Jump to content

Recommended Posts

Posted

తిరుపతిలో లోక్ సత్తా పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ పార్టీ కార్యక్రమానికి తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి హాజరయ్యారు. ప్రజలకు మంచి చేయాలనే భావనతో జేపీ ఐఏఎస్ పదవిని త్యజించి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన ప్రశంసించారు. రాజకీయంలో నెలకొన్న అవినీతిని అంతం చేసేందుకు ఆయన పార్టీ పెట్టారన్నారు. అవినీతిపై పోరాటానికి నడుం బిగించిన జేపీని చూస్తే తన పాట గుర్తువస్తోందని సిరివెన్నెల అన్నారు. ‘‘మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే.. మొదటి వాడు ఎప్పుడూ ఒంటరే మరి’’ అని తెలుగు సినిమా పాటలోని భావాన్ని ఆయన సభికులకు వివరించారు. ఈ కార్యక్రమానికి జేపీతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు

×
×
  • Create New...