Jump to content

Tg Pitha Ki Competetion...

Recommended Posts

Posted

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తాను చేసిన కృషివల్లే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయం వెలువడిందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.  హైకమాండ్ పెద్దలను ఒప్పించడానికి తాను రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నట్లు సమాచారం. తాను లేకుంటే ఈ నిర్ణయమే వచ్చేది కాదని అన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, టీచర్ ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి తదితర నాయకులు బుధవారమిక్కడ జైపాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశం ప్రస్తావనకు రాగా.. జైపాల్‌రెడ్డి పైవిధంగా స్పందించినట్లు ఆయన్ను కలిసిన నేతలు చెప్పారు. తెలంగాణపై హైకమాండ్ పెద్దలందరినీ ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డానని, సోనియాసహా పార్టీ పెద్దలందరినీ కలిసి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ వచ్చానని జైపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ సాధనకోసం తన పార్లమెంటు నియోజకవర్గానికే దూరమయ్యానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వస్తే రాజ్యాంగ, న్యాయ పరమైన ఇబ్బందులు ఎన్నో వస్తాయని హైకమాండ్ పెద్దలు, సీమాంధ్ర నేతలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఒట్టివేనని నిరూపించేందుకు చాలా శ్రమిస్తున్నానని తెలిపారు. పలువురు న్యాయనిపుణులను సంప్రదించడంతోపాటు తన వాదనకు సరిపడా శాస్త్రీయ ఆధారాలతో జీవోఎం సభ్యుల ఎదుట హాజరై గట్టి వాదనలు విన్పిస్తున్నానని చెప్పారు. కాగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు అడ్డంకిగా ఉన్న 371(డి)ని సవరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని జైపాల్‌రెడ్డిని పూల రవీందర్, మోహన్‌రెడ్డి కోరారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని, జీవోఎం నివేదిక సిద్ధమైందని ఆయన చెప్పారు. ముందే ఈ అంశాన్ని తన దృష్టికి తెచ్చినట్లయితే.. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేవాడినన్నారు. అయినా ఈ విషయంలో తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.

everybody wants to cash on it

ramarajan2.gif

×
×
  • Create New...