Jump to content

Recommended Posts

Posted

[img]http://www.teluguflavours.com/telugu/movies/movienews/maaro%20movie%20stills%20(6).jpg[/img]

యువ హీరొ నితిన్ కధానాయకుడుగా మీరాచోప్రా నాయికగా నటించిన "మారో" చిత్రానికి మలయాళ దర్శకుడు సిద్ధిక్ దర్శకత్వం వహించారు. పాపం నాలుగేళ్లుగా షూటింగ్ చేసి ల్యాబ్‌లో మగ్గిపోయిన ఈ చిత్రాన్ని మామిడాల శ్రీనివాస్ బయటకు తెచ్చారు. గతంలో ఈయన "అపరిచితుడు" నైజాం డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. మీరాచోప్రా, నితిన్ నటించిన ఈ చిత్రం అసలు పేరు "సత్యం శివం సుందరం". ఇప్పుడు పేరు మార్చి విడుదల చేస్తున్నారు.  ఈ చిత్రానికి అష్టకష్టాలుపడి విడుదలకు సాహసం చేస్తున్న నిర్మాతకు గత నిర్మాత ఇవ్వాల్సిన పైకం పూర్తిగా ఇవ్వలేదని నిర్మాతను నితిన్ అడగటం, అందుకు కొంత సమయం ఇవ్వమనడంతో నితిన్ మీడియా ముందుకు రాలేదు.

ఇదిలావుండగా, ఈ చిత్రం గురించి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ... బుద్ధిబలంతో స్పందించే తీరు ఈ చిత్రంలో చాలా బాగుంటుంది. మైండ్ గేమ్ ఆడుతుంటాడు హీరో. మీరా చోప్రా అందాలు బాగున్నాయి. అన్ని రకాల అంశాలతో ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేస్తున్నాం అని చెప్పారు.

Posted

[img]http://www.imageping.com/out.php/i10474_Brahmirunning.gif[/img]

×
×
  • Create New...