rajurocking50 Posted September 11, 2013 Report Posted September 11, 2013 [size=5][color=#000000]హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి మరో రికార్డ్ క్రియేట్ చేసారు. రాజమౌళి అఫీషియల్ ఫేస్ బుక్ పేజిలో 5,00,000 మార్క్ ను క్రాస్ చేసింది. మన దేశంలో వేరే ఏ దర్శకుడు పేజీ ఇంత పాపులారిటీ సాధించలేదు. ఈ పేజీలో ఎప్పటికప్పుడు రాజమౌళి ఫోటోలు, తన తాజా చిత్ర విశేషాలు పెడుతూ లైవ్ గా ఉంచటంతో దానికి మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క లు నటిస్తున్నారు.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఆర్క మీడియా బ్యానర్ నిర్మిస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్ లో భారీ ఎత్తున రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రం షూటింగ్ రామౌజీ ఫిల్మ్ సిటిలో వేగంగా జరుగుతోంది. సినిమాకి సంభందించిన కీలకమైన సన్నివేసాలు ప్రత్యేకంగా వేసిన సెట్స్ తీస్తున్నారు. ఈ సీన్స్ లో భాగంగా ఫైట్స్ ని చిత్రీకరిస్తున్నారు .[/color][/size]
Recommended Posts