Jump to content

Kishan Reddy Sawaal..

Recommended Posts

Posted

మోడీపై కాదు..దమ్ముంటే నాపై పోటీ చేయి

- డిపాజిట్ కూడా దక్కదు..
- అసదుద్దీన్‌కు కిషన్‌రెడ్డి సవాల్
- ఎంఐఎం మతోన్మాద,
- అరాచక శక్తి అని విమర్శ
హైదరాబాద్, మార్చి 3 (టీ మీడియా): దమ్ముంటే అంబర్‌పేటలో తనపై పోటీకి దిగాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మోడీకి దమ్ముంటే.. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో తనపై పోటీ చేసి గెలవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా కిషన్‌రెడ్డి ఈ విధంగా స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంఐఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంఐఎం మతోన్మాద, అరాచక శక్తి అని ఆరోపించారు. అసదుద్దీన్ నక్కలాంటి వ్యక్తని, సింహంలాటి మోడీ వెళ్తుంటే.. నక్కలా అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు బీజేపీని, నరేంద్రమోడీని విమర్శించే స్థాయి లేదన్నారు.

bjpkishrdy.jpg సెక్యులరిజం గురించి అసదుద్దీన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆ సెక్యులరిజమే ఆత్మహత్య చేసుకునేట్టుగా ఉందన్నారు. హిందువులను, హిందూ దేవుళ్లను అపహాస్యం చేసే మీరు సెక్యులరిజం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. దేశం మీద యుద్ధం ప్రకటించిన అక్బరుద్దీన్ జైలుకు పోయినా వారి గుణం మారలేదన్నారు. అన్నదమ్ములిద్దరు మాట్లాడినట్లు.. దేశ విభజన సమయంలో ముస్లింలీగ్, చివరకు రజాకార్లు కూడా మాట్లాడలేదన్నారు. అసదుద్దీన్‌ను ఓడించడానికి మోడీ అవసరం లేదని, బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త చాలన్నారు. ఆయనకు దమ్ముంటే.. అంబర్‌పేట స్థానంలో నాతో పోటీకి దిగాలి. ఇక్కడ 50వేల మంది ముస్లింలు ఉన్నారు. వారెవరూ అసదుద్దీన్‌కు ఓటు వేయరు. చివరకు ఆయనకు డిపాజిట్ దక్కదుఅని అన్నారు.

ప్రజల చెమటతో నిర్మాణమైన హైదరాబాద్ నగరం మజ్లిస్ జాగీర్ కాదన్నారు. ఇన్నేళ్లు పాతబస్తీని ఎందుకు అభివద్ధి చేయలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఒక్క సీటు కూడా ఊడిపోతుందని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పొత్తుల ఎజెండా బీజేపీకి లేనేలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని, ఎంపీల జాబితాను జాతీయ పార్టీ విడుదల చేస్తుందని తెలిపారు. సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, నేతలు ఎస్ కుమార్, ప్రదీప్‌కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు.

బీజేపీలో చేరికలు
బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగయ్య దొర పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి, సభ్యత్వం అందించి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.

One of the sensible reply to that Owasis   bye1  bye1

Posted

jogi jogi kottukunte emaitado ade aitadi brahmilaughing.gif

×
×
  • Create New...