Jump to content

Recommended Posts

Posted

సీన్‌ దేశ రాజధాని ఢిల్లీకి మారింది. రాష్ట్ర విభజన బిల్లుకి సంబంధించి అసెంబ్లీ నుంచి ఢిల్లీకి చేరింది ‘రాజకీయం’. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుకు తిరస్కారం ఎదురవడంతో, దానికి సంబంధించిన తీర్మానాన్ని కూడా ఢిల్లీకి పంపడం గమనార్హం. బిల్లు ఎలాగైతే రాష్ట్రానికి వచ్చిందో, అలాగే ప్రత్యేక విమానంలో బిల్లూ, తీర్మానం రెండూ ఢిల్లీకి కాస్సేపటి క్రితం చేరుకున్నాయి.
ఇక, రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులూ పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్నారు. దేశ రాజధానిలో సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ శిబిరాలు మోహరించాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు, విభజనకు అనుకూలంగా ప్రత్యేకవాదులు మోహరించడంతో ఢిల్లీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో ఆందోళనకు వ్యూహరచన జరుగుతుండడంతో.. రానున్న రోజుల్లో రాజకీయం మరింత వేడెక్కనుంది. మరోపక్క, టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీలోని ఇరు ప్రాంతాలకు చెందిన నేతల్ని వెంటేసుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఈ రోజు రాత్రి కలవనున్న విషయం విదితమే.
సీమాంధ్ర, తెలంగాణ నేతలు జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు చెందిన నేతలతో భేటీ అవుతూ, పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించాలనీ, మద్దతివ్వాలనీ విడివిడిగా కోరుతుండడంతో.. జాతీయ పార్టీలకు తెలంగాణ వ్యవహారంపై పార్లమెంటులో ఎలా స్పందించాలో అర్థం కాక తల తిరిగిపోతోంది.
తెలంగాణకి అనుకూలం.. అని చెబుతున్న బీజేపీ, ఇప్పుడిప్పుడే సీమాంధ్రపై ‘ప్రేమ’ పెంచుకుంటుండడంతో, పార్లమెంటులో తక్కువమంది ఎంపీలున్న చిన్న పార్టీలకు ప్రాధాన్యత ఏర్పడింది. 
ఇదిలా వుంటే, నేడు ఫిబ్రవరి 3. ఇంకో 18 రోజుల్లో రాష్ట్ర విభజనపై ఓ స్పష్టత వచ్చేస్తుంది. ఎందుకంటే, 21వ తేదీలో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. దాంతో ఈ 18 రోజులు కీలకమని ఇటు ప్రత్యేకవాదులు, అటు సమైక్యవాదులు భావిస్తున్నారు. ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా వున్నారు. మొత్తంగా చూస్తే ఢిల్లీలో తెలంగాణ హీట్‌ తారాస్థాయికి చేరింది. ఈ హీట్‌కి ఎలాంటి ముగింపు రానుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే.
 

Posted

cbn bjp tho kalisi TG ne aputhadu.no dout..kingmaker cbn is there....chandrababu andhrapradesh ki sriramaraksha....

×
×
  • Create New...