Jump to content

Jai Ho.....


Recommended Posts

Posted

ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమాని రీమేక్‌ చేస్తున్నప్పుడు అందులో మార్పు చేర్పులు చేయడానికి దర్శకులు, హీరోలు ధైర్యం చేయరు. కానీ ఒక భాషలో ఫెయిల్‌ అయిన సినిమాని రీమేక్‌ చేస్తే కనుక అందులో జరిగిన తప్పుల్ని దిద్దాల్సిన అవసరం చాలా ఉంటుంది. కానీ సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు సోహైల్‌కి అంత క్రియేటివ్‌ బుర్ర లేకపోయింది. 'స్టాలిన్‌' సినిమాని 'జైహో' గా రీమేక్‌ చేసిన సోహైల్‌ ఖాన్‌ అచ్చంగా తెలుగులో మురుగదాస్‌ ఏమి చేసాడో హిందీలోను అదే చేసాడు. తెలుగు వెర్షన్‌లో నవ్వుల పాలైన ఓవర్‌ ది టాప్‌ యాక్షన్‌ని కూడా హిందీలో యథాతథంగా ఉంచేసాడు.
 
మూడు, నాలుగేళ్లుగా ఫుల్‌ ఫామ్‌లో ఉన్న సల్మాన్‌ఖాన్‌ చిత్రాలకి ఈమధ్య సూపర్‌ ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. వాటితో పోలిస్తే జైహోకి చాలా వీక్‌ ఓపెనింగ్‌ వచ్చింది. ఈ చిత్రంపై విడుదలకి ముందు నుంచీ ఆసక్తి లేకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రివ్యూస్‌ అయితే ఎప్పటిలానే మిశ్రమంగా వచ్చాయి. కానీ ఈసారి ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్‌ చేయడం సల్మాన్‌ చేతుల్లోనే ఉంది. తొలి వారంలో ఒక్క పబ్లిక్‌ హాలిడే కూడా కలిసి రాకపోవడం ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌ రికార్డులు కూడా లేకుండా చేస్తుంది.

×
×
  • Create New...