Aston08 Posted November 19, 2013 Report Posted November 19, 2013 జగడాల జగన్ 'నేను జగనన్న వదలిన బాణాన్నీ...' అని ఊరూరూ తిరుగుతూ మైకుపట్టుకుని హోరెత్తించిన షర్మిల... జగన్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరమైపోయారు. సోమవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరుకాలేదు. 'ఆమెకు పార్టీలో ఏ హోదా లేదు. అందుకే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రాలేదు' అని కొందరు నేతలు అంటుండగా.. 'జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఏ హోదా లేకుండానే పాదయాత్ర చేయలేదా? బస్సు యాత్రలు నిర్వహించలేదా? పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నించలేదా? ఇప్పుడు మాత్రం షర్మిలకు పార్టీలో హోదా లేదనే విషయం గుర్తుకొచ్చిందా?'' అని మరికొందరు నిలదీస్తున్నారు. షర్మిలను దూరం పెడుతున్నారన్న ప్రచారంతో ఇప్పటికే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో... విస్తృతస్థాయి సమావేశానికి రావాల్సిందిగా జగన్ పిలిచారని, అయినప్పటికీ ఆమె ససేమిరా అన్నారనీ తెలుస్తోంది. కడప పార్లమెంటు సీటు ఆశించి భంగపడిన షర్మిలకు పార్టీలో ఏ హోదాలేదు. ఆమెను జగన్ సామాన్య కార్యకర్తలాగానే ట్రీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాబాయ్‌కీ హ్యాండిచ్చారా? వైసీపీలో కీలకనేతగా ఉన్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కూడా సోమవారం నాటి సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఉండి కూడా ఆయన సమావేశానికి రాలేదని తెలిసింది. సుబ్బారెడ్డి అమెరికా వెళ్లారని కొందరు చెబుతుండగా... కాదు, హైదరాబాద్‌లోనే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జగన్ జైలులో ఉన్నప్పుడే ఆయనకు సుబ్బారెడ్డిపై కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన ఒంగోలు ఎంపీ సీటు కోరినప్పుడు 'అది సాధ్యంకాదు' అని జగన్ దురుసుగా సమాధానం చెప్పినట్లు సమాచారం. అప్పటి నుంచి సుబ్బారెడ్డి మనస్తాపంతో ఉన్నారని, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం నాటి సభకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. నిజానికి... వైవీ సుబ్బారెడ్డికి అసలు అహ్వానమే రాలేదని, ఇక పిలవని సభకు వెళ్లే ప్రశ్న ఎలా తలెత్తుతుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. భూమా దంపతులకు షాక్ ఒకప్పుడు వైఎస్ విజయలక్ష్మికి ఒకవైపు కొండా సురేఖ, మరోవైపు శోభా నాగిరెడ్డి కనిపించేవారు. కొండా సురేఖ ఎప్పుడో దూరమైపోయారు. ఇప్పుడు శోభా నాగిరెడ్డి కూడా దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి అదే స్థానం ఆశిస్తున్నారు. భూమా నాగిరెడ్డి మాత్రం మొదటి నుంచి నంద్యాల ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే... నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు ఇచ్చిన హామీ మేరకు... తనకు నంద్యాల టికెట్ దక్కదని తెలియడంతో భూమా నాగిరెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. పైగా... 'మీ ఇద్దరికీ టికెట్లు ఇవ్వలేం. ఎవరో ఒకరికే కుదురుతుంది' అని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూమా దంపతులు సోమవారం నాటి సభకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. విలేకరులు ఫోన్ చేయగా... వ్యక్తిగత పనులవల్లే సమావేశానికి రాలేకోయినట్లు శోభా నాగిరెడ్డి చెప్పారు. మరోవైపు మేనమామ రవీంద్రనాథ్ కడప జిల్లా కమలాపురం టికెట్ ఆశిస్తుండగా, 'సారీ మామా, కమలాపురం అమ్మ పోటీ చేస్తుంది' అని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎటూ చెప్పలేని విజయలక్ష్మి జగన్ - వైవీ సుబ్బారెడ్డి మధ్య తలెత్తిన విభేదాల్లో విజయలక్ష్మి జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. తన కుమారుడికి నచ్చజెప్పలేక ఆమె చేతులెత్తేసినట్లు చెబుతున్నారు. షర్మిల మాత్రం మొదటి నుంచి బాబాయ్ వర్గంలో ఉన్నారు. సోమవారం నాటి సభకు విజయలక్ష్మి తనంతట తాను రాలేదని, పిలవాల్సి వచ్చిందని పార్టీ నేతలు తెలిపారు. భ్రమలు వీడుతున్నాయ్... వైఎస్ మరణించినప్పుడు సొంత కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా కన్నీరు పెట్టి, జగన్ కోసం మంత్రి పదవిని, తెలంగాణలో తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన కొండా సురేఖను ఆ తర్వాత పూచిక పుల్లలా తీసిపడేశారు. కాంగ్రెస్‌లో ఉంటూనే జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాదించిన ఎంపీ సబ్బం హరిని 'నువ్వెరు? నీకేం హక్కుంది!' అంటూ నిలేశారు. ఇతర పార్టీల్లో గౌరవనీయ స్థానాల్లో ఉన్నవారిని తమ పార్టీలోకి చేర్చుకుని రోజులైనా గడవకముందే వారిని 'హద్దుల్లో ఉండండి' అని హెచ్చరిస్తున్నారు. యాత్రలు, సభల పేరిట తెలంగాణ నేతలతో లక్షలకు లక్షలు ఖర్చుపెట్టించి... చివరికి విభజనపై ప్లేటు ఫిరాయించి, వారందరి నెత్తిన గుడ్డ వేసేశారు. దీంతో... సీటుపై కోటి ఆశలతో ఉన్న పార్టీని వదిలి జగన్ గూటికి చేరిన అనేక మంది సీనియర్ నేతలు ఇప్పుడు 'అంతా భ్రాంతియేనా' అనే పాట పాడుకుంటున్నారు. జగన్ బాబాయ్, చెల్లెలి పరిస్థితే పార్టీలో ఇలా ఉండటంతో వారికి తమ భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. ఇప్పటికే జగన్ అంటో ఏమిటో చాలామందికి తెలిసొచ్చింది. సీనియర్ నేత దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌కు విశాఖ సిటీ టికెట్ ఖరారు కాలేదు. తమ్మినేని సీతారాంకు ఆముదాలవలస టికెట్‌పై గ్యారెంటీ లభించలేదు. అధ్యక్షుడి వద్ద ఈ విషయం ప్రస్తావిస్తే... 'ముందు మంచి పనితీరు కనపరచండి' అని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన కుమారుడికి తెనాలి టికెట్ ఇప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆ మేరకు జగన్ నుంచి హామీ కూడా లభించినట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే... ఇప్పుడు ఆ టికెట్ ఓ విద్యాసంస్థల యజమానికి ఖరారైనట్లు తెలియడంతో ఉమ్మారెడ్డి ఆందోళనలో పడినట్లు సమాచారం.
ChandraSekharCherukuri Posted November 19, 2013 Report Posted November 19, 2013 Ee Donga gaadi brathuke anta.
Aston08 Posted November 19, 2013 Author Report Posted November 19, 2013 Ee Donga gaadi brathuke anta. vaadini nammukoni naaakuthu poina valla bathukulu kuda chanka naakipothunnai.. asalu sharru darling ne vaadu 10gey annadu ante naa heartu hurt aipothondhi baa.. endanaka vaananaka kashtapadi pebbi gaadni kuda vadilesi road la meedha adukkuntu thirigindhi... peddaga chillara ralakapoina kuda edusthune odaarpu chesindhi... papam asalu..
chegu Posted November 19, 2013 Report Posted November 19, 2013 Papam jaffas ki eppudu gnanodayam avuthundhooo
ChandraSekharCherukuri Posted November 19, 2013 Report Posted November 19, 2013 Papam sharu akkai, eal vundedi , Asale maa akkai stone barre stone. papam jdonga jaggu kosam oodarpu chesi chesi ila ayipoyindi
narap1i Posted November 19, 2013 Report Posted November 19, 2013 Jaggu Bhai....Garam Chai loki biscuits munchi gaaa
George_Brahmi_III Posted November 19, 2013 Report Posted November 19, 2013 rofl.. id posting enabled...
Recommended Posts