sitaraZahir Posted December 7, 2013 Report Posted December 7, 2013 -భద్రాచలంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటుచేస్తాం: కేంద్రమంత్రి బలరాంనాయక్ హైదరాబాద్, డిసెంబర్ 6 (టీ మీడియా): కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీ సీతమ్మ తల్లిలా భారత్‌కు వచ్చి తెలంగాణ ప్రకటించిందని కేంద్ర మంత్రి బలరాంనాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రాకపోతే ఎప్పుడూ వచ్చేది కాదని అభివూపాయపడ్డారు. భద్రాచలంలో తమ అధినేత్రి సోనియాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. శుక్రవారం ఆయన సీల్పీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నాడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. భద్రాచలం డివిజన్‌ను సీమాంవూధలో కలిపితే లాక్షలాది మంది ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని విన్నవించుకోవడంవల్ల తెలంగాణలోనే ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం న్యాయమైన తీర్పునే ఇచ్చిందని, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పొద్దన్నారు. తెలంగాణలో శాసనాసభ స్థానాలను పెంచినప్పుడు జిల్లాలోని జనాభాను పరిగణలోకి తీసుకుంటే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వానికి పడగొడుతామని సీమాంధ్ర నేతలు అంటున్న విషయాన్ని మీడియా ప్రశ్నంచిగా.. రెండు, మూడు నెలల్లో అయిపోయేదానికి ప్రభుత్వం పడిపోతేంటి, జారీపోతేంటి అని అన్నారు. ఎవన్ని కుట్రలు చేసినా పార్లమెంటులో తెలంగాణ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని మంత్రి చెప్పారు.హైదరాబాద్‌లో సోనియా విగ్రహం పెడుతాం: చిన్నాడ్డి తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెడుతామని ఏఐసీసీ కార్యదర్శి జీ చిన్నాడ్డి అన్నారు. ‘మా తోలు వలిచి చెప్పులు కుట్టి సోనియాగాంధీకి ఇచ్చినా రుణం తీర్చుకోలేం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సోనియగాంధీ ఫొటోను పెట్టుకోవాలని కోరారు. Siggu leni janmalu
Recommended Posts