Jump to content

Meher Ramesh Anna Meeru Devudanna


Recommended Posts

Posted

1383800989-1157.jpg

 

మెహర్‌ బాబా లీలలు!!

భారీ బడ్జెట్‌ ఉంటే తప్ప సినిమా తీయలేనని చెప్పే మెహర్‌ రమేష్‌ నిర్మాతల నడ్డి విరిచి పారేస్తాడు. అతనితో సినిమా చేసిన తర్వాత ఎంతటి నిర్మాత అయినా కుదేలైపోతాడు. శక్తి తర్వాత అశ్వనీదత్‌ అంతటి నిర్మాతే ఇంతవరకు సినిమా మొదలు పెట్టలేదు. షాడోతో ఆ నిర్మాతలకి కూడా సగానికి పైగా నష్టాన్ని మిగిల్చాడు. భారీ డిజాస్టర్‌లు ఇచ్చే మెహర్‌ రమేష్‌పై సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో చాలా జోక్స్‌ పేలుతుంటాయి. 'మెహరిజమ్‌' అని, 'మెహర్‌ బాబా' అని రమేష్‌ని కామెడీ చేస్తుంటారు. షాడో తర్వాత ఇంతవరకు మరో సినిమా ఏదీ ఓకే చేసుకోలేకపోయిన మెహర్‌ రమేష్‌ ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్నాడు. 

తన పెట్‌ డాగ్‌కి కూడా పుట్టినరోజు జరిపే మెహర్‌ ఆ ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో కూడా పెట్టేస్తున్నాడు. కెరీర్‌ బిగినింగ్‌లోనే ఎన్టీఆర్‌, ప్రభాస్‌, వెంకటేష్‌లాంటి స్టార్స్‌ని డైరెక్ట్‌ చేసిన మెహర్‌ రమేష్‌ ఇప్పుడు కూడా పెద్ద హీరోల వెంటే పడుతున్నాడు. అయితే శక్తి, షాడో తర్వాత చాలా మంది అతనికి దూరంగా ఉంటున్నారు. నిర్మాతల్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్న మెహర్‌ రమేష్‌ తన సినిమాలతో, అందులో హీరోలతో వేయించే వింత వేషాలతో వారిని నవ్వుల పాలు చేస్తున్నాడు. ఇంత బ్యాడ్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న మెహర్‌కి మలి చిత్రం ఇచ్చేదెవరనేది చూడాలి. 

×
×
  • Create New...