Jump to content

Recommended Posts

Posted

చిరంజీవికి చెక్‌ పెట్టెందుకు వ్యూహం
గంపగుత్తగా ‘దేశం’లోకి కాపు శ్రేణులు?
సీమాంధ్ర ఉద్యమంతో మారుతున్న సమీకరణలు

(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రాజకీయ సమీ రణలు శరవేగంగా మారుతున్నాయా? కాపు నాయకులు క్రమేపీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతు న్నారా? గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్‌లో విలీనం చేసిన కేంద్రమంత్రి చిరంజీవికి చెక్‌ పెట్టే దిశగా పరిస్థితులు మారబోతున్నాయా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తున్నాయి. సీమాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలో వున్న కాపు సామాజికవర్గాన్ని పునరాలోచనలో పడేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారని భావిస్తున్నారు.

ప్రత్యేకించి భవిష్యత్‌ వ్యూహంలో భాగంగా టి.డి.పి.లో చేరేందుకు పలువురు ఇప్పటికే టిడిపి అధినాయకత్వానికి సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకత్వంతో టచ్‌లో వున్న పరిస్థితులలోనే పలువురి చేరికకు రంగం సిద్దమైనట్టు రాజకీయ వర్గాలు అంటున్నా యి. ప్రజారాజ్యం కాంగ్స్‌ పార్టీలో విలీనం అయిన ప్పుడు వున్న పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం, కాంగ్రెస్‌లో వుంటే కాపులకు ముఖ్యమంత్రి పదవి కూడా దొరికే అవకాశాలు లేకపోవడం కాపు సామాజికవర్గంలో నిరాశానిస్పృహలకు గురి చేసినట్టు భావిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతారని చిరంజీవిపై నమ్మకం పెట్టుకుంటే పదవులను అంటిపెట్టుకుని వుండట ంతో చిరంజీవి కాపుల ఆగ్రహానికి గురి అయ్యారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడంలో చిరు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపి స్తుండటంతో కాపులలో పెద్ద ఎత్తున అంతర్మథనం ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

కోస్తా, రాయల సీమలలో స్థానిక రాజకీయాలను శాసించే స్థాయి లో వున్న కాపులు తెలుగుదేశంలో చేరే అవకాశా లు సుస్పష్టం కావడంతో కాంగ్రెస్‌ పార్టీకి ెపెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్టేనని రాజకీయ వర్గాల కథనం. ఒక విధంగా కాపుల తీరుతో రానున్న సాధారణ ఎన్నికలలో రాజకీయ పార్టీల బలాబలాలు తారుమారయ్యే సూచనలున్నాయని అంటున్నారు. చిరంజీవికి ప్రధాన అనుచరులలో ఒ రైన మంత్రి గంటా శ్రీనివాసరావు తన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతారని గత రెండు వారాలుగా బలంగా ఊహాగానాలు వినవస్తున్నాయి. తొలుత తెలుగుదేశం పార్టీలో వున్న గంటా అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరడం జరిగింది. పి.ఆర్‌.పి. విలీనంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నుంచి గత ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని సమాచారం. తనకు మంత్రి పదవి రాకుండా చిరంజీవి అడ్డుకున్నారని బండారు కిను వహించినట్టు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఈలి నాని కూడా తెలుగుదేశం పార్టీలో చేరే సూచనలున్నాయని తెలుస్తోంది.

కాపులలో మంచి పట్టు వున్న ఈలి నాని కుటుంబం ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీతో అవినాభావ సంబంధం కలిగివుంది. ఎమ్మెల్యే తండ్రి ఈలి వీరాంజనేయులు, తల్లి ఈలి వరలక్ష్మి కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకులుగా పేరు తెచ్చుకున్నవారే. అదే విధంగా కాపులలో మంచి పట్టు వున్న సీనియర్‌ నాయకుడు కొట్టు సత్యనారాయణ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సమాయత్తమవుతున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఎమ్మెల్యే వంగా గీత సైతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో పడినట్టు సమాచారం. కాపు సామాజికవర్గంలో మంచి పట్టు వున్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు టిడిపి నుంచి ప్రజారాజ్యంలో చేరారు. అనంతరం తిరిగి టిడిపిలోకే వెళ్ళిపోయారు. కాపుల ప్రాబల్యం బలంగా వున్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో పలువురు తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి ఉవ్విళ్ళూరు తున్నారని తెలిసింది.రామచం ద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు క్రమంగా తన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌ పార్టీ నాయ త్వాన్ని తూలనాడటం ద్వారా పార్టీ నాయకత్వంపై నిప్పులు చెరిగిన తోట త్రిమూర్తులు కూడా టిడిపిలో చేరికకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అదే విధంగా గత ఉప ఎన్నికలలో నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం కాంగ్రెస్‌ కు గుడ్‌బై చెప్పే యోచనలోవున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేవలం కాపుల పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి మరో వైపు రాజ్యసభ పదవిని పొందడం, కేంద్ర మంత్రి గా సొంత లాభాలు పొందడం కాపులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం కూడా తాజా పరిణామా లకు కారణమని అంటున్నారు. మరో రెండు, మూడు వారాలలో తెలుగుదేశం పార్టీలో పలు వురు చేరికకు సంబంధించి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Mustodi_2ndsetup

    13

  • sigsegv

    7

  • karri_babu

    6

  • BudweiserBabu

    5

Popular Days

Top Posters In This Topic

Posted

[quote name='sigsegv' timestamp='1380433526' post='1304324431']
ee caste polictics entra babu ...
[/quote]

Anni castes ki equal importance iche one and only party TDP

Posted

[quote name='BudweiserBabu' timestamp='1380434469' post='1304324501']
chee denemma. ekkada choodu. caste caste.
[/quote]

Chee deneema edho okati chey

Posted

[quote name='Giants' timestamp='1380434625' post='1304324511']
Chee deneema edho okati chey
[/quote]


nenu already cheyyagaligindhi chesthunna.

Posted

[quote name='Giants' timestamp='1380433729' post='1304324441']
Anni castes ki equal importance iche one and only party TDP
[/quote]

caste aanadhi lekka cheyadu TDP party ani chepthey inka baagundedhi ..
caste should be non existent ...technical gaa choosina ... caste system is not there in india anymore ...

Posted

facebook lo very young people 17-20 yrs caste groups lo join ayyi edo peel ayyipothunaaru ... this is not good ...

Posted

[quote name='sigsegv' timestamp='1380434729' post='1304324519']


caste aanadhi lekka cheyadu TDP party ani chepthey inka baagundedhi ..
caste should be non existent ...technical gaa choosina ... caste system is not there in india anymore ...
[/quote]

Joke bagundhi poduko inka

Posted

[quote name='sigsegv' timestamp='1380434729' post='1304324519']

caste aanadhi lekka cheyadu TDP party ani chepthey inka baagundedhi ..
caste should be non existent ...technical gaa choosina ... caste system is not there in india anymore ...
[/quote]


Ala cheppali antey alanti mind-set undali.

Posted

[quote name='BudweiserBabu' timestamp='1380434726' post='1304324518']



nenu already cheyyagaligindhi chesthunna.
[/quote]

Em chesav?

Posted

[quote name='Giants' timestamp='1380434841' post='1304324525']
Em chesav?
[/quote]

eekada aa vishyalu discuss chesi unko gola lepali ani ledu. LTT

Posted

[quote name='BudweiserBabu' timestamp='1380434998' post='1304324533']

eekada aa vishyalu discuss chesi unko gola lepali ani ledu. LTT
[/quote]
discuss man ... lets see how it goes ...

Posted

[quote name='BudweiserBabu' timestamp='1380434998' post='1304324533']


eekada aa vishyalu discuss chesi unko gola lepali ani ledu. LTT
[/quote]

Machi chesthe chepukotaniki emindhi

×
×
  • Create New...