Jump to content

Recommended Posts

Posted

బీజింగ్: దొంగల్లోనూ మంచితనం ఉంటుందని చాటుకున్నాడు ఓ చైనా దొంగ. తాను అపహరించిన యాపిల్ ఐఫోన్‌లోని సమాచారాన్ని బాధితుడికి పంపించి తన మంచితనాన్ని ప్రదర్శించాడు. అయితే ఐఫోన్ మాత్రం బాధితుడికి పంపించలేదు. చైనాలో జరిగిన ఈ ఘటన వార్త ప్రచార సాధనాల్లో విస్తృత ప్రచారం పొందుతోంది. చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ హునన్‌కు చెందిన బాధితుడు జో బిన్ షేరింగ్ టాక్సీలో ప్రయాణిస్తూ తన యాపిల్ ఐఫోన్‌ను పోగొట్టుకున్నాడు. టాక్సీ దిగిన తర్వాత తన ఫోన్ చోరీకి గురైందని గుర్తించిన జో బిన్ తన ఫోన్‌కు ఓ సందేశాన్ని పంపించాడు. తన ఫోన్‌లో ఉన్న నంబర్లకు బ్యాకప్ లేదని, దయచేసి తిరిగి తన ఫోన్ ఇచ్చేయాలని బాధితుడు తన సందేశంలో కోరాడు
.

ఫోన్‌ను తన చిరునామాకు పంపించాలని ఆ సందేశంలో దొంగకు విజ్ఞప్తి చేశాడు. తన పక్కన కూర్చున్న వ్యక్తే ఫోన్ దొంగిలించాడని, ఆ వ్యక్తి తనకు తెలుసునని కూడా ఆ సందేశంలో పేర్కొన్నాడు బాధితుడు. నీవు మంచి వానివైతే తన ఫోన్‌ను తిరిగి పంపించాలని బాధితుడు దొంగను కోరాడు. కాగా ఏమనుకున్నాడో ఏమో గానీ ఆ దొంగ కొంత ఆలోచించినట్లు ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఫోన్‌లో ఉన్న సుమారు వెయ్యి నెంబర్లను పేర్లతో సహా 11 పేజీలలో తన స్వహస్తాలతో రాసి బాధితునికి ఓ కొరియర్ పంపించాడు. అందులో బాధితునికి సంబంధించిన సిమ్‌ను కూడా పంపిచాడు. దీంతో బాధితుడు కొంత ఊరట చెందినా తన ఐఫోన్ పోయిందనే బాధను మాత్రం వ్యక్తం చేశాడు. అయితే బాధితునికి కంటే ఎక్కువగా చైనీయులు ఆ దొంగను ప్రశంసలతో ముంచెత్తారు. చైనాలోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఆ దొంగ నిజాయితీని, దయా గుణాన్ని కొనియాడుతూ సందేశాలు పంపించారు.

 

Posted

idemi lolli ra babu , good donga , bad donga ani...donga, donga ne kada

Posted

guddilo mella type .. papam phone poindhi  kastame kadaa.. data dorikindanna thrupthi kanna .. phone baadhe ekkuva .. evvarikaina vuntundhi 

 

×
×
  • Create New...