Jump to content

Mohan Babu - My Role Has An Important Message To The Viewers


Recommended Posts

Posted

Agreed

మోహన్‌బాబుకి హిట్‌ వచ్చి చాలా కాలమైంది. ఆయన నటించిన సినిమాలనే కాకుండా, నిర్మించినవి కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన ఖర్చుకి వెనకాడకుండా ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని నిర్మించారు. మంచు హీరోలతో పాటు మరో ఇద్దరు యువ హీరోలతో 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు ముప్పయ్‌ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. దీనిని ఇరవై కోట్ల రూపాయలకి నాన్‌ రిఫండబుల్‌ బేసిస్‌లో కొనడానికి బయ్యర్లు ముందుకి వచ్చారట. ఈమధ్య కాలంలో మంచు సినిమాలు ఫేర్‌ చేసిన దాని ప్రకారం చూస్తే ఇది మంచి డీల్‌. పైగా మోహన్‌బాబుకి సేఫ్‌ డీల్‌ కూడా. 

శాటిలైట్‌ రైట్స్‌ వగైరా కలుపుకుని పాతిక కోట్లు వరకు రికవర్‌ అయ్యేవి. కానీ మోహన్‌బాబు అందుకు సిద్ధపడలేదు. మొత్తం ముప్పయ్‌ కోట్లకీ తనే రిస్క్‌ చేస్తూ ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్‌ చేస్తున్నారు. తనకీ చిత్రంలో అపారమైన నమ్మకం ఉందని, తప్పకుండా ఇది ఘన విజయం సాధించి తను పెట్టిన ఖర్చుకంటే ఎంతో లాభం తెచ్చిపెడుతుందని ఆయన ఆశిస్తున్నారు. అందుకే పబ్లిసిటీ పరంగా కూడా మోహన్‌బాబు ఈ చిత్రానికి చేతికి ఎముక లేనట్టు ఖర్చు పెడుతున్నారు. ఆయన నమ్మకాన్ని పాండవులు ఎంతవరకు నిలబెడతారో ఏమిటో? - See more at: http://telugu.gulte.com/tmovienews/3421/Mohan-babu-Pandavulu-pandavulu-Movie-Budget#sthash.LCFYx9XY.dpuf

×
×
  • Create New...