cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 లింగములు 3 రకాలు అవి1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు. 2. మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటిని స్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు. 3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.ఉదాహరణ - మగ్గము పగ్గము ముగ్గురు గజ్జెలు తప్పెట వియ్యము కయ్యము కళ్ళు నమ్మకం
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అంటారు.ఉదాహరణ - పద్యము (ద + య = ద్య) భగవద్గీత (దీ + గ = ద్గీ ) తర్కము (ర + క = ర్క) అభ్యాసము (భా + య = భ్యా) కార్యం (ర + య = ర్య) పుష్పము (ష + ప = ష్ప) ధర్మము (ర + మ = ర్మ) విద్య (ద + య = ద్య) సద్గుణము (దు +గ = ద్గు)
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.ఉదాహరణ - స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య ) ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు) సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య) వస్త్రము (స + త + ర = స్త్ర) రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర) వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య) సంస్కృతి (స + క + ర = స్కృ)
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 1 ప్రభవ యజ్ఞములు ఎక్కువగా జరుగును 2 విభవ ప్రజలు సుఖంగా జీవించెదరు 3 శుక్ల సర్వ శస్యములు సమృధిగా ఉండును 4 ప్రమోద్యూత అందరికీ ఆనందానిచ్చును 5 ప్రజోత్పత్తి అన్నిటిలోనూ అభివృద్ది 6 అంగీరస భోగములు కలుగును 7 శ్రీముఖ లోకములన్నీ సమృధ్దిగా ఉండును 8 భావ ఉన్నత భావాలు కలిగించును 9 యువ ఇంద్రుడు వర్షాలు కురిపించి సమృద్దిగా పండించును 10 ధాత అన్ని ఓషధులు ఫలించును 11 ఈశ్వర క్షేమము - అరోగ్యాన్నిచ్చును 12 బహుధాన్య దెశము సుభీక్షముగా ఉండును 13 ప్రమాది వర్షములు మధ్యస్తముగా కురియును 14 విక్రమ సశ్యములు సమృద్దిగా పండును 15 వృష వర్షములు సమృద్దిగా కురియును 16 చిత్రభాను చిత్ర విచిత్ర అలంకారాలిచ్చును 17 స్వభాను క్షేమము,ఆరోగ్యానిచ్చును 18 తారణ మేఘములు సరైన సమయములో వర్షించి సమృద్దిగా ఉండును 19 పార్ధివ సంపదలు వృద్ది అగును 20 వ్యయ అతి వృష్టి కలుగును 21 సర్వజిత్తు ప్రజలు సంతోషించునట్టు వర్షాలు కురియును 22 సర్వధారి సుభీక్షంగా ఉండును 23 విరోధి మేఘములు హరించి వర్షములు లేకుండా చేయును 24 వికృతి భయంకరంగా ఉండును 25 ఖర పుషులు వీరులగుదురు 26 నందన ప్రజలు ఆనందంతో ఉండును 27 విజయ శత్రువులను సం హరించును 28 జయ శత్రువులపైనా,రోగములపైనా విజయం సాధిస్తారు. 29 మన్మధ జ్వరాది భాదలు తొలిగిపోవును 30 దుర్ముఖి ప్రజలు దుఖర్మలు చేయువారగుదురు
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 31 హేవళంబి ప్రజలు సంతోషంగా ఉండును 32 విళంబి సుభీక్షముగా ఉండును 33 వికారి శత్రువులకు చాలా కోపం కలింగించును 34 శార్వరి అక్కడక్కడా సశ్యములు ఫలించును 35 ప్లవ నీరు సమృద్దిగా ఫలించును 36 శుభకృతు ప్రజలు సుఖంగా ఉండును 37 శోభకృతు ప్రజలు సుఖంగా ఉండును 38 క్రోధి కోప స్వభావం పెరుగును 39 విశ్వావసు ధనం సమృద్దిగా ఉండును 40 పరాభవ ప్రజలు పరాభవాలకు గురి అగుదురు 41 ప్లవంగ నీరు సమృద్దిగా ఉండును 42 కీలక సశ్యం సమృద్దిగా ఉండును 43 సౌమ్య శుభములు కలుగును 44 సాధారణ సామాన్య శుభాలు కలుగును 45 విరోధికృతు ప్రజల్లో విరోధములు కలుగును 46 పరీధావి ప్రజల్లో భయం కలిగించును 47 ప్రమాదీచ ప్రామాదములు ఎక్కువగా కలుగును 48 ఆనంద ఆనందము కలిగించును 49 రాక్షస ప్రజలు కఠిణ హృదయిలై ఉండెదరు 50 నల సశ్యం సమృద్దిగా ఉండును 51 పింగళ సామాన్య శుభములు కలుగును 52 కాళయుక్తి కాలయిక్తమయునది 53 సిద్ధార్ధి అన్ని కార్యములు సిద్దించును 54 రౌద్రి ప్రజలకు భాద కలిగించును 55 దుర్మతి వర్షములు సామాన్యముగా ఉండును 56 దుందుభి క్షేమము,ధాన్యాన్నిచ్చును 57 రుధిరోద్గారి రక్త ధారలు ప్రవహించును 58 రక్తాక్షి రక్త ధారలు ప్రవహించును 59 క్రోధన జయమును కలిగించును 60 అక్షయ లోకములో ధనం క్షీణించును
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 1 చైత్రము వసంత ఋతువు వేసవి కాలం (ఎండలు ఎక్కువగా ఉండును,వేడి గాలులు వీచును) 2 వైశాఖము 3 జ్యేష్ఠము గ్రీష్మ ఋతువు 4 ఆషాఢము 5 శ్రావణము వర్ష ఋతువు వర్షా కాలం (వర్షాలు విస్తారంగా కురుయిను) 6 భాద్రపదము 7 ఆశ్వయుజము శరత్ ఋతువు 8 కార్తీకము 9 మార్గశిరము హేమంత ఋతువు శీతా కాలం (చలి గాలులు వీచును) 10 పుష్యము 11 మాఘము శిశిర ఋతువు 12 ఫాల్గుణము
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 అశ్విని ౧౫ స్వాతి ౨ భరణి ౧౬ విశాఖ ౩ కృతిక ౧౭ అనురాధ ౪ రోహిణి ౧౮ జ్యేష్ట ౫ మృగశిర ౧౯ మూల ౬ ఆర్తర ౨౦ పూర్వాషాడ ౭ పునర్వసు ౨౧ ఉత్తరాషాడ ౮ పుష్యమి ౨౨ శ్రావణ ఆశ్లేష ధనిష్ఠ మఖ శతభిష పుబ్బ పూర్వాభాద్ర ఉత్తర ఉత్తరాభాద్ర హస్త రేవతి చిత్త
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం(శుక్లం అంటే తెలుపు ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి సమయానికి నిండుగా తాయారగును. 2 కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం(కృష్ణ అంటే నల్లని అని అర్థం) (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు)ఈ పక్షము నందు చంద్రడు క్రమేపీ తగ్గుతూ అమావాస్య సమయానికి పూర్తిగా క్షీణించును .
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి. 1 సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? బ్రహ్మం 2 సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు 3 సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం 4 సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం 5 మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం 6 దేనివలన మహత్తును పొందును? తపస్సు 7 మానవునికి సహయపడునది ఏది? ధైర్యం 8 మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన 9 మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన 10 మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును. 11 మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మౄత్యు భయమువలన 12 జీవన్మౄతుడెవరు? దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు 13 భూమికంటె భారమైనది ఏది? జనని 14 ఆకాశంకంటే పొడవైనది ఏది? తండ్రి 15 గాలికంటె వేగమైనది ఏది? మనస్సు 16 మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది 17 తౄణం కంటె దట్టమైనది ఏది? చింత 18 నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప 19 రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే 20 రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ణ్జం చేయుటవలన 21 జన్మించియు ప్రాణంలేనిది గుడ్డు 22 రూపం ఉన్నా హౄదయం లేనిదేది? రాయి 23 మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన 24 ఎల్లప్పుడూ వేగం గలదేది? నది 25 రైతుకు ఏది ముఖ్యం? వాన 26 బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు 27 ధర్మానికి ఆధారమేది? దయ దాక్షిణ్యం 28 కీర్తికి ఆశ్రయమేది? దానం 29 దేవలోకానికి దారి ఏది? సత్యం 30 సుఖానికి ఆధారం ఏది? శీలం 31 మనిషికి దైవిక బంధువులెవరు? భార్య/భర్త 32 మనిషికి ఆత్మ ఎవరు? కూమారుడు 33 మానవునకు జీవనాధారమేది? మేఘం 34 మనిషికి దేనివల్ల సంతసించును? దానం 35 లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 36 సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం 37 ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస 38 దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు 39 ఎవరితో సంధి శిధిలమవదు? సజ్జనులతో 40 ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? యాగకర్మ 41 లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు 42 అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు 43 లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ణ్జానం 44 శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు 45 మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో 46 తపస్సు అంటే ఏమిటి? తన వౄత్బికుల ధర్మం ఆచరించడం 47 క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం 48 సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం 49 సర్వధనియనదగు వాడెవడౌ? ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు 50 జ్ణ్జానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం 51 దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం 52 అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి వుండడం 53 సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట 54 దు:ఖం అంటే ఏమిటి? అజ్ణ్జానం కలిగి ఉండటం 55 ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం 56 స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం 57 దానం అంటే ఏమిటి? సమస్తప్రాణుల్ని రక్షించడం 58 పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు 59 మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు 60 ఏది కాయం? సంసారానికి కారణమైంది 61 అహంకారం అంటే ఏమిటి? అజ్ణ్జానం 62 డంభం అంటే ఏమిటి? తన గొప్పతానే చెప్పుకోవటం 63 ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో 64 నరకం అనుభవించే వారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు 65 బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే 66 మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి 67 ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు 68 ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు 69 ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు 70 ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం 71 లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు 72 స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 36 సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం 37 ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస 38 దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు 39 ఎవరితో సంధి శిధిలమవదు? సజ్జనులతో 40 ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? యాగకర్మ 41 లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు 42 అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు 43 లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ణ్జానం 44 శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు 45 మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో 46 తపస్సు అంటే ఏమిటి? తన వౄత్బికుల ధర్మం ఆచరించడం 47 క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం 48 సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం 49 సర్వధనియనదగు వాడెవడౌ? ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు 50 జ్ణ్జానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం 51 దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం 52 అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి వుండడం 53 సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట 54 దు:ఖం అంటే ఏమిటి? అజ్ణ్జానం కలిగి ఉండటం 55 ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం 56 స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం 57 దానం అంటే ఏమిటి? సమస్తప్రాణుల్ని రక్షించడం 58 పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు 59 మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు 60 ఏది కాయం? సంసారానికి కారణమైంది 61 అహంకారం అంటే ఏమిటి? అజ్ణ్జానం 62 డంభం అంటే ఏమిటి? తన గొప్పతానే చెప్పుకోవటం 63 ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో 64 నరకం అనుభవించే వారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు 65 బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే 66 మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి 67 ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు 68 ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు 69 ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు 70 ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం 71 లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు 72 స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి. 1 సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? బ్రహ్మం 2 సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు 3 సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం 4 సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం 5 మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం 6 దేనివలన మహత్తును పొందును? తపస్సు 7 మానవునికి సహయపడునది ఏది? ధైర్యం 8 మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన 9 మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన 10 మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును. 11 మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మౄత్యు భయమువలన 12 జీవన్మౄతుడెవరు? దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు 13 భూమికంటె భారమైనది ఏది? జనని 14 ఆకాశంకంటే పొడవైనది ఏది? తండ్రి 15 గాలికంటె వేగమైనది ఏది? మనస్సు 16 మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది 17 తౄణం కంటె దట్టమైనది ఏది? చింత 18 నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప 19 రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే 20 రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ణ్జం చేయుటవలన 21 జన్మించియు ప్రాణంలేనిది గుడ్డు 22 రూపం ఉన్నా హౄదయం లేనిదేది? రాయి 23 మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన 24 ఎల్లప్పుడూ వేగం గలదేది? నది 25 రైతుకు ఏది ముఖ్యం? వాన 26 బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు 27 ధర్మానికి ఆధారమేది? దయ దాక్షిణ్యం 28 కీర్తికి ఆశ్రయమేది? దానం 29 దేవలోకానికి దారి ఏది? సత్యం 30 సుఖానికి ఆధారం ఏది? శీలం 31 మనిషికి దైవిక బంధువులెవరు? భార్య/భర్త 32 మనిషికి ఆత్మ ఎవరు? కూమారుడు 33 మానవునకు జీవనాధారమేది? మేఘం 34 మనిషికి దేనివల్ల సంతసించును? దానం 35 లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం good one
Ruler4Dmasses Posted November 29, 2013 Report Posted November 29, 2013 Thank you cherlapalli baa.. Good post.. naaku telugu malli nerchukovalanundhi baa
cherlapalli_jailer Posted November 29, 2013 Author Report Posted November 29, 2013 jailer very very good post urs anu dal
Recommended Posts