Jump to content

Praneeta: Attarintiki Daredi Mundhu .. Aa Tharuvatha


Recommended Posts

Posted

[img]http://www.gulte.com/content/2013/10/news/1381419956-1760.jpg[/img]

Posted

'అత్తారింటికి దారేది'కి ముందు ప్రణీత రెండు సినిమాల్లో నటించింది. అయినా కానీ ఆమెకి హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపు రాలేదు. 'అత్తారింటికి దారేది'లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలో నటించిన ప్రణీత అందులో సూపర్‌హిట్‌ సాంగ్‌ 'బాపుగారి బొమ్మో'లో పవన్‌తో కలిసి చిందేసింది. ఈ దెబ్బతో ప్రణీత పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. బ్లాక్‌బస్టర్‌ అయిన ఈ చిత్రం తెచ్చిన గుర్తింపుని ప్రణీత బాగా ఎంజాయ్‌ చేస్తోంది. ఇందులో సమంత కంటే ప్రణీత అందంగా ఉందని కూడా కొందరు కితాబులు ఇస్తున్నారు. 'అత్తారింటికి దారేది'తో వచ్చిన పాపులారిటీ వల్ల ఆమె ఇప్పుడు పలు షోరూమ్స్‌ తన చేతుల మీదుగా ప్రారంభిస్తోంది. ఆమెని చూసేందుకు వందలాది మంది జనం గుమికూడిపోతున్నారు.

నల్గొండలో ఒక వస్త్ర దుకాణాన్ని ఓపెన్‌ చేయడానికి వెళ్లిన ప్రణీతని చూడాలని అక్కడి జనం ఎలా ఎగబడ్డారో చూడండి. ప్రణీతకి ఇంతటి ఫాలోయింగ్‌ ఉందనేది సదరు వస్త్ర దుకాణం వారు కూడా ఊహించలేదట. నిజానికి అక్కడికి వచ్చిన జనాన్ని చూసి ప్రణీతే విస్తుపోయిందట. ఇంతకుముందు పలు భాషల్లో పలు చిత్రాల్లో నటించినా కానీ రాని గుర్తింపు పవన్‌తో చేసిన చిన్న క్యారెక్టర్‌తో వచ్చేసిందని ప్రణీత సంబరపడుతోంది. పవర్‌స్టార్‌ ఎఫెక్ట్‌ అలాగుంటుంది మరి.

×
×
  • Create New...