maveric99 Posted March 31, 2010 Report Posted March 31, 2010 [img]http://teluguflavours.com/telugu/topstory/photos/29/Old%20City%20(10).jpg[/img]ప్రస్తుతం భాగ్యనగరం అనేక సమస్యలతో రగిలిపోతుంది..ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఒక్కసారి అల్లర్లతో అతళాకుతలం అయ్యింది. అసలే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలు ఈ దెబ్బకి కరెంట్ షాక్ కొట్టిన కాకిల గిజగిజలాడుతున్నారు. వేసవి వస్తేనే కొరత, కోత గుర్తోస్తుంది మన అధికారులకు ఎప్పుడు సరఫరా నిలిపివెద్దామని గోతికాడ నక్కలా ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం నగరంలో మంచి నీటి మరియు విద్యుత్ సమస్య అధికంగా ఉంది. కనీసం త్రాగటానికి చుక్కనీరు కూడా లేని ప్రాంతాలు నగరంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పోనీ వచ్చే మంచి నీరు బాగుంటుందా అంటే అందులో కూడా కలుషితం, ఇక కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఆ భగవంతుడికి కూడా తెలియదు. పోనీ ఇక్కడ ఆదా చేసి రైతులకు ఇస్తున్నారా అంటే అదీలేదు వారికిచ్చిన హామీలు అసలు అమలు చేస్తే కదా. మరి ఇలా ఆదా చేసిన విద్యుత్ ఏమౌతున్నట్టు? ఎవరు వినియోగించుకుంటున్నారు? ఆలోచించండి....ఎప్పటి కప్పుడు వచ్చిన సమస్యని కొంచం వెనక్కి నెట్టతాం తప్ప పూర్తిగా పరిష్కరించటం లేదు.. కనీసం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టటం లేదు..ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దండుకుందాం అని చూసేవారు తప్ప సిన్సియర్‌గా పనిచేసే వారు మచ్చుకకైన కనిపించరు!.అధికారుల విషయం ప్రక్కన పెడితే మన నాయకులు హ....ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సందించటం తప్ప పేదవాడికి పనికొచ్చే ఒక్క మంచి పనికి కూడా శ్రీకారం చుట్టటం లేదు!. అసెంబ్లీ సమావేశాలలో ప్రజాధనం దుర్వినియోగం చెయ్యటమే వారి ప్రధమ లక్ష్యం అనుకుంట? సభలలో ఒక సమస్యని లెవనెత్తితె దానిపై కనీసం పూర్తిగా వాదించినది..నివారించినది ఒక్కటి కూడా లేదు. ఏదన్న అంటే సభను కాసేపు వాయిదా వేస్తున్నాం అంటారు. ఇటు వంటి నాయకులు ఉన్నంత వరకు ప్రజా సమస్యలు గాలికి వదిలెయ్యటమే. అంతే కద డబ్బులు విసిరి, మందు సప్లై చేసి, అనేక రకాల వస్తువులను పంచి పెట్టి జనాన్ని కొన్ని కోట్ల రూపాయలతో కొన్న మన నాయకులు ఆ ఖర్చు పెట్టిన రూపాయలను కూడగట్టు కోవాలంటే తప్పదు కదా...!? పోనీలే ఖర్చు పెడితే పెట్టాం గెలిచాం ప్రజలకు కొంత ఉపయోగపడదామ్ అనుకోటానికి మన వారు ఉత్తములు కారు కదా? ఒక్కో నాయకుడు చరిత్ర తిరగ రాస్తే వాటికి విశ్వమే అంతం. అసలు మన నాయకులు మనకి న్యాయం చేస్తారా? వారి బంధువులు, స్నేహితులు ఇంకా ఇంకా ధనికులు అవతున్నారు కానీ. పేదవాడు పట్టుమని పదిరోజులు వద్దండి 4లేక 5 రోజులు కనీసం కడుపునిండా ఎప్పుడన్నా తిన్నడా? రోజు రోజుకి కొత్త కొత్త టెక్నాలజీతో ఇంతకింతకు అభివృద్ది చెందుతున్న మన భారతదేశంలో ఇంకా ఆకలిచావులు ఉన్నాయి. పేదవాడు అధః పాతాలానికి ధనికుడు అంధనంత ఎత్తుకు ఎదగటం అధి ఎప్పటినుంచో వస్తున్న ఒక ఆచారంలా ఉండిపోయింది.అసలే ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఈ అల్లర్లు, కొట్లాటలు, మత కల్లోలాలు. ఇన్ని అవాంతరాల మద్య ఒక మనిషి ఇంటి నుంచి వెళ్ళి తిరిగి మరల ఇంటికి వచ్చేదాకా గుండెలమీద కుంపటిఉన్నట్టుంటుంది. నిస్సత్తువగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం. సంఘవిద్రోహ శక్తుల అరాచకాలు. మద్యలో నలిగిపోతున్న సమాజం. సమస్యలు పుష్కలం..నిధులు పుష్కలం...నిధుల మళ్లింపు...నిల్...పధకాల అమలు నిల్...చివరికి అంతా శూన్యం. ఇటువంటి సమయంలో ప్రజలు కూడా ఆలోచించి వ్యవహరించాలి తమవంతు బాద్యత నిర్వహించాలి. ఎటువంటి వృధా చేయకుండా అవసరం అయినంత వరకే దెనినైనా వినియోగించుకోవాలి. ప్రజలు సంయమనంతో ఉండాలి. ఈ సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించాలి వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు మన భాగ్యనగరాన్ని సుభిక్షంగా ఉంచాలి. ఇది మన భాగ్యనగరం భాగోతం.......!
Recommended Posts