blogger789 Posted May 11, 2009 Report Posted May 11, 2009 తెలుగోడా! వెలుగుతున్నోడా!! అణువు అణువు కలిపి అనంత దూరాలు చేరి ఆకాశానికీ, భూమికి రాజువై వెలగవోయి తెలుగు వాడా! చేతులతో బొమ్మలు చుట్టి మాటలతో కోటల చేరి రాసులుగా రత్నాలు కూర్చి ముందుకు పోవోయి తెలుగోడా! బుద్దిగా లెక్కలన్ని చేసి వేళ్లపై అందరి జాతకాలుంచి వాటముగ సంపద పోగేసి మూందుకెళ్లవోయి తెలుగోడా! అణువు అణువు కలిపి అనంత దూరాలు చేరి ఆకాశానికీ, భూమికి రాజువై వెలగవోయి తెలుగు వాడా!
Recommended Posts