కథ కథనం, ఆకట్టుకునే సంభాషణలు,
హుషారైన పాటలు, దాణికి తగ్గ సంగీతం, నటీ నటుల అభినయం అన్నీ
సమపాళ్ళలో కుదిరిన ఈ చిత్రం మ్రోగించిన విజయ దుందుభి తెలుగు గడ్డపై చాలా
రోజులు ప్రతిధ్వనిస్తూనే ఉండేది.

ఇక కథ విషయానికి వస్తే, తల్లీ తండ్రీ లేని వీరన్న (బాలయ్య) ని
నాయనమ్మ అయిన మంగమ్మ గారే (భానుమతీ రామకృష్ణ) పెంచి పెద్ద చేస్తుంది.
అల్లుడి (గోకిన రామారావు) దురలవాట్ల వల్ల పొరుగునే ఉన్న కూతురుని
(అనిత), అల్లుడిని దగ్గరకి చేరనివ్వదు. కానీ కూతురు బిడ్డ అయిన మల్లి
(సుహాసిని) ని మాత్రం మనవడికి చేసుకోవాలని ఉంటుంది. ఊళ్ళో అందరికీ ఈవిడ
అంటే గౌరవం, అభిమానం, కొంచెం భయం కూడా. వీరన్నకి, మల్లికి కూడా
ఒకరంటే ఒకరికి అభిమానం, కాకపోతే మల్లికి వీరన్న ని చూస్తేనే భయం.
వీరన్న, మల్లి అంటే అభిమానం తో వాళ్ళిద్దరి పెళ్ళి జరగాలని కోరుకునే
మధ్యవయస్కుడైన బ్రహ్మచారి స్కూలు మాస్టర్ (గొల్లపూడి మారుతీ రావు).
మంగమ్మ గారంటే ఉన్న భయం వల్ల ఆమెకి వీళ్ళిద్దరికీ పెళ్ళి చెయ్యమని
చెప్పలేక, ఆమె రోజూ ఇంట్లో కూర్చునే అరుగుకి ఆమె లేని టైంలో చెబుతాడు. ఇక
మంగమ్మ గారి అల్లుడైన చంటబ్బాయికి ఎడ్ల పందాల పిచ్చి. ఈయన గారి ఎద్దుని
లొంగదియ్యాలని ప్రయత్నించి లొంగదియ్యలేక ప్రతి సంవత్సరం అభాసు
పాలయ్యే పక్క ఊరు రామభద్రపురం జనానికి నాయకుడుమోతుబరి బసవయ్య
(నూతన నటుడు ఏలేశ్వరం రంగా). చంటబ్బాయి కీప్ చింతామణి (వై.విజయ),
ఆవిడకి తమ్ముడు చంద్ర రాజు (బాలాజీ) చంటబ్బాయి తోటలోనే ఉంటూ, 'మాది
సెడగొట్ల వంశం, సెడ్డపేరే లేదు ' అని చెప్పుకుంటూ వంటావదం అంటుతూ
కొబ్బరితోట రాయించుకోవాలని ఆవిడ చూస్తుంటే, 'ఆవదం అంటటం తో నా అప్ప బతుకు,
కోడీకలు పీకటం తో నా బతుకూ తెల్లారి పోతుంది ' అని దెప్పి పొడుస్తూ
చంటబ్బాయి దగ్గర చిల్లర నొక్కేస్తూ ఈవిడ తమ్ముడు గారూ ఉంటూంటారు. ఇలాంటి
సమయంలో కూతురికి పెళ్ళి చెయ్యాలని నిశ్చయించుకొని పక్క ఊరినుండి
చంటబ్బాయి సంబంధం తీసుకొచ్చి అది కుదరక, ఊరి పెద్దల సలహా మేరకు కూతురిని
వీరన్నకి చేసుకోమని చంటబ్బాయి అత్తగారైన మంగమ్మ గారి ని అడగటం
తో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. ఇది జరిగిన తరువాత, 'కట్టుకున్నప్ప
కట్టుకున్నప్పే, ఉంచుకున్నప్ప ఉంచుకున్నప్పే' అని దెప్పి పొడుస్తూ తనకి
మల్లిని ఇవ్వలేదని అక్కసు వెళ్ళగక్కిన చంద్ర రాజుని, చింతామణిని
వెళ్ళగొట్టేస్తాడు చంటబ్బాయి. వాళ్ళిద్దరూ పక్క ఊరికెళ్ళి బసవయ్య ప్రాపకం లో
చేరతారు. ఆ తరువాత జరిగిన సంఘటనలలో చంటబ్బాయి చనిపోవటం, వీరన్న
పక్క ఊరివారితో జరిగిన గొడవలో ఒకరిని చంపేసాననుకొని భయపడి ఊరు
విడిచి పారిపోయి మిలిటరీ లో చేరటం, ఈ విషయం తెలియక అతను
చనిపోయాడనుకొని నీరుగారి పోయిన మంగమ్మ ఆమె మనుమరాలు, తరువాత అతను
బ్రతికే ఉన్నాడని తెలియటం, మధ్యలో మళ్ళీ ఎదురైన కొన్ని అవాంతరాలు
ఎదుర్కొని చివరికి మల్లి, వీరన్న ల పెళ్ళి జరగటంతో కథ సుఖాంత
మవుతుంది.

[b][color=#4B0082]'పిడుగులు కురిసే వంశంలో పిస్తోలు పుడుతుందా' అంటూ హీరో గురించి స్కూల్
మాస్టర్, 'నీ మూతి మీద మీసం ఉంటే ఈ మంగమ్మ ముంజేతికి మీసం ఉందిరా ' అని
ఆవేశం గానూ, 'ఆ పసుపు రాసేదానికోసమే ఈదురు చూస్తున్నాను ' అంటూ
మనవరాలిని ఆటపట్టిస్తూ మంగమ్మ గా భానుమతి గారు చెప్పిన డైలాగ్స్,
'మేనత్త కొడుకుని నేనుండగా ఎవడురా నా మల్లిని చూడటానికి వచ్చింది ' అని
రోషంతో కత్తి పట్టుకుని బాలయ్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులని ఎంతగానో
ఆకట్టుకుంటాయి.[/color][/b] గణేష్ పాత్రో గారు సందర్భోచితంగా రాసిన డైలాగ్స్ కూడా ఈ
చిత్రానికి ఆయువు పట్టు. స్వరబ్రహ్మ బాణీలు కట్టిన ఆరు పాటలు 'శ్రీ
రఘురామ సీతారామా రావాలయ్యా నీ రాజ్యం ', 'వంగతోటకాడా ఒళ్ళు జాగ్రత్తా ',
'గుమ్మా చూపు నిమ్మా ముల్లు ', 'గోదారి నిన్ను చూసి గుస గుస లాడింది ', 'దంచవే
మేనత్త కూతురా ', 'శ్రీ సూర్య నారాయణా మేలుకో ' చాలా పాపులర్ అయ్యాయి. సాహుల్
నేతృత్వంలో ఫైట్స్, శివసుబ్రమణ్యం కూర్చిన నృత్యాలు, డి. ప్రసాద్ బాబు
అద్భుత చాయగ్రహణం కూడా ఈ చిత్రవిజయానికి తోడ్పడ్డాయి. దర్శకుడు కోడి
రామకృష్ణ తమ్ముడు కోడి లక్ష్మణ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ శాఖలో
అసిస్టెంట్ గా చేసి, తరువాతి కాలంలో కోడి రామఋష్ణ చిత్రాలకు ఛాయాగ్రాహణ
బాధ్యతలు నెరవేర్చాడు. 1993 లో ప్రేమ పుస్తకం చిత్రానికి మొదటి సారి
దర్శకత్వం చేపట్టి ఆ చిత్రం షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి
ప్రాణాలు కోల్పోయిన గొల్లపూడి శ్రీనివాస్ (గొల్లపూడి మారుతీ రావు గారి
అబ్బాయి) ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఈ చిత్రంతొ
ప్రారంభమైన బాలయ్య-గోపాల రెడ్డి-కోడి రామ కృష్ణల కాంబినేషన్, తరువాతి
కాలంలో ముద్దులకృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య లాంటి
విజయవంతమైన చిత్రాలను అందించింది. [b][color=#00FF00]గత ముప్పై సంవత్సరాలలో బాలయ్య హీరో గా
సాధించిన అనేక విజయాలు ఒక ఎత్తు ఐతే, ఈ మంగమ్మ గారి మనవడి
విజయం ఒక ఎత్తు. [/color][/b]మళ్ళీ ఆ కాంబినేషన్ లో గ్రామీణ నేపధ్యంలో ఇంకో చిత్రాన్ని
తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా నందమూరి అభిమానులు ఆశించటంలొ తప్[/size][/color][/background][/background][/size][/font][/color]

Posted

[img]http://www.nandamurifans.com/art/wp-content/uploads/2008/09/mgm.jpg[/img]

Posted

[img]http://desitunes.desibantu.com/files/2012/01/Mangamma-Gari-Manamudu_1984.jpg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/main/wp-content/uploads/2008/09/gopalreddy-002.jpg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/posters/images/wallpapers/mangamma-gari-manavadu-13-500711.jpeg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/posters/images/wallpapers/mangamma-gari-manavadu-02-40866.jpeg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/posters/images/wallpapers/mangamma-gari-manavadu-12-778867.jpeg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/posters/images/wallpapers/mangamma-gari-manavadu-11-940426.jpeg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/posters/images/wallpapers/mangamma-gari-manavadu-09-331515.jpeg[/img]

Posted

[img]https://lh5.googleusercontent.com/-YyckeQhvFTY/TzIzDkTw2WI/AAAAAAAAEWM/SC_9vc4w81Q/s200/ojptx.gif[/img]

Posted

[img]http://www.nandamurifans.com/posters/images/wallpapers/mangamma-gari-manavadu-08-442021.jpeg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/records/files/nbk/mm/mm_04.jpg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/records/files/nbk/mm/mm_03.jpg[/img]

Posted

[img]http://www.nandamurifans.com/records/files/nbk/mm/mm_02.jpg[/img]

×
×
  • Create New...