Jump to content

Recommended Posts

Posted

61382451745_625x300.jpg

 

 

ఖరగ్పూర్ : బిలాస్పూర్ జిల్లాకు చెందిన సుర్జీత్ కుమార్ జైన్ (18) కష్టపడి చదివి ఐఐటీలో సీటు సంపాదించాడు. అయితే బుద్ధి మాత్రం వక్రమార్గం పట్టింది. అదే జిల్లాకు చెందిన మహిళ ఉపాధ్యాయురాలి నగ్న పోటోలను ఇంటర్నెట్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఆ విషయం తెలిసిన సదరు ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా పోటోలు ఖరగ్పూర్ ఐఐటీ ప్రాంగణంలో సుర్జీత్ కుమార్ జైన్ అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
 
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఖరగ్పూర్ ఐఐటీ చేరుకున్నారు. సుర్జీత్ కుమార్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ రెండవ సంవత్సరం చదువుతున్నాడని, అయితే గత రెండు నెలలుగా అతడు తరగతులకు హాజరుకావడం లేదని సదరు ఐఐటీ డైరెక్టర్ తపన్ గోషాల్ పోలీసులకు వెల్లడించారు. దాంతో నిందితుని ఆచూకీ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

×
×
  • Create New...