Aston08 Posted January 2, 2014 Report Posted January 2, 2014 తిరుపతి : ఎర్రచందనం స్మగ్లింగ్ లో వైసీపీ సర్పంచ్ రెడ్డప్పను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రవాడపురం అటవీ ప్రాంతంలో రెండు కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ కు సర్పంచ్ రెడ్డప్పకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సర్పంచ్ రెడ్డప్పకు ఇతర పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు ఇద్దరు అటవీ శాఖ అధికారులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీనితో ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఉక్కుపాదంతో అణిచివేయాలని పోలీసులు భావించారు. అందుకనుగుణంగా అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకులున్నారని వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. తాజాగా వైసీపీ సర్పంచ్ ను అదుపులోకి తీసుకోవడంతో దీనికి బలం చేకూరింది. స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందో?
Baadshah_Afdb Posted January 2, 2014 Report Posted January 2, 2014 dong passport Lu chese valani kuda patukunaru vadu kuda ycp batch ee party antha dongalu, terrorist and gajji galatho nindipoindhi
perugu_vada Posted January 2, 2014 Report Posted January 2, 2014 Ammayilani supply cheyatam okkate migilipoindhemo, adhi kuda aipothe sarva-mangalam ani title ichi sanmaaninchochu jagan ni
Recommended Posts