Jump to content

Recommended Posts

Posted

February 7th, 2014, 11:27 AM IST

1391752771-1733.jpg

కార్పొరేట్‌ సంస్థలతో అన్నీ పకడ్బందీగా ఉంటాయి తప్ప ఎప్పటికప్పుడు అడ్జస్ట్‌మెంట్లు చేస్తే కుదరదు. సిస్టమాటిక్‌గా వర్క్‌ చేసే అలవాటున్న కార్పొరేట్‌ సంస్థలు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యాయి కానీ తెలుగులో మాత్రం వారికి అస్సలు కలిసి రాలేదు. రిలయన్స్‌ సంస్థకి 'అత్తారింటికి దారేది'తో విజయం దక్కింది కానీ లేదంటే అంతవరకు వారికి వచ్చినవన్నీ ఫ్లాపులే. జీ స్టూడియోస్‌, యుటీవీ, ఈరోస్‌ అన్నిటికీ చేదు అనుభవాలే మిగిలాయి. మహేష్‌బాబుతో మల్టీ సినిమా డీల్‌ చేసుకున్న యుటీవీ సంస్థ ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని తలపెట్టింది. 

ఇచ్చిన మాట ప్రకారం ఆగడు తర్వాత యుటీవీ సినిమానే మహేష్‌ చేయాలి. కానీ ఈమధ్య మహేష్‌ తన ఆర్డర్‌ మార్చుకున్నాడు. పూరి జగన్నాథ్‌ సినిమా సడన్‌గా మధ్యలోకి వచ్చింది. అలాగే మణిరత్నం మల్టీస్టారర్‌ సినిమాలో కూడా నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఇదంతా జరిగితే వచ్చే ఏడాదిలో కానీ ఈ సినిమా మొదలు కాదు. అంతవరకు అడ్వాన్సులు ఇచ్చేసి వేచి చూడడం తమ వల్ల కాదని యుటీవీ సంస్థ మహేష్‌కి తేల్చి చెప్పిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. అవన్నీ నిజమే అయినట్టయితే కనుక ఈ సినిమా పూర్తిగా కాన్సిల్‌ అయిందని అనుకోవాలి.

- See more at: http://telugu.gulte.com/tmovienews/3542/UTV-motions-serious-on-Mahesh-Babu-Mahesh-babu-next-movie-with-Puri-Jagannath#sthash.APvzaFmt.dpuf

×
×
  • Create New...