Jump to content

Tg Ki Melika - Article 371 (D)


Recommended Posts

Posted

Identha Hyderabad musukolaa oo Guddhulata.....Dhaniki Samayikam ane oka peru pentindru.....SA vollu ....[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]

Posted

రాష్ట్ర విభజన ప్రక్రియకు వరుస గండాలతో అటు కేంద్రం ఇటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానవర్గం సతమతమవుతు న్నాయా? సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం మం త్రుల బృందం నియామకం దాకా ఎన్నో ఒడిదు డుకులు ఎదురైనప్పటికీ ముందుకు సాగాలని నిర్ణయించిన కేంద్రానికి మరో విపత్తు తప్పదా? నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం చేసిన రాజ్యాంగ సవరణ దరిమిలా తెరమీదకు వచ్చిన 371డి అధికరణ విభజన నేపథ్యంలో గుదిబండగా మారనుందా? చర్చనీయాంశంగా మారిన పలు సందేహాలకు అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర రాజధానికి చెందిన ఒక న్యాయవాది కోర్టులో పిల్‌ వేసిన పిల్‌ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన ఈ అంశానికి సంబంధించి కేంద్రంలో గుబులు మొదలైనట్టు తాజా పరిణామాలను బట్టి చూస్తే అవగతమ వుతుంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర విభజనకు 1973లో సవ రించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 ‘డి’ అధిక రణ కీలకంగా మారనుందనే ప్రచారానికి బలం చేకూరుతోంది. రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రత్యేకవాదం ఉవ్వెత్తున సాగిన నేపథ్యంలో మధ్యే మార్గంగా కేంద్రం ఆంధ్రా, రాయలసీమ, తెలం గాణ ప్రాంతాల మధ్య సమతుల్యత వుండాలని భావించింది. ఈ క్రమంలోనే ఉద్యోగ, ఉపాధి, ఇత్యాది రంగాలకు 371డి ఆర్టికల్‌ ద్వారా మార్గ దర్శకాలను రూపొందించింది. పబ్లిక్‌ సర్వీసెస్‌లలో మూడు ప్రాంతాలలో సమాన స్థాయిలో అవకా శాలు కల్పించాలని ఈ అధికరణ పేర్కొంటోంది. ఇందుకు సంబంధించి పలు విధివిధానాల ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం ఆంధ్రప్రదే శ్‌కు మాత్రమే వర్తించే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 1972లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పరిస్థితులలో రాజ్యాంగ సవరణ జరిగింది.

అప్పటి పరిణామాలలో భాగంగానే ఆర్టికల్‌ 371 డి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ సీట్లను ఓపెన్‌ కేటగరీలో 54 శాతం వుండాలని నిర్దేశించడం జరిగింది. అదే విధంగా ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి.లకు సంబంధించి 46 శాతం వుండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అదే విధంగా 1974 నాటి ప్రెసెడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం స్థానిక అభ్యర్థులకు 85 శాతం, నాన్‌ లోకల్‌ కేటగరీలో 15 శాతం అమలు చేయాలని నిర్దేశించడం జరిగింది. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కూడా రాజ్యాంగ సవరణ ద్వారా 371డి అధికరణతో సంక్రమించిన సంక్షేమ వెసులుబాటుకు తెరదించాలంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ అనివార్యమనే వాదన లేకపోలేదు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు కలిపి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరుగుతున్న నియామకాలు, జోన్ల వ్యవస్థ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో చట్టరీత్యా చెల్లుబాటు కాని పరిస్థితి వుందని నిపుణుల అభిప్రాయంగా వుంది.

మంత్రుల బృందం ఆర్టికల్‌ 371డి ని పరిగణనలోకి తీసుకుంటుందా అనేది మీమాంసగా మారింది. ఉద్యోగాలు, విద్య, ఇతర రంగాలతో ముడిపడి వున్న ఉమ్మడి సమస్యను పరిష్కరించాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణకు వెళ్ళాలని నిపుణుల భావన. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 డి ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం కేంద్రాన్ని ఇరకాటంలో పడేసిందనే వ్యాఖ్యలు లేకపోలేదు. ఇదే ఆర్టికల్‌ను ఆయుధంగా చేసుకుని రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఏపిఎన్జీవో నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఒకవైపు కోర్టులో పిల్‌ దాఖలు కావడం, మరోవైపు కేంద్రాన్ని చక్రబంధంలో ఇరికించేందుకు ఎపిఎన్‌జిఓలు శతవిధాలా ప్రయత్నిస్తుండటంతో పరిస్థితి గందరగోళంగా మారిందనే ప్రచారం వుంది. రాజ్యాంగ సవరణ అనివార్యమైన పక్షంలో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభుత్వానికి పార్లమెంటులో రెండింట మూడొంతుల మెజార్టీ అవసరమే అయినా అది కష్టసాధ్యమనే గుబులు లేకపోలేదు. ఇప్పటికే మైనార్టీ అంచుల్లో ఉన్న యుపిఏ ప్రభుత్వానికి ఇది సాధ్యమవుతుందా అని రాజ్యాంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

[color=#ff0000]ఆర్టికల్‌ 371 డిలో ఏముందంటే...[/color]
దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర మూడు ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలి. దీంతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో 54 శాతం ఓపెన్‌ కేటగిరీ ద్వారా భర్తీ చేయాలి. మిగతా 46 శాతం ఖాళీలను బిసి, ఎస్సీ, ఎస్టీలతో నింపాలి. విశ్వ విద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలలోని సీట్లను సైతం ఇదే ప్రాతిపదికన భర్తీ చేయాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే...ఇరు ప్రాంతాలలోని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటే ఏపిపిఎస్సీ ద్వారా మాత్రమే జరగాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటన మేరకు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది.

ఈ ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకూ సంయుక్త ఏపిపిఎస్సీ ఉండాలి. ఇందుకు సంబంధించి మంత్రుల బృందం కీలకమైన సిపారసులను చేయాల్సివుంటుంది. ఇలా కొనసాగించడం సాధ్యమేనా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.ఇలా ఏపిపిఎస్సీని ఉమ్మడిగా ఉంచడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 315 క్లాజు రెండు చట్టం చేయడానికి అనుమతిస్తుంది. దీనికి కూడా పార్లమెంటులో రెండింట మూడొంతుల మెజార్టీ సాధించి బిల్లు ఆమోదం పొందడం అవసరం. అయితే, రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా పూర్తి కావాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 371డి తప్పనిసరిగా సవరణ జరగాల్సిందేనని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఊహించని పరిణామంతో కేంద్రం గందరగోళం
రాష్ట్ర విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్న తొందరలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం, హైకోర్టులలో దాఖలైన పిటిషన్ల ద్వారా కొత్త అంశాలరె వెలుగులోకి తెచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వర్తించేలా రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్‌ 371 డిని రద్దు చేస్తే తప్ప రాష్ట్ర విభజన సంపూర్ణం కాదు. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసిన ఏపిఎన్జీవో నేతలు ఢిల్లీకి వెళ్లి ఆర్టికల్‌ 371 డి రద్దుకు సంబంధించిన తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు అందుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని జాతీయ పార్టీల నేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదే గనక జరిగితే రాష్ట్ర విభజన ప్రక్రియకు న్యాయపరంగా చిక్కులు ఎదురైనట్లేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులను ముందుగా ఊహించని కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ముందుకు వెళ్లలేక అలాగని వెనక్కు తగ్గలేక చిక్కు సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. పార్లమెంటులో 371 డి ఆర్టికల్‌ రద్దును ఆపగలిగితే రాష్ట్ర విభజన ప్రక్రియను విజయవంతంగా అడ్డుకున్నట్లేనని ఏపిఎన్జీవో నేతలు, సమైక్య వాదులు భావిస్తున్నారు.

Posted

Poniyyandi vayya at least Seemandhra anna develop avutadi. Enni rojulani aa hyd ni pattukuni velaadataam..

Posted

[quote name='MADAFAKAHS' timestamp='1381977235' post='1304426193']
[img]http://www.gifsoup.com/view/307721/raghu-babu-o.gif[/img]
[/quote]


[img]http://i43.tinypic.com/10rs938.gif[/img][img]http://i43.tinypic.com/10rs938.gif[/img]

Posted

yedcharu, mulki agreement, ntr rule lo techina GOs tesukosthe SA lo sachi oorukuntuaru.[img]http://i43.tinypic.com/10rs938.gif[/img]

PS: not to hurt anyone political games pattukoni inka follow avuthunnaru.

×
×
  • Create New...