Jump to content

Today Is Real Independence For Tg...


Recommended Posts

Posted

తెలంగాణకు నేడే నిజమైన స్వాతంత్య్రం

-ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ
హైదరాబాద్, డిసెంబర్ 5 (టీ మీడియా): దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం గురువారమే వచ్చిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కేంద్ర మంత్రివర్గం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదించడం తనకెంతోఆనందాన్నిచ్చిందన్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని, సోనియాగాంధీ నిబద్దతకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల 56 సంవత్సరాల ఆకాంక్ష, త్యాగాలను కాంగ్రెస్‌పార్టీ గుర్తించిందని, ఇది తెలంగాణ ప్రజల విజయమన్నారు. మానవత్వం, సమానత్వం, ఆత్మగౌరవం ఉన్న నవ తెలంగాణ నిర్మించుకుందామని ఆయన అభివూపాయపడ్డారు. ఎందరో పోరాటయోధుల బలిదానం వల్ల తెలంగాణ సాధ్యమైందని ఆయన వివరించారు. తెలంగాణ వీరుల నిబద్దతను, పౌరుషాన్ని ఆయన కొనియాడారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, ఆమెకు తెలంగాణ సమాజం అండగా నిలబడాలని కోరారు. అందరి ఆశయాలకు అనుగుణంగా నవ తెలంగాణను నిర్మించుకోవాలని, ఇది జరగనట్లయితే మరో ఉద్యమానికి దారితీసే అవకాశం ఉందని దామోదర అన్నారు.

నా త్యాగానికి ఫలితం దక్కింది: కోమటిడ్డి వెంకటడ్డి
కేంద్ర కేబినెట్ పదిజిల్లాలతో కూడిన తెలంగాణకు ఆమోదం తెలపడంతో తన త్యాగానికి, అమరుల బలిదానాలకు తగిన ఫలితం దక్కిందని మాజీమంత్రి కోమటిడ్డి వెంకటడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో తెలంగాణవాదులు, విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారని, శ్రీకాంతాచారి మరణం చూసి చలించిపోయానని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేసి దీక్ష చేపట్టానని ఆయన వివరించారు. ఎన్నో సంవత్సరాల ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రజలు కోరుకున్న విధంగా రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో తన దీక్షకు, అమరుల ప్రాణత్యాగాలకు తగిన ఫలితం దక్కిందని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ మంత్రులకు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు ఏం జరిగినా అంతామరిచిపోయి.. ఇకపై ప్రాంతాలకు విడిపోయినా, అన్నదమ్ముల్లా కలిసుందామని ఆయేన సీమాంధ్ర నాయకులు, సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి, పునర్నిర్మాణానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.

ఐదున్నర దశాబ్దాల కల: రాజగోపాల్‌డ్డి
తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్ అనే మాటకు కట్టుబడి ఉండి ప్రస్తుతం తమ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తోందని భువనగిరి ఎంపీ కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి అన్నారు. పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. 1100 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాము నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేశామని, పార్లమెంట్, పార్టీ అధిష్ఠానం వద్ద తెలంగాణ ఆకాంక్షను తెలియజేశామని వివరించారు. ఈ సందర్భంగా పార్టీలో, బయట అనేక అవమానాలు ఎదుర్కొన్నా తాము లక్ష్యపెట్టలేదని చెప్పారు. నాలుగున్నర కోట్ల ప్రజల అయిదున్నర దశాబ్దాల కోరిక నెరవేర్చి అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ప్రజలపాలిట దేవతగా మారారన్నారు. సోనియాగాంధీకి, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కీలకపాత్ర పోషించిన కేంద్రమంత్రి జైపాల్‌డ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వపరంగా కీలక మందడుగుపడింది. తెలంగాణ ఏర్పాటు సాకారమైన ఇక తెలంగాణ ప్రాంతంలో సాగునీటివసతి, ఉపాధికల్పన లక్ష్యంగా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పారు. ఈ రెండు రంగాలను అభివృద్ధి చేస్తే తెలంగాణ పురోగతిలో పయనిస్తుందన్నారు. ఈ దిశగా తాము కృషి చేస్తామనిచెప్పారు.

×
×
  • Create New...