tom bhayya Posted November 27, 2013 Report Posted November 27, 2013 న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని, అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఓ సర్వే చెబుతోంది. ఏబీపీ న్యూస్- దైనిక్ భాస్కర్ - నీల్సన్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. మొత్తం 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్ఈలో బీజేపీకి 33 శాతం ఓట్లతో 32 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 26 శాతం ఓట్లతో 25 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చాయి. ఇక బిల్లులు కట్టొద్దంటూ చీపురుకట్ట గుర్తుతో ప్రచారం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 23 శాతం ఓట్లు సాధించినా.. 10 స్థానాలు మాత్రమే దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరుండాలని అడిగితే మాత్రం ఎక్కువమంది బీజేపీ అభ్యర్థి హర్షవర్ధన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయన తర్వాత అత్యంత సమీపంలో కేజ్రీవాల్ నిలిచారు. అయితే.. దాదాపు 15-20 స్థానాల్లో అతి తక్కువ తేడాతో (రెండు శాతం) ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని కూడా సర్వే చెప్పింది. ధరల పెరుగుదల అంశం అధికార కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంగా మారుతుందని, గత 15 ఏళ్లుగా షీలాదీక్షిత్ చేసిన అభివృద్ధిని గుర్తించినా ఈసారి మాత్రం అధికారాన్ని కట్టబెట్టే యోచనలో లేరని సర్వే తేల్చింది. delhi laanti metro lo kabatti koncham voters ni influence cheyagaligaaru.. rural lo aithey 2% kuda vacheyvi kaadhu emo votes...
Recommended Posts