Jump to content

Recommended Posts

Posted

ఫస్ట్‌ లుక్‌: షాకింగ్‌ శ్రియ

February 7th, 2014, 11:27 AM IST
1391752892-1865.jpg

'మనం' సినిమా ఇంతవరకు ఎప్పుడూ మనం చూడని పాయింట్‌తో తెరకెక్కుతోందని, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ చాలా తెలివైనవాడని నాగార్జున కితాబులు ఇచ్చేస్తున్నాడు. తాత, కొడుకు, మనవడు కలిసి నటించిన చిత్రమంటే కథ ఇలా ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది. కానీ మనం సినిమా మాత్రం దానికి పూర్తి భిన్నంగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట. అందుకే ఈ చిత్రంలోని కొన్ని సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ ఏమీ లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

కానీ ఎలా వచ్చిందో కానీ ఇందులోని శ్రియ గెటప్‌ బయటకి వచ్చేసింది. ఈ చిత్రంలో రెండు రకాల గెటప్స్‌తో కనిపించబోతున్న శ్రియ ఒక గెటప్‌లో ఇలా ఉంటుందన్నమాట. పాత కాలం స్త్రీల వేషధారణని పోలి ఉన్న గెటప్‌లో శ్రియ షాకింగ్‌గా లేదూ? అయితే ఇంతకు మించిన షాక్‌ సమంత ఇవ్వబోతుందట. ఆమె క్యారెక్టర్‌ కూడా రెండు రకాలుగా కనిపిస్తుందని, ఒక గెటప్‌ ఇలాగే షాకింగ్‌గా ఉంటుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇదంతా చూస్తుంటే అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రమైన మనం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటట్టే ఉంది.

- See more at: http://telugu.gulte.com/tmovienews/3543/First-Look-Shriya-in-Manam-Manam-Photos-Shriya-heroine-in-Manam#sthash.YuyhuiGS.dpuf

×
×
  • Create New...