Jump to content

Recommended Posts

Posted

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కట్టుకున్న భార్య వేరొకరితో ఉండడాన్ని సహించలేక భర్త అతనిని తుపాకితో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని అరూర్ సమీపంలో ఉన్న వాటతోటం గ్రామానికి చెందిన 28 ఏళ్ల శశికుమార్ 23 ఏళ్ల దీపను ఏడేళ్ల క్రితం పెళ్లాడాడు. వీరిద్దరికీ ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఐతే పొరుగు గ్రామంలో ఉంటున్న చెన్నకృష్ణన్ తో దీపకు పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత రెండేళ్లుగా భర్త శివకుమార్ లేని సమయాల్లో దొంగచాటుగా వచ్చి ఆమెతో అతడు గడుపుతున్నాడు. ఐతే విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు వారిద్దరినీ హెచ్చరించారు. ఐతే వారు మాత్రం తమ దారిని మార్చుకోలేదు. మంగళవారంనాడు శివకుమార్ రాత్రిపూట పదిన్నర గంటలకు వచ్చి ఇంటి తలుపు తీయగానే తన భార్య చెన్నకృష్ణన్‌తో ఏకాంతంగా ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వారిద్దరిపై మండిపడ్డాడు. అతడిపై భార్యతోపాటు చెన్నకృష్ణన్ కూడా తిరగబడ్డారు. దీంతో కోపంతో రగిలిపోయిన శివకుమార్ ఇంట్లో ఉన్న నాటు తుపాకితో అతడిని కాల్చాడు. తూటా అతడి శరీరం నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివకుమార్ పోలీసు స్టేషనులో లొంగిపోగా, అవమానభారంతో అతడి భార్య నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

×
×
  • Create New...