Avataar Posted November 29, 2013 Report Posted November 29, 2013 idedo naaku use ayye thrd laa undi..thnk you bhayya..keep it coming...asale ...nenu telugu lo poor :3D_Smiles_38:
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది.గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు. లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము) హ్రస్వాచ్చులు అన్నీ లఘువులుఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.ఉదా - క,చి,టు,తె,పొ హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.ఉదా - సృ,తృ,కృ మెదలయునవి గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు. దీర్ఘాలన్నీ గురువులుఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.ఉదా - సై,కా,తే,చీ విసర్గతో కూడిన అక్షరములు గురువులు.ఉదా - త:,దు:,అ: సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు.ఉదా - అం,కం,యం,రం సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులుఉదా - లక్ష్మి,పద్మ ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులుఉదా - అమ్మ,అక్క,పువ్వు పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులుఉదా - ఖ,ఘ,ఛ,ఝ
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 గణములు గణములు రెండు రకములు 1.విసర్గ గణములు 2.ఉప గణములు 1.విసర్గ గణుములు : లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు లగ IU ఉదా: రమా గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ గగ UU ఉదా: రంరం, సంతాన్ ఇవి రెండక్షరములతో కూడినవి మూడక్షరాల గణాలు ఆది గురువు భ గణము UII మధ్య గురువు జ గణము IUI అంత్య గురువు స గణము IIU సర్వ లఘువులు న గణము III ఆది లఘువు య గణము IUU మధ్య లఘువు ర గణము UIU అంత్య లఘువు త గణము UUI సర్వ గురువులు మ గణము UUU గురు లఘువులులను తేలికగా గుర్తించుటకు ఒక పద్దతి
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 అచ్చులు-16 అఆఇఈఉఊఋౠఎఏఐఒఓఔఅంఅః హల్లులు-37 కఖగఘఙ చఛజఝఞ టఠడఢణ తథదధన పఫబభమ యరలవశషసహళక్షఱ
fake_Bezawada Posted November 29, 2013 Report Posted November 29, 2013 hi jailer job change ayyanu annay ippudu mana technology grails and groovy eppudaina vinnava avi ento kothaga vundhi vati meedha working
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 hi jailer job change ayyanu annay ippudu mana technology grails and groovy eppudaina vinnava avi ento kothaga vundhi vati meedha working vina ledu choostanu vundu afternoo Any how congrats and all the best will get back to u on those topics
Avataar Posted November 29, 2013 Report Posted November 29, 2013 అచ్చులు-16 అఆఇఈఉఊఋౠఎఏఐఒఓఔఅంఅః హల్లులు-37 కఖగఘఙ చఛజఝఞ టఠడఢణ తథదధన పఫబభమ యరలవశషసహళక్షఱ ee lines choosi zamaana avutundi :3D_Smiles_38: thq.....2nd look estha...first time....didnt get it
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 ఎ.శబ్దాలంకారములు - 1.వృత్యానుప్రాసము - ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో అది వృత్తానుప్రాసాలంకారము అనబడును.ఉదా - అమందా నందంబున గోవిదుడు ఇందిరి మందిరంబు చొచ్చి.2.చేకాను ప్రాసము - అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెంటవెంటనే ప్రయేగించును.ఉదా - పాప హరుహరు సేవించెదను.3.లాటానుప్రాసము - అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట.ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ4. యమకము - అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమకమగును.ఉదా - లేమ దనుజులగెలువగా లేమా5.ముక్తపద గ్రస్తము - పాదము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభించుట. బి.అర్ధాలంకారములు - 1.ఉపమాలంకారము - ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించును.2.ఉత్ప్రేక్షాలంకారము - ఉపమేయమును ఊహించుటను ఉత్ప్రేక్షాలంకారము అందురు.ఉదా - ఆ వచ్చుచున్న ఏనుగునడగొండమేమో అనునట్లున్నది.3.రూపకాలంకారము - ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారము అందురు.ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము4.శ్లేషాలంకారము - అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పుట శ్లేషాలంకారము.ఉదా - రాజు కవలయానందకరుడు.5.అర్ధాంతరన్యాసము - సామాన్యమును విశేషము చేతను,విశేషమును సామాన్యము చేతను సమర్ధించుట.ఉదా - మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది.6.అతిశయోక్తి - ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట.ఉదా - ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవి.7.దృష్టాంతము - ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట.ఉదా- ఓరాజా నీవే కీర్తిమంతుడవు.8.స్వభావోక్తి - జాతి గుణజ్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించుట.ఉదా - అరణ్యమునందు లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచు పరిగెడుతున్నవి
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును.ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,ముని + ఇంద్ర = మునీంద్ర2.గుణసంధి - అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను.ఉదా - దేవ + ఇంద్ర = దేవేంద్ర, రాజ + ఋషి = రాజర్షి3.వృధ్ది సంధి - అకారమునకు ఏ,ఐలు పరమైన ఐ కారమును ఓ,ఔ లు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును.ఉదా - ఏక + ఏక = ఏకైక,దేశ + ఔన్నత్యము = దేశౌన్నత్యము4.యణాదేశ సంధి - ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను.ఉదా - అతి + అంతము = అత్యంతము, మను + అంతరము = మన్వంతరము5.అనునాశిక సంధి - క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగునుఉదా - వాక్ + మయము = వాజ్మయము6.శ్చత్య సంధి - స,త,థ,ద,ధ,స లకు శ,చ,చ,జ,ఝ,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,ణ,మ లు వికల్పముగా ఆదేశంగును.ఇదా - మనస్ + శాంతి = మనశ్శాంతి,జగత్ + జనులు = జగజ్జనులు7. విసర్గ సంధి - విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగునుఉదా - చతు + శతాబ్దములు = చతుశ్శతాబ్దములు
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము.ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య 2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పముఉదా - ఏమి + అంటివి = ఏమంటివి3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము.ఉదా - రాముడు + అతడు = రాముడతడు4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును.5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును.ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు.ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు.7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును.ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును.ఉదా - సరసము + మాట = సరసపుమాట9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును.ఉదా - పేద + ఆలు = పేదరాలు10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును.ఉదా - భయము + పడు = భయపడు11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు.ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు 12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును.ఉదా - చేయి + అతడు = చేయునతడు13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగునుఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును.ఉదా - ఏమి + ఏమి = ఏమేమి15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును.ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు.ఉదా - పొలము + లు = పొలాలు.17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును.ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగునుఉదా - అలరు + మేను = అలరు జొడి19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు.ఉదా - నా + అది = నాది20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును.ఉదా - నీ + చూపు = నీదు చూపు21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది హల్లునకు ద్విత్వంబును విభాషనగు.ఉదా - మూడు + లోకాలు = మూడు లోకాలు
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 1.తత్పురుష సమాసము - ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము. ప్రధమా తత్పురుష సమాసము - పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము. ద్వితియా తత్పూరుష సమాసము - నెలతాల్పు = నెలను దాల్చినవాడు తృతియ తత్పురుష సమాసము - ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు. చతుర్ధీ తత్పురుష సమాసము - భూతబలి = భూతము కొరకు బలి. పంచమీ తత్పూరుష సమాసము - చోరభయము = చోరుని వల్ల భయము. షష్టీ తత్పురుష సమాసము - రాజభటుడు = రాజు యొక్క భటుడు. సప్తమీ తత్పురుష సమాసము - మాటనేప్పరి = మాట యందు నేర్పరి నై తత్పురుష సమాసము - అధర్మము - ధర్మము కానిది. 2.కర్మధారయ సమాసము - విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము - కపోతవృద్దము = వృద్దమైన కపోతము విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము - మృదుమధురము = మదువును, మధురమును ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము - తేనెపలుకు = తేనెవంటి పలుకు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ముఖపద్మము = పద్మము వంటి ముఖము ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము - సంసారసాగరం = సంసారమనెడి సాగరము సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము - పెన్నానది = పెన్నా అను పేరు గల నది. 3.ద్విగు సమాసము - సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును. ఉదా - ముల్లోకములు = మూడగులోకములు 4.బహువ్రీహి సమాసము - అన్యపదము యొక్క అర్ధము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము. దీని అర్ధము చెడినపుడు కలది కలవాడు అని వచ్చును. 5.ద్వంద్వ సమాసము - ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును 6.అవ్యయూభావ సమాసము - సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ సమాసము. ఇందు పూర్వపదములు సామాన్యముగా అవ్యయములై ఉండును. ఉదా - యధాశక్తి = శక్తికి తగినట్లు ఉదా - పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది.
ILAQAT_MUFLIYA Posted November 29, 2013 Report Posted November 29, 2013 suuuufer post remembered my school days
ravula Posted November 29, 2013 Report Posted November 29, 2013 Good post baa It will help some of the dbians
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 డు, ము, వు, లు ప్రథమా విభక్తి నిన్, నున్, లన్, గూర్చి, గురించి ద్వితీయా విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయా విభక్తి కొఱకున్ (కొరకు), కై చతుర్ధీ విభక్తి వలనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి అందున్, నన్ సప్తమీ విభక్తి ఓ, ఓరీ, ఓయీ, ఓసీ సంబోధనా ప్రథమా విభక్తి
Recommended Posts