rajurocking50 Posted January 31, 2014 Report Posted January 31, 2014 ఎవరినీ నమ్మడునమ్మిన వారిని నట్టేట ముంచుతాడువైసీపీకి గుడ్‌బై చెబుతున్నాఫిబ్రవరిలో చాలామంది పార్టీని వీడతారుషర్మిల, సుబ్బారెడ్డి పరిస్థితే అగమ్యగోచరంపార్టీని బలోపేతం చేసిన వాళ్లకే దిక్కులేదునిప్పులు చెరిగిన రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం హైదరాబాద్, జనవరి 30: "జగన్‌ది ఎవరినీ నమ్మే మనస్తత్వం కాదు. నమ్మిన వారిని నట్టేట ముంచే రకం. నమస్కారం పెట్టినా ప్రతి నమస్కారం చేయని హీనమైన సంస్కారం ఆయనది'' అంటూ వైసీపీ నేత రఘురామ కృష్ణంరాజు నిప్పులు చెరిగారు. జగన్ నియంతృత్వ పోకడలతో విసిగిపోయిన ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ తరఫున న రసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పేరు ఖరారైన రఘురామ కృష్ణంరాజు జగన్ గురించి.. వైసీపీ భవిష్యత్ గురించీ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మరీ కుండ బద్దలు కొట్టారు. వైసీపీ అధ్యక్షుడి వైఖరి ఏంటో, ఆయన సంస్కారం ఏ పాటిదనే గుట్టును బయట పెట్టారు. అయితే, వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఏ పార్టీలో చేరేది స్పష్టం చేయలేదు. కానీ, బీజేపీ అభ్యర్థిగా నరసాపురం స్థానం నుంచే బరిలోకి దిగనున్నారని సమాచారం. వైసీపీ నుంచి తాను వైదొలగుతున్నట్టు విలేకరుల సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్‌పై ఘాటైన విమర్శలకు దిగారు. జగన్ కుటుంబ సభ్యులైన సోదరి షర్మిల, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి పరిస్థితే పార్టీలో అగమ్య గోచరంగా ఉందన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వీళ్లకే ఇప్పుడు దిక్కులేదన్నారు. రాష్ట్ర విభజన జరగదని, కేసు ద్వారా తాను ఆపేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జగన్‌కు చెబుతుంటే ఆయన ఒప్పుకోవడం లేదన్నారు. కిరణ్, చంద్రబాబు వల్లే రాష్ట్ర విభజన బిల్లు తిరస్కరణకు గురైందన్నారు. జగన్ వైఖరి ఏంటనేది గ్రహించి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడి వెళ్లిపోతున్నారని తెలిపారు. మంచివాళ్లు, నిస్వార్ధంగా పనిచేసే వాళ్లు వైసీపీకి అక్కర్లేదన్నారు. "అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. ఆ సమయంలో జగన్ అక్కడే ఉన్నారు. నేను నమస్కారం పెడితే ఆయన స్పందించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నన్ను తక్కువ చేశారో.. లేక ఆయనకు సంస్కారం లేదో తెలియాలి'' అని మండిపడ్డారు. ఆర్టికల్ మూడు ప్రకారం రాష్ట్ర విభజన చేసుకోండని చెప్పిన పార్టీలో మీరెలా చేరారని ప్రశ్నించగా.. దానిపైనే కేసు వేస్తే జగన్‌కు నచ్చడం లేదని బదులిచ్చారు. తామే బహిష్కరించినట్టు ఓవరాక్షన్ రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమయ్యాక.. ఆయనపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలకు పాల్పడింది. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన వ్యవహార శైలిపై దాని పరిధిలోని అసెంబ్లీ సమన్వయకర్తల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పార్టీ ఆయనకు అప్పగించిన బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జగన్ ప్రకటించుకోవడం గమనార్హం. జగన్ పత్రిక తలెక్కడ పెట్టుకుంటుంది? ఆంధ్రజ్యోతి కథనం అక్షర సత్యం వైసీపీకి రఘురామకృష్ణంరాజు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ ఈనెల 14న 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. తాను వైసీపీని వీడుతున్నానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. వాస్తవానికి, రఘురామ కృష్ణంరాజు వైసీపీని వీడనున్నారంటూ 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనాన్ని అప్పట్లో ఆయనే ఖండించినట్టు జగన్ స్థాపించిన రోత పత్రిక కథనాన్ని వండి వార్చింది. దానిని చిలవలు పలవలు చేసి మరీ రాసింది. రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడినట్టు ఆ పత్రికే పెద్ద కథనాన్ని వండి వార్చి ప్రచురించింది. దీనంతటికీ కారణం చంద్రబాబు అని.. ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ టీడీపీ అధినేతపైకి తోసేసింది. అంతటితో ఆగకుండా 'ఆంధ్రజ్యోతి' ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా.. అదొక అభూత కల్పనగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. రఘురామకృష్ణంరాజు జగన్‌కు సన్నిహితుడని, ఆయన పార్టీ వీడరని కథనంలో పేర్కొంది. బలంగా ఉన్న వైసీపీని బలహీనపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. అత్యంత సన్నిహితుడంటూ జగన్ పత్రిక పేర్కొన్న రఘురామ కృష్ణంరాజే నేరుగా మీడియా ముందుకు వచ్చి జగన్ వైఖరితోనే పార్టీని వీడుతున్నానని తేల్చి చెప్పారు. మరి, ఇప్పుడు జగన్ పత్రిక తలకాయ ఎక్కడ పెట్టుకుంటుందో..!
chegu Posted January 31, 2014 Report Posted January 31, 2014 Sakshi thala ekkada pettukunte dhi anta....lol Thala leni sakshit.....
ChandraSekharCherukuri Posted January 31, 2014 Report Posted January 31, 2014 cbn habits chala unnay jagan lo andaru chiru annaya laaga cuning ga vundalruga
maverick23 Posted January 31, 2014 Report Posted January 31, 2014 Still jaffas like to give BJ to jagan
ChandraSekharCherukuri Posted January 31, 2014 Report Posted January 31, 2014 Still jaffas like to give BJ to jagan Jaggu new name KISSANANDA SWAMY
Recommended Posts