Jump to content

Recommended Posts

Posted

షోయబ్ మాలిక్ - అయేషా సిద్దికీలకు వివాహమైందని నిరూపించే నిఖానామా(వివాహ పత్రం)ను సిద్దికి కుటుంబం శుక్రవారం మీడియా ముందుకు తెచ్చింది. దీంతో సానియా - మాలిక్‌ల పెళ్లి వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. హైదరాబాదుకు చెందిన అయేషా సిద్దికిని 2002లో పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడైన షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నాడని నిరూపించే నిఖానామా పత్రాన్ని శుక్రవారం పలు పాకిస్తాన్ టెలివిజన్ ఛానళ్లు ప్రత్యేకంగా ప్రసారం చేశాయి.

ఈ పత్రంలో వరుడు సంతకం చేయాల్సిన చోట షోయబ్ మాలిక్ సంతకం, వధువు చేయాల్సిన చోట అయేషా సంతకాలు ఉండటం గమనార్హం. నిఖానామా పత్రాన్ని విడుదల చేయడంపై అయేషా సిద్దికి ఓ ఛానల్‌తో మాట్లాడుతూ..." నేనెవరో తెలీనట్లు షోయబ్ మాట్లాడుతున్నాడు. అసలు మా ఇద్దరికి వివాహమే జరగలేదని బుకాయిస్తున్నాడు. అందుకే ఈ పత్రాన్ని బయటపెట్టాల్సి వచ్చింది" అని చెప్పింది.

ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత కూడా సానియా మీర్జా షోయబ్ మాలిక్‌ను వివాహమాడినట్లయితే, ఆమె షోయబ్‌కు రెండో భార్య అవుతుందని అయేషా పేర్కొంది. కాగా ఇప్పటికి కూడా అయేషా వివాహం సంగతి తమకు తెలియదని షోయబ్ కుటుంబం వాదించడం గమనార్హం.

Posted

^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^" ^^"

sania aka sani  dancegdb dancegdb dancegdb dancegdb

×
×
  • Create New...