kingmakers Posted May 15, 2009 Report Posted May 15, 2009 ఐదు సంవత్సరాలు స్టాకు మార్కెట్టు అయినా దిగువకు ఎగువకు మారుతూ మదుపరులతో దోబూచులాడింది కాని రాజా వారి పాలనలో అవినీతికి లాకులెత్తిన నాటి నుండి నిత్యావసర ధరలు నింగి కేసి దూసుకెళ్లింది కానీ ఏనాడూ నేలకేసి చూడ లేదు. కాసులు తప్పితే మరేమీ పట్టని ఒక మంత్రి రైతు బజారు కెళ్ళి మహిళల నిరసనతో బేజారు అయ్యి వచ్చాడు. ఇంకో వీరుడు ఎరువులను హైజాకర్లు ఎత్తుకెళ్ళారని హరి కథలు చెప్పాడు. తన శాఖ లోని అధికారులు ఒకటి చెబితే ఆ తరువాత గంటకు ఇంకో కథ చెబుతాడు మరో మంత్రి. క్షమా బిక్ష పెట్టి వెళ్లి పొండ్రా అంటే క్షమా బిక్ష మాకొద్దు జైలే పదిలం అని భావించే రోజులు పోయి అమ్మో జైలా అని బెదిరి న్యాయస్థానంలో జరిగే న్యాయానికి ముందే రామ కథను వినిపించి అత్యవసర మరణదండనలు విధించే ఆలయాలుగా అభివృద్ధి చెందాయి. పంచ భూతాలనూ వదలక ఏమాత్రం బెదరక జన క్షేమానికి తీరిక లేక ఆఖరికి ఎన్నికలతో ఊపిరి తీసుకోడానికి కూడా తీరిక లేకుండా గడిపి ఇన్ని రోజులూ ఇంటికి పంపినది ఎంతో చూసుకోడానికి వెళ్లి నీళ్ళతో చావు తెచ్చు కొన్నా పట్టించుకొనే దిక్కు లేని పాలనలో కొనాలంటే కోడైనా బియ్యమైనా బీరైనా ఏదైనా ఈరోజు ఎంత ఉంటుందో రేపు ఎంత ఉంటుందో తెలియనంతగా అవినీతికి ఆసరా ఇచ్చి ఇన్నాళ్ళూ పెంచి పోషించి గంటల్లో శుభం కార్డు పడే ముందు రాజా వారు అధికారులకు పూర్తి స్వేచ్చనిచ్చారు అత్యవసర నిల్వల పై దాడి చేయమని అచ్చు తెలుగు సినిమా క్లైమాక్సులో పోలిసులు వచ్చినట్టు.
Recommended Posts