Jump to content

Kakinada -Ap (Residual) New Capital !


Recommended Posts

Posted
an-1392407935149.jpg

సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణంతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకోసం సీమాంధ్రలోని మూడుప్రాంతాల్లోని ప్రధాన నగరాలను సమాంతరంగా అభివృద్ధి పరచాలని నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టిన విభజన బిల్లుపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పలు అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బిల్లులోనే కొత్త రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని ప్రతిపాదించాలని, సీమాంధ్ర అభి వృద్ధికి చేపట్టబోయే చర్యల్ని స్పష్టం చేయాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ఓ వైపు బీజేపీని సంతృప్తి పరుస్తూనే మరోవైపు సీమాంధ్ర ఎంపీల నుంచి వ్యతిరేతక తగ్గే విధంగా అధికార వికేంద్రీకరణకు కేంద్రం వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీమాంధ్ర కొత్త రాజధాని కోసం మూడు ప్రాంతాల్ని ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తుది నిర్ణయం కోసం కేంద్రానికి పంపారు. మూడు ప్రాంతాల్లో అధ్యయనం చేసి మెరుగైనది సూచించాల్సిందిగా కేంద్రం ఓ బృందాన్ని నియమించింది. ఇందులో కాకినాడ ప్రాంతానికి అధికంగా అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. కాకినాడ సమీపం లోని అటవీ ప్రాంతంలో కొత్త రాజధాని నిర్మిస్తూనే విశాఖ, విజయ వాడ, గుంటూరు, కర్నూలు నగరాల్ని కూడా మెట్రోలుగా తీర్చిదిద్దేం దుకు కేంద్రం సమాయత్తమవుతోంది. ఇందుకోసం భారీఎత్తున నిధు లు సమకూరుస్తామంటూ బిల్లులో ప్రతిపాదించేందుకు సిద్ధపడు తోంది. విశాఖ నుంచి కాకినాడ వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఈ ప్రాంతంలో అదనంగా జాతీయ రహదారలు, రైల్వేలైన్లు, రేవులు, విమానాశ్రయాల్ని నిర్మించ నున్నారు. రూ.50వేల కోట్ల తో ఓఎన్‌జీసీ రిఫై నరీ నిర్మాణాన్ని కూడా ఇక్కడ ప్రతిపాదించారు. విశా ఖ పరిసర ప్రాంతాలన్నీ పారిశ్రామి కంగా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా ఫార్మా రంగం వేళ్ళూనుకుంది. ఎగు మతి ఆధారిత పరిశ్రమలు పెద్ద సం ఖ్యలో ఏర్పాటయ్యాయి. కాగా విభ జన బిల్లులో భాగంగా రాయలసీమలోని తిరుపతి, కర్నూలు నగరాల పరిసరాల్ని పారిశ్రా మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రాం తంలో తగినన్ని భూగర్భ వనరులున్నాయి. నీటి సదుపాయం అందు బాటులో ఉంది. ఇక్కడ పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన రాయి తీలు, సబ్సిడీలను కేంద్రం ప్రకటించనుంది. తద్వారా జాతీయ, అంత ర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించనుంది. వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరు నగరాలను కూడా సమాంతరంగా తీర్చిదిద్దనుంది. విజయవాడ ప్రాంతం విద్యుత్‌ ఉత్పాదక హబ్‌గా మారింది. ఇలా కాకినాడ, విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులను ఏకధాటిన అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రగతి విస్తరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. తద్వారా భవిష్యత్‌లో మరోసారి ప్రాంతీయవాదాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. పైగా పాలనాపరంగా కూడా అధికార వికేంద్రీకరణకు ప్రయత్నిస్తోంది. తిరుపతి, కర్నూలు ప్రాంతంలోనే పారిశ్రామిక శాఖ కేంద్ర కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలని, వీటితో పాటు వ్యవసాయం, పురపాలక శాఖలకు కూడా కర్నూలులోనే నెలకొల్పనుంది. దేవాదాయ, ధర్మాదాయ, పంచాయ తీరాజ్‌, కళాశాల, పాఠశాల విద్యా శాఖలు వంటి వాటిని తిరుపతిలో ఏర్పాటు చేయనుంది. ఇక పోలీస్‌ ప్రధాన కార్యాలయం, ఏపీఎస్‌ఆర్‌ టీసీ, విద్యుత్‌, రవాణా, ఎక్సైజ్‌ వంటి కార్యాలయాల్ని విజయవాడలో ఏర్పాటు చేయనుంది. మిగిలిన శాఖలతో పాటు పాలనాపరమైన అసెంబ్లిస, సెక్రటేరియట్‌ వంటివాటిని కొత్తగా రాజధాని నిర్మించే కాకినాడ ప్రాంతంలోనే నెలకొల్పాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. ఈ వికేంద్రీకరణ ద్వారా మరోసారి అంతర్గత సమస్యలు ప్రబలకుండా చూడొచ్చన్నది కేంద్రం లక్ష్యం. అదే సమయంలో దీర్ఘకాలం పాటు సీమాంధ్రులు హైదరా బాద్‌లో బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పనిలేదు. రెండుమూడేళ్ళ లోనే ఈ నగరాలన్నింటిలో పాలనాపరమైన సౌలభ్యాలు ఏర్పాటు చేసుకునే వీలుంది. ఆ వెంటనే సొంత రాజధానికి సీమాంధ్రులు తరలొచ్చే అవకాశం ఉంటుందంటూ సొంత ఎంపీలతో పాటు బీజేపీకి నచ్చజెప్పొచ్చన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది.
  • Replies 66
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • singhammalai

    16

  • galiraju

    11

  • bindazking

    8

  • KadapaKingg

    6

Popular Days

Top Posters In This Topic

Posted

em paper vaa idhi.. kakinada lo capital enti kwamedy gaa.. 

Posted

em paper vaa idhi.. kakinada lo capital enti kwamedy gaa.. 

 

+1

Posted

Best adhe....... Its between Vijayawada and Vizag........ so economical gaa the region will develop........... kakinada is also petro chemical corridor.......... so baagane untadi.

Posted

em paper vaa idhi.. kakinada lo capital enti kwamedy gaa.. 


I too suspect that it is a paid news planted by some real estate business
Posted

em paper vaa idhi.. kakinada lo capital enti kwamedy gaa.. 

co canada kada 

 

 

vindaniki baagundi   rjy pakkane kada

Posted

co canada kada 

 

 

vindaniki baagundi   rjy pakkane kada

 

?

Posted

Ongole cheyya vacchuga...Penta na ko gallu

ongole kooda consideration lo undi man .. sri prathiba aakade kada ..

Posted

not agreed, adhi seema ki chala duranga undi.

 

meeru kaani adhi capital chesthe, next 5 years lo separate seema pakka man.

Posted

Vijayawada .. Lock chesukondi

No more discussions .. Matter over

33as5s0_zpsde99fa5a.gif

Posted

not agreed, adhi seema ki chala duranga undi.

 

meeru kaani adhi capital chesthe, next 5 years lo separate seems pakka man.

RT%20picchi.gifplz dont clean our marugudhodi

×
×
  • Create New...