Jump to content

Sushma Swaraj Tg Bathukamma....


Recommended Posts

Posted

సుష్మా తెలంగాణ బతుకమ్మ

-ఆమె రాయల తెలంగాణను తిరస్కరించారు
-పది జిల్లాల తెలంగాణ వచ్చేలా చేశారు
-అంబేద్కర్ వర్ధంతి సభలో కిషన్‌డ్డి
-ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఆయనకు నిజమైన నివాళి అని వ్యాఖ్య
హైదరాబాద్, డిసెంబర్ 6 (టీ మీడియా):పది జిల్లాల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన బీజేపీ నేత సుష్మాస్వరాజ్ తెలంగాణ బతుకమ్మ అని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి అన్నారు. రాయల తెలంగాణకు మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రి చిదంబరం కోరినా సుష్మా తిరస్కరించారని, పది జిల్లాల తెలంగాణ అని చెప్పి ఇప్పుడు రాయల తెలంగాణ ఏమిటని ఆమె ప్రశ్నించడంతో కాంగ్రెస్ తోకముడిచిందని అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ 57వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దళిత, గిరిజన, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగ నిర్మాత నమ్మారని అన్నారు. ఆయన స్ఫూర్తితో బీజేపీ చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉందన్నారు. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాకారం అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని అన్నారు. అంబేద్కర్ తమ నేతే అంటున్న కాంగ్రెస్, ఆయన ఆశయానికి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. చివరికి ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించిందని తెలిపారు. party.png
తెలంగాణ అంశంపై మాట్లాడుతూ ఒక్క ఓటున్న పార్టీ తెలంగాణ తమతోనే వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. బీజేపీ ఓట్లు లేకుండా తెలంగాణ రాదని గుర్తుంచుకోవాలని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ గురించి ఒక్క బీజేపీ మాత్రమే ప్రస్తావించిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినా అడ్డుకోవడానికి కొన్ని తెలంగాణ శక్తులతో కలిసి సీమాంధ్ర పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ సమయంలో ఈ కుట్రకు పాల్పడే అవకాశం ఉందన్నారు. బిల్లు సమయంలో పార్లమెంటులో కూడా అలాగే చేసే అవకాశం ఉందని, కానీ బీజేపీ వాటిని తిప్పికొట్టి తెలంగాణ బిల్లు ఆమోదం అయ్యేలా చేస్తుందని హామీ ఇచ్చారు. సమన్యాయం పేరుతో టీడీపీ, సమైక్యం పేరుతో వైఎస్సార్సీపీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర బంద్‌కు టీడీపీ పిలుపునివ్వడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఒకే ఒక ఓటున్న పాతబస్తి చిన్నపార్టీ నరేంవూదమోడీని ప్రధానికాకుండా అడ్డుకుంటామని ప్రగల్భాలు పలుకుతోందని, ఎవరేం చేసినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కే రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు బండారు దత్తావూతేయ, జంగాడ్డి, నాగం జనార్దనడ్డి, చింతా సాంబమూర్తి, ధర్మపాల్, ధర్మాడ్డి తదితరులు పాల్గొన్నారు.

సుష్మా ఒత్తిడితోనే తెలంగాణ: నాగం
బీజేపీ జాతీయ నేతల కారణంగానే పది జిల్లాల తెలంగాణకు కాంగ్రెస్ ఒప్పుకున్నదని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాగం జనార్దనడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుష్మా ఒత్తిడితోనే రాయల తెలంగాణ పక్కకు పోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకోసం సుష్మా నిరంతరం పాటుపడ్డారని చెప్పారు.

Posted

Politicians ni cheppu teskoni kottali

ala chesina kuda our grt politicians claim that

nanu costly cheppu tho kontharu ante naku yekuva value yecharu so am great please vote for me :5_2_108:

Posted

ala chesina kuda our grt politicians claim that

nanu costly cheppu tho kontharu ante naku yekuva value yecharu so am great please vote for me :5_2_108:

 

:3D_Smiles:  maa region lo manufacture aina chepputhoney kottali anaa

Posted

:3D_Smiles:  maa region lo manufacture aina chepputhoney kottali anaa

 

 

nuvvu chalaa hurt ayyinatlu vunnav ga TG tho ni brahmilaughing.gif

×
×
  • Create New...