Jump to content

Veedu Rest Ichey Laa Ledu...


Recommended Posts

Posted

పోలవరం ముంపు ప్రాంతాలపై ఆర్డినెన్స్ సిద్ధం!

-సీమాంవూధలోకి ఖమ్మం జిల్లా ఏడు మండలాలు
-లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టూ వారికే
-కేంద్రంలో చక్రం తిప్పిన సీమాంధ్ర అగ్రనేత

హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఇరు రాష్ట్రాల సరిహద్దులు, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై కేంద్రం ఆర్డినెన్స్‌ను రూపకల్పనలో నిమగ్నమైంది. పోలవరం ముంపు ప్రాంతాల విషయమై గత కొన్ని రోజులుగా మంతనాలు జరుపుతున్న కేంద్ర హోంశాఖ, సీమాంధ్ర నేతల ప్రతిపాదనలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో ముంపు గ్రామాలను మాత్రమే కాకుండా ఏకంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రవూపదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ తేనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భద్రాచల రామాలయం ఉన్న గ్రామం మినహాయించి, దాని పరిసర ప్రాంతాలన్నీ సీమాంవూధలో కలిపేవిధంగా ఆర్డినెన్స్‌ను రూపొందించినట్లు తెలిసింది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో 334 గ్రామాలుండగా, 134 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతున్నాయి.

తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో సవరణలకు పట్టుబట్టిన సీమాంధ్ర అగ్రనేత ఒకరు, ఏడు మండలాల విలీనంపై ప్రధానమంవూతిని ఒప్పించినట్లు సమాచారం. దీంతో బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, రవరామచంవూదాపురం, భద్రాచలం మండలాలు ఆంధ్ర వూపదేశ్‌లో కలవనున్నాయి. ముంపు బాధితులకు సొంతజిల్లాలోనే పునరావాసం కల్పించేందుకు వీలుగా ఏడు మండలాలను ఆంధ్రవూపదేశ్‌లో కలపాలని సదరు నేత కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. ఫలితంగా చింతూరు మండల పరిధిలోని 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంగల లోయర్ సీలేరు జలవిద్యుత్ కేంద్రం తెలంగాణ నుంచి ఆంధ్రవూపదేశ్‌లోకి వెళ్లనుంది. దీంతో ఏటా 1,100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ కోల్పోవాల్సి వస్తుంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏటా వెయ్యికోట్ల రూపాయల మేరకు నష్టపోతుంది.

×
×
  • Create New...