Jump to content

Ball Is In President's Court


Recommended Posts

Posted
రాష్ట్ర పునర్విభజన బిల్లుకు సంబంధించి శాసనసభ పాత్ర ముగియడంతో... ఇప్పుడు బంతి రాష్ట్రపతి కోర్టులోకి వెళ్లింది. అసెంబ్లీ తిరస్కరణకు గురైన బిల్లును రాష్ట్రపతి ఏం చేస్తారో అన్న ఉత్కంఠ ఇప్పుడు అందర్లోనూ మొదలైంది. రాష్ట్ర శాసనసభ నుంచి టీబిల్లు ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతికి చేరే అవకాశం ఉంది. విశ్లేషకుల అంచనా ప్రకారం... రాష్ట్రపతి ముందు ప్రస్తుతం రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది... అసెంబ్లీలో చర్చ పూర్తయిందంటూ, తదుపరి చర్యల కోసం కేంద్ర హోం శాఖకు బిల్లును పంపించడం. రెండోది... బిల్లును అసెంబ్లీ తిరస్కరించింది కనుక, దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో న్యాయ నిపుణుల సలహాలను కోరడం. ఈ రెండు ఆప్షన్లలో రాష్ట్రపతి ప్రణబ్ దేన్ని ఎంచుకుంటారో వేచిచూడాల్సిందే.
Posted

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి స్పందించారు. ఈ పరిణామం ఓటమి లేదా విజయం కాదన్నారు. ఎక్కువ మంది సభ్యుల ఆమోదంతోనే బిల్లును తిరస్కరించారని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సమస్యలు సృష్టించవద్దని రేణుక కోరారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలనే ముఖ్యమంత్రి సభలో తెలిపారన్న ఆమె... హింసాత్మక ధోరణితో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ, అసెంబ్లీలో బిల్లు తిరస్కారానికి గురికావడం కేంద్రంలో కాంగ్రెస్ కు ఘోర అవమానమని చెప్పారు

 

Renuka Chowdary

Posted

తెలంగాణ ఏర్పాటులో కీలక ఘట్టం ముగిసిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. బిల్లుపై శాసనసభ తన బాధ్యత నిర్వహించిందని చెప్పారు. అయితే, తెలంగాణ బిల్లుపై సభలో ఓటింగు జరగలేదని చెప్పారు. ఈ తీర్మానం ఆర్టికల్ 3 కింద రాష్ట్రాన్ని విభజించడంపై ఎలాంటి ప్రభావం చూపదని చెప్పారు. బిల్లును అభిప్రాయం కోసం మాత్రమే పంపించామని ఓటింగు కోసం కాదన్నారు. రాజ్యాంగ అవసరం దృష్ట్యానే శాసనసభ అభిప్రాయాలు తీసుకున్నామన్న దిగ్విజయ్ కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారన్నారు. కాగా, సవరణలపై క్యాబినెట్ చర్చించి మంచి సలహాలుంటే బిల్లులో పొందుపరుస్తుందన్నారు. ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారంతా ఒకప్పుడు అనుకూలంగా లేఖలిచ్చారని, అన్ని పార్టీలు స్వేచ్చగా తమ అభిప్రాయం చెప్పేందుకు కేంద్రం అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు.

 

DIGVIJAY SINGH

Posted

రాష్ట్రాల విభజనకు ఓ ప్రత్యేక ప్రాతిపదిక కావాలని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ చెన్నైతో కూడిన ఉత్తర తమిళనాడు, బెంగళూరుతో కూడిన దక్షిణ కర్ణాటక, ముంబైతో కూడిన మహారాష్ట్ర విడిపోతామని డిమాండ్ చేస్తూ విడిపోతే ఆయా రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల పరిస్థితేంటని ఆయన స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాము పరిష్కారాలు సూచించామని ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, దాని కారణంగా ఆ ప్రాంతానికి ప్ర్యతేక ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ పన్ను రాయతీలు, ప్రత్యేక పధకాలు చేపడితే ప్రయోజనం ఉంటుందని విభజన సులభమవుతుందని ఆయన సూచించారు. లేని పక్షంలో విభజన పెద్ద డిబేట్ గా మిగిలిపోతుందని జేపీ స్పష్టం చేశారు. కేంద్రానికి నచ్చినట్టు ప్రవర్తిస్తే అరాచకం రాజ్యమేలుతుందని ఆయన తెలిపారు.

కేంద్రం ఒడిశాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, దాని కనుగుణంగా పన్నుల రాయితీ ఇచ్చిందని అందువల్లే అక్కడ వెనుకబాటుతనాన్ని కాస్తయినా నిర్మూలించగలిగారని ఆయన తెలిపారు. నిజాయతీ, చిత్తశుద్ధితో రాష్ట్రాల ఏర్పాటు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కార్యరూపం దాల్చదని ఆయన వివరించారు.

 

JP

×
×
  • Create New...