Jump to content

Recommended Posts

Posted

lunch time avuthundhi...Lunch meedha oka kavitha ready chaesukooPK.gif

PK.giflunch meeda flowaa.. adhi raatthe inka sleefsee

Posted

 

కాఫీ చుక్క పడగానే, వేకువకు వేగము నేర్పెను 
కాఫీ వేడి ఆవిర్లు, నాలో రేపెను రెపరెపల ఉరకలను 
కాఫీ ఘుమఘుమలు వ్యాపించే హృదయపు బాహ్యాంతరంగముల వీధుల లో 
కాఫీ సేవించిన మొదలు జిహ్వచాపల్యము కాఫీ కై పరితపిస్తూనే ఉంది 
కాఫీ గింజలు  మనోవికాసాన్ని ప్రేరేపించే గోధుమ వర్ణ ముత్యాలు 
కాఫీ పొడియందు ఇమిడి ఉండెను  వాడి, వేడిల మిశ్రమం 
కాఫీ పానీయం తేనె రాగాల ధారను స్రవిమ్పజేసే సాధనం 
కాఫీ తాగుతూ  ప్రయాణం, విడదీయలేని ప్రమాణం 
కాఫీ తో ప్రణయపు ముచ్చట్లు,స్నేహితులతో చలోక్తుల చప్పట్లు లోకవిదితమే 
కాఫీ లో ఏం మాయ దాగున్నదో, కొంగొత్త భావాలను పలికిస్తున్నదే 
కాఫీ నవనాగరిక సమాజానికి ఆవస్యకమైనది, విడదీయరానిది 
కాఫీ ధార ప్రవహించిన తరుణం, ధారణా శక్తి తేజోరిల్లెను పలురెట్లు 
కాఫీ పేరు వినినమాత్రముననే, మిన్నక అలల జడి లా కొట్టుకున్నమదితలుపులు 
కాఫీ తో పరిచయమైన సన్నిహితులు లెక్కపెట్టుటకు  సాద్యము కాదు 
కాఫీ లేని రోజు, నను సాఫీ గా ఉండనిత్తునా 

 

Mahi-15.gif

×
×
  • Create New...