Jump to content

Veedu 3 Ichadante Industry Hitte


Recommended Posts

Posted

అత్తని అల్లుడు టీజ్ చేయటం,మరదళ్లతో రొమాన్స్ తో రఫ్పాడించటం తరహా ఫార్ములా సినిమాలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. దాదాపు ఇప్పుడున్న పెద్ద హీరోలంతా ఆ ఫార్మెట్ ని అరగదీసి వదిలేసారు. అయితే ఈ చిత్రంలో కొత్తదనం అంతా అదే కథని పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ తో ముచ్చటగొలిపేలా చెప్పటం. ముఖ్యంగా పవన్ వంటి యాక్షన్ ఇమేజ్ ఉన్న మాస్ హీరోని భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథలో కి తీసుకువచ్చి త్రివిక్రమ్ మ్యాజిక్ చేసారు. దాంతో పైరసీ అడ్డొచ్చినా తన ప్రతాపం చూపిస్తూ థియోటర్స్ లో ఆడియన్స్ చేత డాన్స్ చేయిస్తోంది. పూర్తిగా ఫన్ నే నమ్ముకున్న ఈ సినిమా అక్కడక్కడా సెంటిమెంట్ బ్లాక్స్ వద్ద కాస్త స్లో అయినా మొత్తంమీద సరదాగా నడిచిపోయింది. గబ్బర్ సింగ్ రేంజిని అందుకుంటుందో లేదో కానీ పవన్ నుంచి ఆశించే మంచి కమర్షియల్ సినిమా ఇది.
ఇటిలీలో ఉంటే అపర కుబేరుడు రఘు నందన్(బొమన్ ఇరాని)కి ముద్దుల మనవడు గౌతమ్‌ నందా (పవన్‌ కల్యాణ్‌). ఆరడుగుల బుల్లెట్‌లాంటి అతన్ని ఓ రోజు తాతగారు పిలిచి...ప్రతీ పుట్టిన రోజుకి నేను నేను గిప్ట్ ఇస్తున్నాను. ఈ పుట్టిన రోజుకి... నాకు నువ్వు గిప్ట్ ఇవ్వాలి. అది మరేదో కాదు...నా నుంచి విడిపోయిన నా కూతురు అంటే నీ మేనత్త సునంద(నదియా)ని ఇండియా నుంచి తీసుకు రావాలి అని అడుగుతాడు. దానికి సరేనన్న గౌతమ్ ...తాతయ్య కి ఇచ్చిన మాట కోసం.. ఇండియా వస్తాడు. ఇక్కడ తన పేరు సిద్దార్థ్‌గా మార్చుకొంటాడు. సునందకి ఉన్న ఆస్తి ఫైవ్ స్టార్ [url="http://rlinks.one.in/referer.php?pub_key=pub_18&link=https://www.goibibo.com/?utm_source=affiliate_oneindia&utm_medium=intextlink&utm_campaign=26sep13&word=హోటల్"]హోటల్[/url] అప్పుల్లో ఉందని తెలుసుకుంటాడు. సునంద భర్త(రావు రమేష్)ని యాక్సిడెంట్ ని కాపాడి... తానెవరో చెప్పకుండా ఓ సాధారణ డ్రైవర్‌గా ఆ ఇంటిలో చేరతాడు. అక్కడ తన మరదళ్లు ప్రమీల( ప్రణీత), శశి (సమంత) ని చూస్తాడు. అక్కడ నుంచి తనదైన శైలిలో ఆటప్రారంభించి,తన పొగరుమోతు అత్త సమస్యలని తీర్చి ఆ కుటుంబానికి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో కొత్త సమస్యలు తలెత్తుతాయి. అవి ఏమిటి... తన అత్త మనస్సు మార్చి తన తాత అడిగిన గిప్ట్ ని ఇవ్వగలిగాడా అనేది మిగతా కథ.
" సార్..ఇదే హైదరాబాద్ ...ట్రాఫిక్ చాలా బ్యాడ్... పెద్దమ్మతల్లి ఫేమస్ గాడ్.." ఈ డైలాగు వినగానే కళ్లు మూసుకుని ఒక్కసెకను కూడా ఆలోచించకుండా ఇది త్రివిక్రమ్ రాసింది అని చెప్పేయగలం. అలాంటి పంచ్ లు సీన్ కు మినిమం ఒకటైనా వడ్డించుకుంటూ వచ్చిన త్రివిక్రమ్ ఈ సారి పవన్ ని కొంచెం కొత్తగా ఖుషీ కాలం నాటి కుర్రాడిలా కూల్ గా చూపెట్టాలనుకున్నాడు. దాదాపుగా సక్సెస్ అయ్యాడనే చెప్పచ్చు. ఫ్యామిలీ కథకు...పవన్ పవర్ ని యాడ్ చేసి హిట్ కి ఇదో దారి అని చూపెట్టాడు.
కథ విషయానికి వస్తే సాధారణంగా...సింపుల్ స్టోరీ ఉన్నప్పుడే ట్రీట్ మెంట్ కి ఎక్కువ అవకాసం ఉంటుందనేది ఈ స్క్రిప్టు చూస్తే అర్దమవుతుంది. ముఖ్యంగా కథలో మలుపులు కన్నా ప్రేక్షకుల్ని అలరించే మెరుపులని సినిమాలో పెట్టి సక్సెస్ కొట్టవచ్చు అనేది గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయ్యింది. దాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లారు. సినిమాలో ఫ్యాన్స్ ని అలరించే అంశాలను తనదైన శైలిలో సమకూర్చి పవన్ ఫ్యాన్స్ కి పండుగ చేసారు.
అలాగే " సింహం పడుకుందికదా అని జూలుతో జడ వెయ్యకూడదు రా... అదే పులి పలకరించింది కదా అని ప్రక్కన నిలబడి ఫోటో దిగాలనుకోకూడదు" వంటి డైలాగ్స్ పవన్ కూల్ గా కిర్రెక్కించాడు. ఎందుకు హీరోలు ఎప్పుడూ పాత రూట్లోనే మాస్ డైలాగులు చెప్తూ,అవే తరహా ఫార్ములా ఫైట్స్ చేస్తూ,రొటీన్ రొమాన్స్ తో కాలం వెల్లబుచ్చుతూంటారు...అన్న ప్రశ్నకు కొంతలో కొంత ఈ సినిమా జవాబు ఇస్తుంది. పవన్ నుంచి రెగ్యులర్ మసాలా ఆశించేవాళ్ళకు కొద్ది సమయం పట్టినా తర్వాత బాగుందని అంటారు.
----సూర్య ప్రకాష్ జోశ్యుల

[b]Rating:[/b]
3.0/5

Posted

[color=#0000ff][b]వన్ మ్యాన్ షో నే కాదు కానీ ..[/b][/color]
ప్రతీ సారిలా ఇది పవన్ వన్ మ్యాన్ షో అని చెప్పలేము. ఇది త్రివిక్రమ్, పవన్,దేవిశ్రీప్రసాద్ కలిసి చేసిన మ్యాజిక్. వీరు ముగ్గురూ సమానంగా స్క్రీన్ సమయాన్ని పంచుకుని అల్లాడించారు. టెక్నీషియన్స్ ఇద్దరి ఎఫెర్ట్ లను తెరపై అద్బుతంగా పవన్ ప్రెజెంట్ చేసారు. ఫన్నీ సీన్స్ లో ఎంతలా నవ్వించారో, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సీన్ లోనూ అంతలా లీనమై తననెందుకు పవర్ స్టార్ అంటారో మరోసారి తెలియచేసారు.

Posted

[color=#0000ff]త్రివిక్రమ్... ది పెన్ పవర్[/color]
"పాము పరధ్యానంగా ఉంది కదా అని పడగ మీద కాలు వెయ్యికూడదు రోయ్...".
"నేను సింహం లాంటోండిని...అది గెడ్డం గీసుకోలేదు..నేను గీసుకోగలను..అంతే తేడా".
త్రివిక్రమ్ ని చాలా మంది దర్శకుడుగా కన్నా మాటల రచయితగానే ఎక్కువ ఇష్టపడతారు. అదే విషయం మరోసారి కరెక్టే అనిపించేలా తన పెన్ పవర్ చూపించారు. అలాగే సాధారణంగా ఎన్నారై లు ఇండియా వచ్చారంటే సుకుమారుడు,గ్రీకు వీరుడు లేక మరో చిత్రమో తరహాలో ఆ హీరోలు చాలా పొగరుతో ఉంటారు. కానీ అక్కడ కూడా మన వాళ్లే ఉంటారు. వాళ్లూ మనలాగే ఉంటారని నేటివిటీ టచ్ తో నేర్పరితనంగా ఎన్నారైలని కూడా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.

Posted

[color=#0000ff]మరదళ్లు.... సరసాలు[/color]
ఇప్పుడు తెలుగులో సమంత..గోల్డెన్ లెగ్..ఆమె ఉందంటే సినిమా సూపర్ హిట్ అనే నిర్ణయానికి వచ్చేసారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర మేరకు ఆమె చేసుకుంటూ పోయింది. రొమాంటిక్ ఏంగిల్ ..పవన్ జల్సా తరహాలో ఈ సినిమాలో పెద్దగా లేకపోయినా ఓకే అనిపించింది. మోడ్రన్ గర్ల్ గా ప్రణీత కూడా బాగా చేసింది. బాపు గారి బొమ్మో పాటను ప్రణీత మీద చక్కగా చిత్రీకరించారు. మరదళ్లు ఇద్దరూ సినిమాటెక్ గా సాగిపోయారు.

Posted

[color=#0000ff]కామెడీ[/color]

త్రివిక్రమ్ సినిమా అంటేనే ఫన్ కి లోటు ఉండదనేది సగటు సిని ప్రేక్షకుడుకి తెలిసిన విషయం. అలాంటిది కామెడీ సీన్స్ లో రెచ్చిపోయే పవన్ వంటి వారు అండగా ఉండగా ఇంకేంటి అన్నట్లు చాలా సీన్స్ హిలేరియన్ గా తీర్చి దిద్దారు. ముఖ్యంగా బ్రహ్మానందం..బంధం భాస్కర్ గా అదరకొట్టారు. ఇక పవన్ ..బ్రహ్మీని ఆటపట్టించటానికి కెవ్వు కేక బాబాగా మరో కామెడీ ఎపిసోడ్..ఇలా నవ్వులు పేర్చుకుంటూ పోయారు.

Posted

[color=#0000ff]అత్తగా అదుర్స్...[/color]
గతంలో వాణిశ్రీ,నగ్మా,రమ్యకృష్ణ,లక్ష్మి వంటివారు అందాలు ఒలకబోస్తూనే అత్త పాత్రలో జీవించారు. మళ్లీ రీసెంట్ గా నదియా ఆ పాత్రను పోషించి వారిని గుర్తు తెచ్చింది. డీసెంట్ గా ఆమె చేసిన నటన హైలెట్ అయ్యింది. పవన్ కి, ఆమెకూ మధ్య వచ్చే సన్నివేసాలు బాగున్నాయి. అలాగే ఆమె భర్తగా వేసిన రావు రమేష్ కూడా క్యారక్టర్ కి యాప్ట్ అయ్యారు. ముఖేష్ రుషి కూడా ఓకే.

Posted

[color=#0000ff]ఆ సీన్ లేకపోతే...[/color]
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' క్లైమాక్స్ లో వచ్చే డైలాగు ఇది. దీన్ని బట్టే ఎంత బాగా దీన్ని డీల్ చేసాడో అర్దం చేసుకోవచ్చు. సినిమాకి చివరి ఇరవై నిముషాలు ప్రాణం అని సినిమా పెద్దలు చెప్తూంటారు. అదే ఈ సినిమాకు నిజమైంది. క్లైమాక్స్ లో పవన్ చెప్పే డైలాగులు, నదియా,పవన్ మధ్య వచ్చే సన్నివేసం సినిమాకు ప్లస్ అయ్యింది. అప్పటి వరకూ సరదాగా సాగిన జర్ని ఆ సీన్ తో టర్న్ తీసుకుని సినిమాని నిలబెట్టింది. సె8కండాఫ్ లో కొంత సాగిన ఫీలింగ్ వచ్చినా ఈ సీన్ తో మళ్లీ రైట్ ట్రాక్ లోకి వచ్చింది. త్రివిక్రమ్ తన రచనా చాతుర్యం ఇక్కడ ఉపయోగపడింది.

Posted

[color=#0000ff]సంగీతం[/color]
దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు సినిమాకు బాగా ప్లస్ అవుతాయని ఆడియో రిలీజ్ అయిన రోజే అందరికి అర్దమైంది. అలాగే అతను సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం కొన్ని సీన్స్ కు ప్రాణం పోసింది. అటు సంప్రదాయ బద్దంగానూ, ఇటు మోడ్రన్ గానూ రెండు వైపులా పదునున్న కత్తిలా దేవి రెచ్చిపోయారు. ముఖ్యంగా దేవదేవం సినిమాలో హైలెట్.

Posted

[img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img][img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img][img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img][img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img]

Posted

[img]http://stream1.gifsoup.com/view7/4845782/pk-comedies-o.gif[/img]
[img]

Posted

[img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img][img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img][img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img][img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img]

Posted

[quote name='IamN0tTrouble' timestamp='1380270068' post='1304315512']
wch site?
[/quote]
[url="http://telugu.oneindia.in/movies/review/"]http://telugu.oneindia.in/movies/review/[/url] [img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img]

Posted

Balu ba na id ki ento ayyindhi ba [img]http://4.bp.blogspot.com/-Oz9GxyWl8oE/UPeZIfAkepI/AAAAAAAAAQY/kpjyi8pqdUY/s320/pawan_style24.gif[/img]

×
×
  • Create New...