Jump to content

Placing T-Law And Order Under Governor An Insult To T People : Lafangi


Recommended Posts

Posted

http://www.youtube.com/watch?feature=player_embedded&v=TqLmWridJrc

Posted

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన విధివిధానాలపై కొన్ని అభ్యంతరాలున్నాయని, వీటిని తాము ఖచ్చితంగా అంగీకరించమని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. ఇది సంబరాల సమయం కాదని, తయారైంది ముసాయిదా బిల్లు మాత్రమేనని, అభ్యంతరాలపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడే వరకు అప్రమత్తంగా ఉంటామని ఆయన చెప్పారు.

శాంతి భద్రతల పరిరక్షణ గవర్నర్‌కు అప్పగించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని కేసీఆర్ అన్నారు. ఆస్తులు, అప్పుల పంపకం జానాబా ప్రాతిపదికన చేయడం సరైన పద్ధతి కాదని, ఉన్నత విద్యా అడ్మిషన్లకు సంబంధించి ఇప్పుడ్ను పద్ధతి కొనసాగించడం బాధించే విషయమని కేసీఆర్ వివరించారు. నదీజలాల గైడ్‌లైన్‌పైనా కూడా అభ్యంతరాలున్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన హైకోర్టును వీలైనంత త్వరాగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమేం రావాలో ఒక ప్రణాళిక తయారుచేసి అన్నింటిని రాబట్టే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తెలంగాణ అస్తి అని, అది తెలంగాణకే చెందాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కొంత మంది ఆంధ్రా నుంచి వచ్చిన ఉద్యోగులు తెలంగాణలో రిటైర్డ్ అయ్యారని, వారి ఫించన్లు మేమేందుకు భరించాలన్నారు. ముసాయిదా బిల్లును రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల చేత పూర్తిగా అధ్యయం చేయిస్తున్నామని, తెలంగాణకు నష్టం చేసే అంశాలేవైనా ఉంటే తప్పకుండా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

గవర్నర్‌కు అధికారాలు రాజ్యాంగ విరుద్ధం: కేసీఆర్
తెలంగాణకు అధికారాలు ఇచ్చినట్టే ఇచ్చి గవర్నర్‌కు పర్యవేక్షణ బాధ్యతలివ్వడం తెలంగాణ ప్రజలను అగౌరవ పరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌ను సూపర్ కౌన్సెల్ ఆఫ్ మినిస్టర్స్‌గా చేయడం, తెలంగాణపై గవర్నర్ పర్యవేక్షణ బాధ్యత ఇవ్వడం ప్రజలను చిన్నచూపు చూడటమేనని అన్నారు. ఈ విధానం తెలంగాణ ప్రజలకు సమ్మతం కాదని తెలిపారు. తెలంగాణపై గవర్నర్‌కు ఇచ్చిన అధికారాలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు 29వ రాష్ట్రం తెలంగాణకు ఎందుకని ప్రశ్నించారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రాలకు సంబంధించింది. ఇందులో ఇతరుల జోక్యం ఎందుకని నిలదీశారు. ఈ విషయంపై కూడా ప్రధానికి రాసే లేఖలో ప్రస్తావిస్తామన్నారు. పార్లమెంట్‌కు వచ్చే తుది బిల్లులో మార్పులు చేయాలని సూచించారు. ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకున్నాం అంతేగానీ, హైదరాబాద్‌పై ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. అసలు రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని ప్రస్తావనేలేదని, అయినా పక్కవాళ్లకు ఇబ్బందులు కలుగకూడదనే తాము ఉమ్మడికి ఒప్పుకున్నామని తెలిపారు. అలాంటపుడు ఆంక్షలు ఎలా విధిస్తారని ప్రశ్నించారు.

జనాభా ప్రాతిపదికన అప్పులు పంచడం దారుణం: కేసీఆర్
జనాభా ప్రాతిపదికన అప్పులు, ఆస్తులు పంచడం దారుణమని కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనాభా ప్రాతిపదికగా కేటాయింపులను ఒప్పుకోమని తెలిపారు. అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన చేయడం తెలంగాణకు మళ్లీ ప్రమాదకరమని హెచ్చరించారు. అసలు జనాభా ప్రాతిపదికన ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. వీటి పంపిణి ప్రాజెక్టుల వారీగా ఉండాలని అన్నారు. తెలంగాణ స్టేట్ ఉండి ఉంటే ఇవాళ ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌజ్ తెలంగాణ రాష్ట్రానికే ఉండేదని అన్నారు. ఈవిషయాన్ని జీవోఎంకు తెలిపామన్నారు. సాంస్కృతికంగా తెలంగాణకు చెందిన ఆస్తులను పంచుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ హౌజ్ తెలంగాణ ఆస్తి అని అన్నారు. ఉద్యోగుల పంపిణీ, పెన్షనర్ల పంపిణీ జనాభా ప్రాతిపదికన చేయడం అశాస్త్రీయమని విమర్శించారు. ఈపద్ధతి తమకు ఆమోద యోగ్యం కాదన్నారు. 83 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులుగా రిటైర్డ్ అయ్యారు. వాళ్ల పెన్షనర్ల బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరిస్తుందని అన్నారు. వాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిందకే వెళ్లాలని తెలిపారు. ఉద్యోగాల పంపకాల విషయంలో పెద్ద మనుషుల ఒప్పందాన్ని వాళ్లు ఉల్లంఘించారని విమర్శించారు. నదీ జలాల పంపకాలపై కూడా తమకు అభ్యంతరాలున్నాయని స్పష్టం చేశారు.

విద్యావకాశాల్లో లింకెందుకు? : కేసీఆర్
విద్యావకాశాల్లో తెలంగాణకు ఆంధ్రకు మళ్లీ లింకులెందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ఏదో వరంగల్‌లో ఉన్నటువంటి నిట్‌లాంటి సంస్థల్లో 50 శాతం జాతీయంగా, మిగతా 50 శాతం లోకల్‌కు ఇస్తే అభ్యంతరం లేదన్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి ఉన్నత విద్యలో కామన్ ఎంట్రెన్స్ అంటే ఒప్పుకోమన్నారు. ఈ విధానంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.

హైకోర్టునిచ్చినందుకు సంతోషం : కేసీఆర్
ప్రస్తుతమున్న హైకోర్టును తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం సంతోషకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కానీ, రాజ్యసభ సీట్ల పంపకం తీరు కొంత అశాస్త్రీయంగా ఉందని అన్నారు. రాజ్యసభ సీట్ల కేటాయింపుల విషయంలో కూడా అశాస్త్రీయంగా ఉందని, తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు. 2014లో 2 సీట్లు, 2016లో 2 సీట్లు, 201లో 3 సీట్లుగా సవరించాల్సి ఉందని తెలిపారు. పార్లమెంట్‌కు వచ్చే తుది బిల్లులో ఈ మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వాళ్లకెన్ని నిధులిచ్చినా మాకభ్యంతరంలేదు: కేసీఆర్
సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీపై విలేకరులు ప్రశ్నించగా సీమాంధ్రకు కేంద్రం ఎన్ని ప్యాకేజీలు, నిధులిచ్చినా తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ అన్నారు. ఐదు లక్షల కోట్లు, పది లక్షల కోట్లు ఇచ్చుకోని మాకేం అభ్యంతరం అన్నారు. ‘ఒక సీమాంధ్ర నాయకుడు ఐదు లక్షల కోట్లు అన్నాడు. మరోకాయన పది లక్షల కోట్లు అంటున్నాడు. కేంద్రం అన్ని నిధులిస్తుందా?’ అని ప్రశ్నించారు. అయినా సీమాంధ్ర నేతలు ఇంకా ఆత్మవంఛన చేసుకోవద్దని, వాళ్ల ప్రజలకు నిధులడిగి తెచ్చుకోవాలిగానీ, ఇంకా విభజన వద్దంటూ యాగీ చేయడం సరికాదన్నారు.

×
×
  • Create New...