Jump to content

2 Is Not Enough We Want 3 Pieces


Recommended Posts

Posted
Make Kurnool as Capital city or Rayalaseema as separate state, TG Venkatesh Demands

 

[media]http://youtu.be/QILhH7CALAk[/media]

 

 

Telangana-rayalaseema-map-300x2241393090

 

 

తెలుగు జాతికి తీన్‌ మార్‌ తప్పేలా లేదు. ఒకటి కొంటే ఒకటి ఉచితం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం అడిగిందొకరు.. కానీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది ఇంకొకరికి. పాత పేరు కొత్త రాష్ట్రం సీమాంధ్రకి. ఔను మరి, కొత్త రాజధాని ఏర్పాటు, ప్యాకేజీలూ గట్రా.. అంటే సీమాంధ్ర ప్రాంతమే కొత్త రాష్ట్రంగా ఏర్పాటవుతోంది. ఆగండాగండీ.. ‘సీమాంధ్ర’ అనేయకండి. సినిమాలో సస్పెన్స్‌ ఇంకా తొలగిపోలేదు. కొత్త ట్విస్ట్‌ ఇప్పుడే మొదలైంది.

విభజన అంటే జరిగితే రెండు కాదు.. మూడు అనే డిమాండ్‌ చాన్నాళ్ళుగా విన్పిస్తోంది రాష్ట్రంలో. ఆ మూడోది రాయలసీమ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వెనకబాటుతనం ఆధారంగా జరుగుతోంటే, అంతకన్నా వెనకబడ్డ ప్రాంతమైన రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేయాల్సిందే.. అన్న వాదన ఇప్పుడు ప్రముఖంగా తెరపైకొస్తోంది. ‘ఎవరి మోచేతి నీళ్ళు తాగాల్సిన ఖర్మ రాయలసీమకు లేదు..’ అంటూ సీమ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో తమ ప్రాంతంలో ఉద్యమ సెగ రగిల్చేందుకు సమాయత్తమవుతున్నారు.

 

ఇంకేం.. పార్లమెంటు తలుపులు మూసెయ్యడానికీ.. పార్లమెంటు సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు కట్‌ అయిపోవడానికీ.. కేంద్రం రెడీ అయిపోతే బెటర్‌. ఆగండాగండీ.. అపోజిషన్‌లో వున్న కమలనాథులూ రెడీ అయిపోండి ప్యాకేజీ డిమాండ్‌ పేరుతో ‘వంచించడానికి’ సిద్ధమవ్వాలి కదా. అబ్బే ఇది చాలదు బాసూ.! సీన్‌ చాలానే వుందింకా. ఓ ఆరు దశాబ్దాల ఉద్యమం సీమలో నడవొద్దూ. ఎట్‌ లీస్ట్‌ ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో ఓపార్టీ పుట్టాలి.. అది రాయలసీమలో బలపడాలి, కాంగ్రెస్‌తో కలిసేపోయేందుకు ప్రతిపాదనలు పెట్టాలి.

తెలంగాణ విషయంలో అంటే కాస్త లేట్‌ చేశారుగానీ, ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాల్సి వస్తే అంత టైమ్‌ కేంద్రం తీసుకునే అవకాశం లేదేమో. అసెంబ్లీ తీర్మానం అవసరం లేకుండా రాష్ట్రాల్ని ఎలా విడదీయొచ్చో చూపించేశారు.. అసెంబ్లీ తిరస్కరించిన తీర్మానాన్ని లెక్క చేయకూడదని నిరూపించారు.. అన్నిటికీ మించి విభజన వద్దు మొర్రో.. అంటోన్న ప్రాంతాన్ని ఎలా అయోమయంలోకి నెట్టేయొచ్చో చూపించారు.. ఇంతా చేసినోళ్ళు ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ గట్టిగా తెరపైకొచ్చినా, రాకున్నా తమ రాజకీయ అవసరాల కోసం ఆ పని చేసినా చేసేస్తారు.

 

ఇంతకీ, ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ ఎందుకొస్తోందంటారా.? దానికీ ఓ లెక్కుంది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని. ఇప్పుడేమో కొత్తగా ఏర్పడబోయే సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడో ఎవరికీ తెలీదు. ఆ రాజధాని తమకే ఇస్తే (అంటే కర్నూలులో ఏర్పాటు చేస్తే) సీమ వాసులకు పెద్దగా అభ్యంతరం లేదు. ఇవ్వకపోతేనే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలి. సీమలో జనం అంతా కాదుగానీ, కొందరు రాజకీయ నిరుద్యోగులు ఈ ఉద్యమాన్ని తెరపైకి తెస్తున్నారు.

దేన్నో చూసి ఏదో వాతలు పెట్టుకోవడమంటారే.. అలాగే తెలంగాణ ఉద్యమంలో నాయకుల్ని చూసి, సీమలో నాయకులు కొందరు ప్రత్యేక ఉద్యమం పేరుతో రాజకీయం దండుకోడానికి ప్రయత్నాలు షురూ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఎక్కువమంది సీమ ప్రాంతానికి చెందినవారే. పాత రోజుల్ని పక్కన పెడితే, కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు.. ఈ ముగ్గురూ సీమ ప్రాంత వాసులే. కానీ సీమలో అభివృద్ధి జాడే లేదు. ఎందుకూ అనడక్కండి. అదంతే.

రాజకీయ నాయకులు తమ తమ ప్రాంతాల్నీ, నియోజకవర్గాల్నీ, ప్రజల్నీ బాగు చేసేస్తే.. రాజకీయం ఇప్పుడెందుకిలా తయారవుతుంది.? ఆ నాయకుడొస్తాడు అంతకుముందున్న నాయకుడ్ని లేదా ప్రత్యర్థిని తిడతాడు. ఈయనగారు వెళ్తారు, ఇంకొకాయనొస్తాడు.. ఆయనా రాజకీయ విమర్శలు చేస్తాడు. ఇది రాజకీయం. ఈ రాజకీయం ఇలా ఇలా కొనసాగుతూనే వుంటుందంతే. ఇక్కడ ఆయా నేతల, పార్టీల రాజకీయ ప్రయోజనాలే తప్ప, ప్రజల ప్రయోజనాలెప్పుడో రాజకీయ నాయకులు గాలికొదిలేశారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం.. ఆ నాయకుడు ఈ నాయకుడు అన్న తేడాలే లేవు.

 

వెనకబాటుతనం.. దాంతోపాటే యువతలో కసి.. దానికి కొనసాగింపుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు.. ఇదో ఫ్యాషన్‌ అనలేంగానీ.. జనంలో అసహనం పెరిగిపోతే అది తిరుగుబాటు అవుతుంది.. ఆ తిరుగుబాటుకి నాయకులు పొలిటికల్‌ కలర్‌ ఇచ్చి, ప్రాంతీయ గ్లామర్‌ అద్దితే.. అది ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ అవుతుంది. నిన్న తెలంగాణ, రేప్పొద్దున్న రాయలసీమ.. అన్నీ కుదిరితే ఉత్తరాంధ్ర.. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

ఏంటీ.. మన రాష్ట్రంలోనే రెడీగా ఇంకో డిమాండ్‌ వుందంటారా.? ఏం.. తెలంగాణకి సెంటిమెంట్‌ వున్నప్పుడు రాయలసీమకు వుండదా.? అసలే పౌరుషమంటే తమదేనని చెబుతారు రాయలసీమ వాసులు. అక్కడి సంస్కృతీ ఎంతోకొంత భిన్నంగానే వుంటుంది. యాస కూడా. ఉత్తరాంధ్ర అయినా సరే. ఆ మాటకొస్తే, రాష్ట్రంలో ఒక్కో జిల్లాకి ఒక్కోలా తెలుగు యాస వుంటుంది. ఒక్క జిల్లాలోనే మళ్ళీ యాసల్లో కొంచెం తేడా కన్పిస్తుంటుంది. కాస్తంత సెంటిమెంట్‌.. ఇంకాస్త పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌.. అన్నిటికీ మించి కేంద్రంలో అధికార - విపక్షాలు ఒక్కటైతే.. రెండు ముక్కలేం ఖర్మ.. ఒక్కో రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలుగానైనా విడదీసెయ్యొచ్చు. 

 

చివరగా చెప్పేదేంటంటే.. ఎవరి వాదననీ తక్కువ చేయలేంగానీ, ఆయా వాదనలు చుట్టూ రాజకీయం.. అందులో రాజకీయ నిరుద్యోగుల అత్యుత్సాహం.. తద్వారా ప్రజల మధ్య పెరుగుతున్న విద్వేషాలు ఒక్కటిగా వున్న జాతిని కుదేలు చేస్తుండడం గురించే ఈ ఆవేదనంతా.

Posted

We want separate state of Rayalaseema if kurnool is not made capital or it at least has to get some major government offices..

Posted

What a state...we r united till 1972-2001 (with out any movements)
Lanja p Sonia enter ayindhe 2,3 states anta.....evadi place ni vadu capital capital chesukondi......

Okappudu andhra ani cheppukotaniki garvanga undedhi ippudu siggu ga undhi.....


Eppudu siggu padalsi vasthundhe....tamilians ki unna unity ledhu....ippudu I'm proud to live in tamilnadu if I return to india....don't want to be part of andhrapradesh....

Posted

The whole indian mentality is screwed up. Its just andhra got highlighted first as we lead in such areas mostly.

Posted

The whole indian mentality is screwed up. Its just andhra got highlighted first as we lead in such areas mostly.

 

lol

Posted

sepearte District kuda adagandi ra.....memalni( politicians) thittadaniki kuda boothulu saripovu ra.....shavala meedha pelalu erukune rakam vellu...vella venaka janalu ela nadusthunaru ra babu

Posted

sirio.gif   not possible because... politicians ki seema lo antha lands levvu and antha rates kuda levvvu they wont need separate state to start looting

×
×
  • Create New...