Jump to content

Sonia Ki Hand Istunna Trs..


Recommended Posts

Posted

[color=#000000][font=mandali, helvetica, sans-serif][size=1]

[size=7]సోనియాకు తెరాస ‘చెయ్యి’చ్చినట్టే..?[/size]

[size=6]రాజకీయాల్లో ఎవ్వరికైనా సరే.. నమ్మించి చెయ్యివ్వడం అనేది తమ జన్మ హక్కు అని, తమకు మాత్రం పేటెంటు హక్కులు ఉన్న ప్రక్రియ అని కాంగ్రెసు పార్టీ భావిస్తూ ఉంటుంది. నమ్మినవాళ్లను నట్టేట ముంచేయడంలో ఆ పార్టీది అందె వేసిన ‘చెయ్యి’. అయితే అంతలావు కాంగ్రెసు పార్టీని కూడా నమ్మించి ముంచేయడంలో తమకు తిరుగు లేదని తెరాస నిరూపించింది.కే ఆశతో అయితే ఇన్నాళ్లుగా కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు తెర తీసినదో.. ఆ ఆశలను తెరాస మంటగలిపేసింది. రాష్ట్రం ఇచ్చేయండి.. మీకు 16 సీట్లు తాంబూలపు పళ్లెంలో పెట్టి ఘనంగా అందిస్తాం.. అంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు.. ఏ నమ్మకంతో అధిష్ఠానానికి హామీ ఇచ్చారో.. అది కాస్తా వారికి దూరమైపోయినట్లే! తెరాస తమ పార్టీలో విలీనం అయితే.. గంపగుత్తగ తెలంగాణ మొత్తాన్ని గెలుచుకుంటామని కాంగ్రెస్‌ ఆశపడిరది. [/size]


[size=6]ఆ ఆశలతోనే ఇన్నాళ్లుగా తెలంగాణ మీద ముందకే తప్ప వెనక్కు వెళ్లం అంటూ ఊగిసలాడుతూనే ఉంది. ఆ ఆశతోనే.. తెరాసనుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదు అని ఢిల్లీ పెద్దలు పదేపదే ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే వారి ఆశల దోబూచులాటకు చెక్‌ పెట్టేస్తూ.. తెరాస శాసనసభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్‌ గురువారం నాడు కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం భౌగోళిక తెలంగాణ కోసం మాత్రమే పోరాడలేదని ఈటెల స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఇచ్చేయడంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిపోలేదని ఆయన ఉద్దేశం అన్నమాట. తెలంగాణ పునర్నిర్మాణం అనేది కేసీఆర్‌తోనే సాధ్యం అని ఈ ప్రాంత ప్రజలంతా నమ్ముతున్నారని.. ఈటెల చెప్పడంచూస్తోంటే.. తెరాసను కాంగ్రెసులో విలీనం చేయడం అసాధ్యం అనే అనిపిస్తోంది. పైగా తెలంగాణ ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చేసిన ప్రకటనను కూడా ఈటెల ఎద్దేవా చేస్తుండడం ఇక్కడ విశేషం. త్యాగాలు లేకుండా తెలంగాణ ఇచ్చారా అంటూ ఈటెల నిలదీస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అనేది తెరాస బాధ్యత అన్నట్లుగా, దాన్ని నిర్వర్తించే వరకు పూర్తిచేసేవరకు తెరాస అస్తిత్వం అవసరం అన్నట్లుగా ఉన్న ఈటెల మాటలు కాంగ్రెస్‌ దళాలను ఖంగు తినిపిస్తాయనడంలో సందేహం లేదు. ఈ పునర్నిర్మాణం గురించి ఇప్పటికే తాము కొంత కార్యాచరణను ప్రకటించాం అని, త్వరలో మరింత విస్తారమైన కార్యాచరణను ప్రకటిస్తామని ఈటెల అంటున్నారు. అదంతా పూర్తయ్యేవరకు తెరాస విలీనం గురించిన ఆలోచన చేయదనే సత్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ తెలుసుకుంటే బాగుంటుంది. విభజన నిర్ణయం వలన కేవలం సీమాంధ్ర ప్రాంతంలో మాత్రమే కాదు.. తెలంగాణలో కూడా తమక సమాధి తప్పడం లేదని వారికి ఒక స్పష్టత చేకూరుతుంది. [/size][/size][/font][/color]

×
×
  • Create New...