Jump to content

Tg Lo Assembly Seats Penchamantunnaru Reasons?


Recommended Posts

Posted

nenu inthavaraku political employment kosam ee proposal thechaaru anukunna kaani.. propose chesthunna valla plan verey laa undhey

 

తెలంగాణ సీట్ల పెంపులో మతలబేంది?

-అనుమానాలు రేకెత్తిస్తున్న కొత్త ప్రతిపాదన!
-అసెంబ్లీ సీట్ల పెంపునకు ఆరు నెలలు సరిపోయేనా?
-తెలంగాణకు ప్రొవిజినల్ అసెంబ్లీ?
-నిర్ణీత గడువులో ఎన్నికలకు మంగళం!

న్యూఢిల్లీ, నవంబర్ 26 (టీ మీడియా):ఉరుములు, మెరుపులు లేకుండా హఠాత్తుగా తెరమీదికి వచ్చిన తెలంగాణ సీట్ల పెంపు డిమాండ్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ బిల్లు నిర్ణయాత్మక దశకు వచ్చిన తరుణంలో ఈ అంశాన్ని ముందుకు తేవడంలో అంతరార్థమేమిటో అంతుచిక్కడం లేదు. రాజకీయ సుస్థిరత దిశగా అసెంబ్లీ స్థానాల పెంపు అంశానికి పెద్ద గా వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ అంశం ముందుకు తెచ్చిన సమయం, అలాగే బిల్లు తయారీలో ఇప్పటికే ఎదుర్కొంటున్న సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకుంటే దీని పర్యవసానాలు ఆందోళన కలిగించేవే. తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచాలంటే రాష్ట్ర ఏర్పాటు బిల్లులో ఈ అంశం చేర్చాల్సి ఉంటుంది.

reddy.png

ఆ తర్వాత కేంద్రం ఆదేశం మేరకు ఎన్నికల కమిషన్ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగిసి సాధారణ ఎన్నికలు ఆరు నెలల్లో జరగాల్సి ఉంది. ఈ సమయంలో డీలిమిటేషన్ చేపడితే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండకపోవొచ్చు. అలాగే అంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి విడదీసే తెలంగాణ అసెంబ్లీని ప్రొవిజినల్ అసెంబ్లీగా బిల్లులో పొందుపరచాల్సి వస్తుంది. అపుడు మాత్రమే ఈ అసెంబ్లీ డీలిమిటేషన్ పూర్తయ్యేదాకా కొనసాగే అవకాశం ఉంటుందని తెలిసింది. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉత్తరప్రదేశ్‌నుంచి విడదీసిన 22 సీట్లను 70కి పెంచారు. ఆ మేరకు డీలిమి చేప వీలుగా ఉత్తరాఖండ్ (అప్పట్లో ఉత్తరాంచల్) అసెంబ్లీని ప్రొవిజినల్ అసెంబ్లీగా ప్రకటించారు. ఇపుడూ అదే రీతిలో ప్రక్రియ చేపట్టాలని టీ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. అయితే దీని కారణంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? డీలిమి ఈ కొద్దికాల పరిమితిలో పూర్తవుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది ఏ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది.

ప్రొవిజినల్ అసెంబ్లీ అంటే.?
ఒక రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను డీలిమి ద్వారా పెంచి నిర్దారించేంత వరకు ప్రస్తుతమున్న అసెంబ్లీలోని ఎమ్మెల్యేలను యధావిధిగా కొనసాగించడానికి రాజ్యాంగం కల్పించిన అవకాశమే ప్రొవిజినల్ అసెంబ్లీ విధానం. ప్రొవిజినల్ అసెంబ్లీకి కాలపరిమితితో సంబంధం ఉండదు. అదనపు స్ధానాలను ఎన్నికల కమిషన్ నిర్దారించి ప్రకటించే వరకు అసెంబ్లీకి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ గడువు 2014 మే నెల వరకు ముగియనున్నది. రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ గడువు ముగియగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాని ఒకసారి విభజన బిల్లులో తెలంగాణ రాష్ట్రంలో ప్రొవిజినల్ అసెంబ్లీ అని పేర్కొంటే శాసనసభ ఎన్నికలకు గడువుతో సంబంధం ఉండదని తెలిసింది. అసెంబ్లీ స్థానాలను పెంచడం, తగ్గించడం చేసే క్రమంలో సమయం సరిపోకపోతే వీలయినన్ని రోజులు అసెంబ్లీ కాలపరిమితిని పొడిగించే అవకాశముంటుందని తెలిసింది. ఈ రకమైన ఏర్పాటు ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో ‘ఉత్తరప్రదేశ్ పునర్విభజన చట్టం-2000’లోని సెక్షన్ 12(1)లో పొందుపరిచారు. అందులో ఉత్తరాఖండ్ అసెంబ్లీని ‘ప్రొవిజినల్ అసెంబ్లీ’ గా పేర్కొని 22 అసెంబ్లీ స్థానాలను 70 కి పెంచిన తరువాతే నూతన రాష్ట్రానికి ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది.

లోక్‌సభ స్ధానాల పరిధిలో అసెంబ్లీలు
ఒక్క లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్ని అసెంబ్లీ స్ధానాలుండాలి అనే విషయంలో ఒక్కోరాష్ర్టంలో ఒక్కో విధానముంది. ఉత్తర ప్రదేశ్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలుండగా బీహార్‌లో ఆరు ఉన్నాయి.తెలంగాణలో ఒక్కో పార్లమెంటు పరిధిలో 7 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటి పరిధిలో మరో రెండు స్థానాలను పెంచాలనేది మర్రి ఆలోచన. దీని ప్రకారం 17 లోక్‌సభ స్థానాలలో రెండేసి చొప్పున 153 కు చేరుతాయి. పెంపునకు కేంద్రం ఓకే అంటే ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు’లో ఈ అంశాన్ని పొందు పరిచే అవకాశముంది.

Posted

ade SA lo kuda propose cheyochu kada ??

 

endhuku mayya political buffoons count perugthundhi thappa janam ki em upayogam cheppu

Posted

naku telisi 119 unnai T lo

 

120 aithe tappa Vidhana mandali form cheyataniki chance undadu...politically unemployed persons kosam sasana mandali undali ga

×
×
  • Create New...