Jump to content

Aanjaneyaswamy


Recommended Posts

Posted

పంచభూతముల సమగ్ర స్వరూపమే సుందర నయనానందకర ప్రకృతి. ప్రాకృతిక అందాలలో వర్ణనాతీతమైన అలౌకిక ఆనందం , మానవీయ మమతలు, విషయ పరిశోధన, నిరాకార సత్యాన్వేషణ, ధర్మ పరిరక్షణ, దుష్ట శిక్షణ రససిద్ధి వట్టి లేక్కనలవి కాని గుణగణాలను పండిత పామరులకు బోధపడుటకు భగవంతుడు అనే శక్తీ స్వరూపం ప్రకృతి ని సమన్వయకర్తను చేసి వేర్వేరు ప్రాంతాలలో సకల జీవరాసుల సంక్షేమం కొరకైవివిదాకార స్వరూపాలలో నిరాకార శక్తిని వ్యాప్తి చేయుచునే వున్నదివీటన్నింటి లో నా మస్తిష్కమందు సదా మెదిలే "పవన" స్వరూపం , భక్తి ప్రపూర్ణ, వాక్పరిపాలక చాతుర్యుడు . ప్రచండ వాయు రూప సమాన్వితుడు, వీరోచిత ధైర్య, స్ధైర్య సాహసోపేత రూపోద్దారి, వానర కుల శ్రేష్ట, అసామాన్య పట్టుదలకు  రూపావిష్క్రుతం... ఆంజనేయ తత్వం..గురు కటాక్షం తధ్యం

 

tallest-hanuman-statue-veera-abhaya-anja

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    10

  • ravula

    2

  • micxas

    2

  • kevvu

    1

Top Posters In This Topic

Posted

Gp

Posted
గధను చేత పట్టి, భక్తిని అణువణువునా చుట్టి , అసమానమైన శక్తి గణములతో పుట్టిన  సుందరానందా 
రామ నామము చేపట్టి, రాఘవునికి బాసటగా నిలిచి  వానర బలాలను నీ వాక్భలముతో జత కట్టి
, సాగరాన్ని దాటి  సీతమ్మను  కనిపెట్టి,రావణపురమును తగలెట్టి, గుండెలను చీల్చి సీతారాములను నిలిపిన వాయుపుత్రా 
 
Posted
శ్రీ రామ నామ మాధుర్యము ను లోకానికి చాటి చెప్పుటకు అన్జనాసుతునిగా అవతరించిన శివామ్సమా,
దినకరుని చూచి ఆట వస్తువుగా తలచి  ఆకసంబునకేగి ప్రయాసపడిన పవనపుత్రా 
నీ దేహమంతటా కప్పిన సిందూరము, ఏ నాడు ఏ పుణ్యము జేసెనో 
ఆ వడ మాలకు ఎంతటి మోక్షమో, నీ పూజలో  ప్రీతిగా దరింతువే 
 
Posted

"తన శక్తి గూర్చి తానెరుగడు" అన్న నానుడి లో ప్రధమోత్తముడు నీవు కాదా. ఊరకనుండునా మనసు  మలినపడి లేచి పరుగులు పరిగెడుతున్నదే స్వాంతన చేకూర్చు "హనుమంతా".

అన్య విషయముల మీద మోజింక లేకుండా మొహాన్ని మట్టుపెట్టి, మోక్షానికి దారి సులువు చేయవా "సంజీవ"

Posted
జనులేమి అనుకున్న ఒరగదేమి ఎసరు పెసరైన, నిను కీర్తించ తప్ప వేరొక ఆస లేదు 
నీ దర్శనం  లబింపునట్టు గా  మార్గము సుగమనము కానిమ్ము, అది తప్ప వేరొక కాంక్ష వలదు నాకు
ఆకసమను అంటితివా, నీవే ఆకసమా అను నట్టు అగుపడుచున్నావు "ఆంజనేయ"
నీ రూపమును స్మరించిన తరుణం, పరవశము తో  రోమకూపములు ప్రేరణ చెందెను 
×
×
  • Create New...