Jump to content

Mohana Makaranadam By Dr. Mohan Kanda


Recommended Posts

Posted

Born three months prematurely in an era sans antibiotics or incubators, the author, in his own words, ‘has no business to be alive.’ But live he did. Three months later, a benediction in the hands of Gandhiji gave the child the name, Mohan Das. Mohan was a radio and stage actor at age five and child film-star by six. As an adolescent he was drawn to the study of Mathematics and as a young man he was a researcher in Relativity. Soon after that he entered the Indian Administrative Service (IAS), in which service he had a distinguished career and rose to be Secretary to Government of India and Chief Secretary Andhra Pradesh. Then, upon retirement, he went on to join the National Disaster Management Agency (NDMA) at the rank of Union Minister of State. This book “speaking of many things” (working title to be inserted) narrates carefully-selected incidents from this journey, bringing to the narration a style filled with joie de vivre and subtle, self-deprecating humor. The book recounts events that are varied and surprising but always interesting. This range of experiences perhaps reflects the life of a bureaucrat living through interesting times. At one moment we read of the experience of handling mobs during the Separate Andhra movement of the 1970s, in the next we read of Chief Ministers unable to understand that a civil servant’s loyalty is to the government and not to them personally. We learn of Kanda’s experiences with Vice President Hidayatullah and Verghese Kurien, two men he admired and enjoyed cordial relations with, whom he was forced to stand up to in official matters.  The book deals with matters that are of particular relevance today, as it deals with issues that vex the bureaucrat—politician relationship. Kanda takes a nuanced approach, distinguishing between firmness and revolt, the following of protocol without surrendering self-respect, and taking a firm stand against unfair treatment. Giving us an insider’s view on the way the governance mechanism functions, the author takes us into the midst of extraordinary situations a bureaucrat may suddenly find himself in. How to manage protocol when the King of Jordan insists on presenting an expensive gift, what happens when a file mischievously disappears from the President’s office, and what to do when a Minister vanishes from an Agriculture exhibition abroad! This selection of events, however, is not just about the functioning of the highest levels of government. It is also about personal choices, values, and experiences that define an individual. We see the dilemmas of an idealistic young man as he wonders if accepting lunch in a village compromises his integrity; we also observe difficult personal choices an honest bureaucrat must make, such as turning down his father’s claim to a property as a resulting land ceiling. The book also deals with the amusing and the quirky twists of fate, such as landing in a job he disliked for the crime of having good dress sense! He speaks of his passion for Hindi film music and his love of pets. The book also evokes nostalgia as Kanda describes how the film director LV Prasad used to handle child artistes such as him. On the whole, the life that emerges from these pages is one of unpredictable situations, dealing with interesting people and major responsibilities, and oftentimes surprising outcomes. Narrated with wit and keenness of observation, this would be a valuable book, especially to those interested in the workings of governance in India. - 

Posted

kanda%20column%20photo1394128925.jpg

Posted

అనుభవాలూ - జ్ఞాపకాలూ డా. మోహన్‌ కందా  రచయిత గురించి ... ''మోహన్‌ మకరందం'' రచయిత డా. మోహన్‌ కందా గారి గురించి చెప్పాలంటే-  2010 అక్టోబరు వరకు నేషనల్‌ డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలో మెంబర్‌గా (సెంట్రల్‌ మినిస్టర్‌  ఆఫ్‌ స్టేట్‌ హోదాలో)  బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ మోహన్‌ 2003-05ల మధ్య మన రాష్ట్రానికి చీఫ్‌ సెక్రటరీగా,  కోనసీమ రైతుల ''క్రాప్‌ హాలీడే'' సమస్యపై ప్రభుత్వం వేసిన కమిటీకి చైర్మన్‌గా పరిచితులు. ఎన్‌.టి.రామారావు (స్పెషల్‌ సెక్రటరీ 1983-84), చంద్రబాబు నాయుడు (చీఫ్‌ సెక్రటరీ 2003-04), వైయస్‌ రాజశేఖరరెడ్డి (చీఫ్‌ సెక్రటరీ 2004-05) వంటి వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగిన ముఖ్యమంత్రులతో పనిచేసి శభాషనిపించుకోవడం శ్రీ మోహన్‌  సామర్థ్యానికి, వ్యవహారదక్షతకు నిదర్శనం. డా|| చెన్నారెడ్డితో తలపడిన శారదా ముఖర్జీ వంటి గవర్నరు వద్ద (సెక్రటరీ 1977-79), పాండిత్యం, సున్నితత్త్వం, తో బాటు రాజీలేని వ్యక్తిత్వం మూర్తీభవించిన హిదాయతుల్లా వంటి ఉపరాష్ట్రపతి వద్ద (సెక్రటరీ 1981-83), వెంకయ్య నాయుడు వంటి బిజెపి నేత వద్ద, చతురానన్‌ మిశ్రా వంటి కమ్యూనిస్టు మంత్రి వద్ద నెగ్గుకు రావాలంటే పరిస్థితులకు అనుగుణంగా మెలగలిగిన చాకచక్యం, ఒడుపు కావాలి. వారితో మసలగలిగే విషయపరిజ్ఞానం కావాలి.  న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎంతో పేరుప్రఖ్యాతులు గడించిన కందా భీమశంకరం, ప్రముఖ సామాజిక కార్యకర్త పాపాయమ్మగార్ల కుమారుడైన మోహన్‌ చెన్నయ్‌లో ఆంధ్ర బాలానంద సంఘం సభ్యుడిగా నాటకాలలో వేశారు. సినిమాలలో బాలనటుడిగా 28 తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో వేషాలు వేశారు. (''పెళ్లి చేసి చూడు'', ''మనోహర'' వంటివి) ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎమ్మెస్సీ చేసి, దరిమిలా చాలా ఏళ్ల తర్వాత అదే యూనివర్శిటీ  నుండి వ్యవసాయ ఋణవ్యవస్థపై డాక్టరేట్‌ తీసుకున్నారు. స్టేటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసరుగా పనిచేస్తూ 1968లో ఐయేయస్‌ క్యాడర్‌కు సెలక్టయ్యారు. కృష్ణాజిల్లాలో అసిస్టెంటు కలక్టరుగా, 1972 నాటి 'జై ఆంధ్ర' ఉద్యమ సమయంలో ఒంగోలులో సబ్‌ కలక్టర్‌గా, విశాఖపట్టణం, కర్నూలులలో కమర్షియల్‌ టాక్సెస్‌ డిప్యూటీ కమిషనర్‌గా, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలక్టరుగా, హైదరాబాదులో అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ అథారిటీగా పనిచేసిన శ్రీ మోహన్‌ కెరియర్‌లో చాలా భాగం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధితో ముడిపడివుంది. అగ్రికల్చర్‌, కో-ఆపరేటివ్‌ సొసైటీలు, ఫిషరీస్‌ - ఇవన్నీ ఆయనను కోరుకుని వచ్చిన శాఖలు. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ శాఖలో సెక్రటరీగా పనిచేస్తూండగానే కేంద్రంలో అదే శాఖలో పనిచేయడానికి పిలుపు వచ్చింది. 1995 నుండి 2002 వరకు కేంద్రప్రభుత్వంలో వుండి అగ్రికల్చర్‌, కో-ఆపరేషన్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖల్లో పని చేస్తూ 30 దేశాలు పర్యటించి, అక్కడి పరిస్థితులు అధ్యయనం  చేసి నైపుణ్యం గడించారు. ఆ అంశాలపై ఆంగ్లంలో పుస్తకాలు రచించారు. అవి - గ్రామీణాభివృద్ధిపై రాసిన ''టింక్చర్‌డ్‌ కాన్వాస్‌'', భారతదేశంలోని భూవనరులపై రాసిన ''వసుంధర'',  శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలితాలను రైతుకు చేర్చే ప్రయత్నాలు భారతదేశంలో, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాలలో ఏ మేరకు జరుగుతున్నాయన్న అంశంపై ''ఫర్‌గివింగ్‌ ఎర్త్‌'' !  భారతదేశంలో సహకారరంగంలో ఋణాలపై వ్రాసిన ''నాట్‌ బై అదర్స్‌ హ్యాండ్స్‌ - ఏన్‌ ఎంథాలజీ ఆఫ్‌ ఎ సెంచరీ ఆఫ్‌ క్రెడిట్‌ కోపరేటివ్స్‌ ఇన్‌ ఇండియా'' పుస్తకం యిటీవలే వెలువరించారు. ఆయన నిర్వహించిన, నిర్వహిస్తున్న బాధ్యతలు : - నాబార్డ్‌ సూపర్విజన్‌ బోర్డులో మెంబరు - 12 వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై వ్యూహాలకై ప్లానింగ్‌ కమిషన్‌ వారి స్టీరింగ్‌ కమిటీలో మెంబరు - ఢిల్లీ ఐఐటి వారి సెంటర్‌ ఫర్‌ ఎట్మాస్‌ఫియరిక్‌ స్టడీస్‌లో విజిటింగ్‌ ఫ్యాకల్టీ - చెన్నయ్‌ ఐఐటి వారి ఇండో-జర్మన్‌ సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవలప్‌మెంట్‌కై ఎడ్జన్‌క్ట్‌ ఫ్యాకల్టీ - బాలికల సమస్యలపై సమాజంలో అవగాహన పెంచే తెలుగు టీవీ ఛానెల్‌ను ఎంపిక చేయడానికి యునిసెఫ్‌ నియమించిన జ్యూరీ చైర్మన్‌  - రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ఫస్ట్‌ కోర్టు సభ్యులు  డా|| మోహన్‌ కందా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలతో బాటు ఉర్దూ, తమిళం, జర్మన్‌, ఫ్రెంచ్‌ భాషలు చదవగలరు, వ్రాయగలరు. పుస్తకపఠనం, సంగీతం ఆయన హాబీలు. క్రీడల్లో క్రికెట్‌, బ్రిడ్జ్‌, బిలియర్డ్స్‌, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌ ఆయనకు అభిమానపాత్రమైనవి. ఆయనకు భార్య, యిద్దరు పిల్లలు. స్వభావరీత్యా స్నేహపాత్రులు. హాస్యసంభాషణా చతురులు. కీ.శే. ముళ్లపూడి వెంకట రమణ 'విన్నావా కందా మోహన్‌..' మకుటంతో యీయనపై కంద పద్యాలు రాశారు.  వివిధ శాఖల్లో తను గడించిన అనుభవాన్ని, వ్యక్తిగత జీవితంలో మనమందరం అనుసరించవలసిన కొన్ని మెళకువలను నేటి యువతరం కోసం శ్రీ మోహన్‌ పాఠకులతో పంచుకుంటున్నారు.  నా మాట పాఠకులకు నమస్కారం. నా పేరు మీలో కొందరికే తెలిసి వుండవచ్చు. చిన్నపుడు ''పెళ్లి చేసి చూడు''లో 'అమ్మా నొప్పులే' పాటకు అభినయించిన బాలనటుడిగా ఒకతరం వారికి గుర్తుండవచ్చు. తర్వాత ఐయేయస్‌ క్యాడర్‌కి వెళ్లాక మాదంతా తెరచాటు వ్యవహారమే! ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చీఫ్‌ సెక్రటరీ (2003-2005)గా చేసినపుడు కొత్తతరం వారు గమనించి వుండవచ్చు. రాజకీయ నాయకుల్లా, తెరవేలుపుల్లా, క్రికెటర్లలా మేం నిత్యం పేపర్లలో, టీవీలలో కనబడం. మా ఆలోచనా ధోరణి, పరిపాలనా శైలి, ప్రభుత్వం నడిచే తీరు, దానిలో మేం ఎదుర్కునే సమస్యలు, మాకుండే వెసులుబాట్లు - యివన్నీ సామాన్య పౌరులకు ఎక్కువగా తెలియవు. మా గురించి చర్చలు జరగవు. జరిగాయంటే అనర్థానికే (ఫర్‌ 'రాంగ్‌ రీజన్స్‌'కే) అని అర్థం చేసుకోవాలి.  పరిపాలన బాగా సాగినంతకాలం వెనుక ఎవరుండి నడిపించారన్నది సామాన్యుడికి అనవసరం. ఏదైనా చిక్కు వచ్చినపుడే ఆ సమస్యా, దాన్ని పరిష్కరించిన విధానం అతని దృష్టికి వస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే వరదలొచ్చి ఏదైనా ఓ కాలువలో ఓ పిల్లాడు పడిపోయాడనుకోండి. కాలువలోకి దూకి పిల్లాణ్ని రక్షించినవాడికి మెప్పు లభిస్తుంది. అదృష్టం బాగుంటే సాహసవీరుల ఎవార్డు కూడా యిస్తారు. వరద సమయంలో ఆ కాలువలోకి నీరు రాకుండా కట్టడి చేసే ఆనకట్టను ఎవరైనా ముందే ప్లాను చేసి కట్టేశారనుకోండి. ప్రమాదమూ జరగదు. దానిపై మన దృష్టీ పడదు. ఆనకట్ట ప్లాను చేసినతని గురించి మనకు తెలియనే తెలియదు. అతని ముందుచూపును అభినందించాలని మనకు తోచనే తోచదు.  గద్దె వెనక్కాల వ్యవహరించే ఎడ్మినిస్ట్రేటర్స్‌ యిటువంటి గుర్తింపు-లేమికి మానసికంగా సిద్ధపడాలి. మిత్రుడు, నాకు సీనియర్‌ శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌ 'నాహం కర్తా..' ద్వారా టిటిడిలో ఆయన సాధించిన విజయాల గురించి చెప్పేదాకా చాలామందికి టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల కష్టాలు తెలియనే తెలియవు. తిరుమల వెళ్లే భక్తులు యీనాడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు కల్పించడానికి అడుగడుగునా ఆయన ఎన్ని అవరోధాలు ఎదుర్కోవలసి వచ్చిందో ఆయన స్వయంగా చెప్పేదాకా వారికి తెలిసే అవకాశమే లేదు. అదే విధంగా దేశాన్ని మలుపు తిప్పిన పలు కీలకమైన సందర్భాలలో తెరవెనుక ఆయన నిర్వహించిన భూమిక గురించి 'అసలేం జరిగిందంటే..' ద్వారా పాఠకులకు వివరించేదాకా రాజకీయ నాయకులకు, అధికారులకు మధ్యన వుండే సమీకరణం గురించి పౌరులకు పెద్దగా అవగాహన వుండి వుండదు.  నా యీ పుస్తకంలో పలు వుద్యోగాలలో నేను ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావన రాక తప్పదు కానీ నా 'ఫోకస్‌' యువతరానికి చెందిన టీమ్‌ లీడర్స్‌పై వుంది. ఒకప్పుడు ఎడ్మినిస్ట్రేషన్‌ అంటే ఐయేయస్‌ మాత్రమే గుర్తుకు వచ్చేది. ఈనాడు ఎంబిఏల ధర్మమాని ఎటు చూసినా ఎడ్మినిస్ట్రేటర్స్‌ కనబడుతున్నారు. వీళ్లనే టీమ్‌ లీడర్స్‌ అంటున్నారు. వీళ్ల విజయమే మన సంస్థల విజయం, మన దేశపు విజయం. వీళ్లు సరిగ్గా, నైపుణ్యంతో వ్యవహరించకపోతే వారు పని చేసే సంస్థ మాత్రమే కాదు, స్నోబాలింగ్‌ ఎఫెక్ట్‌తో అంతిమంగా మన ఆర్థిక, సామాజిక, పాలనా వ్యవస్థ యావత్తు ('బాడీ పాలిటిక్‌') కుప్పకూలుతుంది.  లక్ష్యం ఎలా ఏర్పరచుకోవాలి, లక్ష్యసాధన కనువైన మనుష్యులను ఎలా ఎంచుకోవాలి,  వారితో ప్రజాహితం దృష్ట్యా ఎలా వ్యవహరించాలి, పరిస్థితుల కనుగుణంగా మననెలా మలచుకోవాలి, లక్ష్యం విఫలమైనపుడు మనను మనం ఎలా ఓదార్చుకోవాలి, యితరులకు ఎలా సర్దిచెప్పాలి, గెలిచినపుడు దాన్ని ఎలా హరాయించుకోవాలి, వ్యక్తిగతంగా మనను మనం ఏ విధంగా తూకంగా వుంచుకోవాలి, ఆరోగ్యం, వినోదం, కుటుంబ బాధ్యతలు, ఆధ్యాత్మికత వీటన్నిటి మధ్య ఎలా సమన్వయం చేసుకోవాలి ఇవన్నీ యీనాటి టీమ్‌ లీడర్స్‌ తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడం పలురకాలుగా వుంటుంది. వీరికి కళాశాలలలో నేర్పేది కొంతే వుంటుంది. ఏదైనా సంస్థలో చేరిన తర్వాత, రకరకాల అనుభవాల ద్వారా, సీనియర్ల ద్వారా, విజయం సాధించిన మహామహుల ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు.  వారిని లక్ష్యం చేసుకుంటూ వారికి ఉపయోగపడే రచన అందించాలనే తపనే ''స్వాతి'' వారపత్రికలో యీ పేరున శీర్షిక నడపడానికి పురికొల్పింది. ''స్వాతి''లో సీరియల్‌కు వచ్చిన స్పందన మరిన్ని వ్యాసాలు చేర్చి యీ పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. నిజానికి యిది రాయాలనే ఆలోచనకు కాపీరైట్‌ మా అమ్మాయి అపర్ణదే. తను రెచ్చగొట్టి వుండకపోతే నేను దీన్ని రాసేవాణ్నే కాను. ఇదిలా ఆసక్తికరంగా, జనరంజకంగా రూపుదిద్దుకోవడంలో ముఖ్యభూమిక వహించినది మాత్రం- శ్రీ ఎమ్బీయస్‌ ప్రసాద్‌! ముళ్లపూడి రమణగారు మమ్మల్నిద్దర్నీ కలిపారు. సంఘటనల కూర్పు, కథనశైలి, అధ్యాయాలుగా వింగడింపు, పుస్తక రూపకల్పన, ఛాయాచిత్రాల ఎంపిక, అమరిక - యిలాటి విషయాలపై నాతో వాదించి, వేధించి, చివరకు ఔననిపించడంలో అమితమైన ఓర్పు, నేర్పు చూపారు ప్రసాద్‌.  ఇదేదో మేనేజ్‌మెంట్‌ పాఠ్యపుస్తకంలా వుంటుందని కంగారు పడవద్దు. నేను విన్న, కన్న, చదివిన, అనుభవించిన అనేక విషయాల నుండి సారాంశాన్ని పువ్వులలోని  మకరందాన్ని తేనెటీగ సేకరించిన రీతిలో సేకరించి మీకు అందిస్తాను. చెప్పేదేదో మోహనంగా, పఠనమనోహరంగా, హృద్యంగా వుండాలని నాకు తెలిసిన ఉదంతాలను, జోక్స్‌ను రంగరించి సరదా శైలిలోనే చెప్తాను. చెప్పడానికి ఆధారమంటూ ఒకటి వుండాలి కాబట్టి నా ఆత్మకథలా చెప్తాను. కానీ తారీకుల వారీగా కాదు. చెప్పే అంశం బట్టి అది కాస్త ముందుకీ వెనక్కీ వెళుతూ వుంటుంది.  - 

Posted

11394216301.jpg

Posted

అనుభవాలూ - జ్ఞాపకాలూ: డా. మోహన్‌ కందా  ఉగ్గుపాలగా గాడిదపాలు.. ఆ పై ఆల్కహాలు  గమనించారా, నా పేరూ గాంధీగారి పేరూ ఒకటే !  - మోహన్‌! దానికో స్టోరీ వుంది. ఏడో నెలలో పుట్టిన నేను వుంటానో వూడతానో అని పేరు కూడా పెట్టలేదు మావాళ్లు. అసలు మా వాళ్లలో ఈ బారసాలలూ, అన్నప్రాశనలూ, అక్షరభ్యాసాలూ.. మొదట్నించీ పెద్దగా అలవాటు లేవు. స్వాతంత్య్ర యోధురాలు, మహిళా ఉద్యమసారథి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గారున్నారు కదా, ఆవిడ అందరికీ దుర్గాబాయమ్మగారు కానీ నాకు దుర్గమ్మపిన్నే. తనూ మా అమ్మా కాకినాడలో క్లాస్‌మేట్స్‌. ప్రాణస్నేహితులు. ఉద్యమాల్లో కలిసి పనిచేశారు. మేం మద్రాసు వచ్చాక మళ్లీ స్నేహం బలపడింది.  మద్రాసు వచ్చాక ఆవిడ ఆంధ్రమహిళా సభ పెట్టింది. సభకు అడయార్‌లో ఓ భవంతి కట్టి దాని శిలాఫలకాల ఆవిష్కరణకు గాంధీగారిని రప్పించింది. గాంధీగారు వచ్చినపుడు నన్ను తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు. ఆయన నన్ను ఆశీర్వదించారు. అంతే.. నాకు ఆయన పేరు - మోహనదాస్‌ అని పెట్టారు. రాను రాను 'దాసు' కాలగర్భంలో కలిసిపోయింది. కాలక్రమేణా అది మోహన్‌బాబుగా.. మోహన్‌గా మిగిలింది. ఇంకో విషయం ఏమిటంటే - నా పెళ్లి గాంధీ జయంతిన జరిగింది! ఇంకింకో విషయం చెప్పనా.. గాంధీగారు మేకపాలు తాగేవారు, నాకు చిన్నపుడు మేకపాలు పట్టేరు, గాడిదపాలతో పాటు! దానికోసం మేకను యింట్లో పెంచేవారు. అది చేసే కశ్మలం చూసి మా నాన్నగారు చికాకుతో గెంతులేసేవారు. xxxxxxxx అది 1945 వ సంవత్సరం.సెప్టెంబరు నెల 4 వ తారీకు. చెన్నపట్నంలో మైలాపూర్‌లో సి.పి.కోయిల్‌ వీధిలో 20 వ నెంబరు యింట్లో.. పడకటింట్లో ... మా అమ్మ పురిటినొప్పులు పడుతోంది. పుట్టబోయేది మగబిడ్డా, ఆడబిడ్డా అని ఆతృత పడుతోంది. ఏ బిడ్డయినా సరే, బతికే బిడ్డా, అర్ధాయుష్షు బిడ్డా అని ఆందోళన చెందుతోంది. ఎందుకంటే అది ఆమె పదో ప్రసవం. అప్పటిదాకా బతికి బట్టకట్టినవాళ్లు యిద్దరే ! పదిహేనేళ్ల వయసున్న కొడుకు శ్రీరామచంద్రమూర్తి, పన్నెండేళ్ల వయసున్న కూతురు కల్పకం. తక్కినవాళ్లు కొందరు పురిట్లో పోతే, మరికొందరు కొద్దికాలం జీవించి పోయారు.  గర్భంలో వున్న బిడ్డ (భవదీయుడు) సంగతి కూడా అనుమానంగానే వుంది. ఇంకా ఏడో నెలే! చూస్తే యిప్పుడో కాస్సేపట్లోనో పుట్టేసేట్టున్నాడు. నెలలు సక్రమంగా నిండి పుట్టినవాళ్ల గతే అలా వుంటే వీడి నుదుటిరాత ఎలా వుంటుందో! అయినా రాత రాయడానికి నుదుటిమీద చర్మమైనా ఏర్పడిందో లేదో! ఇలా ఆవిడ కంగారు పడుతూంటే మా నాన్నగారు భీమశంకరం గారు మంత్రసాని కోసం కబురు పెట్టి వాకిట్లో కంగారుగా పచార్లు చేస్తున్నారు. మంత్రసాని వచ్చేలోపుగా పురుడు వచ్చేస్తుందేమోనని ఆదుర్దా పడు తున్నారు. అంతకు ముందు తొమ్మిదిసార్లూ అదే జరిగింది. ఈ సారైనా మంత్రసాని రావాలని వేయిదేవుళ్లకు దణ్ణాలు పెట్టుకుంటూ అడావుడి పడుతున్నారు. ఇక్కడ మీకో సందేహం    రావచ్చు.  సిజేరియన్‌ చేసేలోపునే సహజప్రసవం జరిగితే నర్సింగ్‌ హోం వాళ్లు కంగారు పడతారని విని వుంటారు కానీ, యిలా మంత్రసాని రాకకీ సుఖప్రసవానికీ లింకు పెట్టి కంగారుపడడం వింతగా వుండవచ్చు. కానీ ఆయనంతే. అన్నీ లెక్కప్రకారం జరగాలి. సాధారణంగా మంత్రసాని వచ్చాకే ప్రసవం జరుగుతుంది కాబట్టి అలాగే జరగాలి. ఇంకోలా జరిగితే ఆయనకు కోపం, చికాకు, ఆదుర్దా. ఓ సారి కారులో మా అందరినీ  ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లారు. నేను ఐదారేళ్లవాణ్ని. నేను దిగుతూవుండగానే నా చేతిమీదే తలుపు వేసేశారు. కెవ్వుమన్న నన్ను చూసి జాలిపడకపోగా ఏం చేయాలో తెలియక విసుగూ, కోపం తెచ్చేసుకున్నారు. ఆయన లెక్కప్రకారం నా చేయి ఆ సమయంలో అక్కడ వుండకూడదు. కానీ వుంది. దాంతో చికాకు. ఆయన తరహాయే అంత. మా నాన్నగారిది కోనసీమ. వారి తండ్రి విశ్వనాథం గారు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ గా పనిచేసేవారు. మా నాన్నగారి విద్యాభ్యాసం రాజమండ్రి, మద్రాసులలో జరిగింది. ఎం.ఏ. ఎల్‌.ఎల్‌.బి. తర్వాత మద్రాసులో లాయరుగా ప్రాక్టీసు పెట్టారు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రరాష్ట్రం విడిపోయాక హైకోర్టు గుంటూరుకి, దరిమిలా హైదరాబాదుకి మారడంతో దానితో బాటు ఆయన తన మకాం మార్చారు. గుంటూరులో వుండగానే జడ్జి అయ్యారు.  ఆ తర్వాత సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేద్దామనుకుని 1961 లో ఢిల్లీకి మకాం మార్చారు. కానీ ఢిల్లీ పద్ధతులు ఆయనకు నచ్చలేదు. హైదరాబాదు తిరిగి వచ్చేశారు. ఆయన స్నేహితుడు దామోదరం సంజీవయ్యగారి కోరిక మేరకు వేజ్‌ బోర్డు చైర్మన్‌గా 7 ఏళ్లు చేశారు. 1978 లో గతించారు. 1917 లో మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ చావలివారి ఆడపడుచు.   సంఘసేవికురాలు. 1997 లో గతించింది. వాళ్ల తొలి సంతానమైన మా అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు.  పేపరు తయారీలో గణించిదగిన నిపుణుల్లో ఒకరు. భారతదేశంలో వున్న యించుమించు అన్ని పేపరు మిల్సులోను పనిచేశారు. 1955లో దొడ్డమ్మ మనవరాలు మహలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ముగ్గురు కొడుకులు. రెండో సంతానం మా అక్క కల్పకం ఎం.ఏ. చదివింది. భరతనాట్యంలో నిష్ణాతురాలు. మా బావగారు ఏచూరి సోమయాజులు గారు ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చదివి, ఎపిఎస్‌ ఆర్టీసిలోను, కేంద్రప్రభుత్వంలోను ఉన్నతోద్యోగాలలో పనిచేశారు. యునైటెడ్‌ నేషన్స్‌ తరఫున విదేశాల్లో పనిచేసి, తర్వాత ఢిల్లీ వచ్చి 1999లో పోయారు. ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సీతారాం ఏచూరి సిపిఎం పార్టీ పాలిట్‌ బ్యూరో సభ్యుడిగా జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నాడు. మా అన్నయ్యను కెమికల్‌ ఇంజనీరింగ్‌కు పంపిన మా నాన్నగారు నన్ను ఐయేయస్‌గా చూడాలని అనుకున్నారు. వేరే అవకాశాలు ఎన్ని వచ్చినా వద్దన్నారు. ఐయేయస్‌ పరీక్షలో ఏ యే సబ్జక్టులు తీసుకోవాలో కూడా ఆయనే నిర్ణయించారు. లోవర్‌ లెవెల్‌లో పొలిటికల్‌ సైన్సు, హైయ్యర్‌ లెవెల్‌లో పొలిటికల్‌ థాట్‌ ఆయనే నేర్పించారు. జనరల్‌ నాలెడ్జ్‌ అంతా నేర్పించారు. వచ్చిన ఇంగ్లీషంతా ఆయన ద్వారానే వచ్చింది.   అంతా అయి నేను బాగా ప్రిపేర్‌ అవుతున్నాను అనుకుంటున్న సమయంలో ఆయనకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఇక చూడండి, ఎంత బెంగపడి పోయారో! ఎటాక్‌ వచ్చినపుడు నేనెక్కడో వున్నాను. వార్త తెలిసి ఇంటికి వచ్చాను. 'నాన్నా' అని వెళ్లి పలకరించబోతే ఆయన కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ప్రాణభీతితో కాదు, నా ఐయేయస్‌ గతి ఏమవుతుందోనని డీలా పడిపోయారు. 'ఇక నేను నీకు పాఠాలు చెప్పలేనురా అబ్బాయ్‌' అన్నారు.  నన్ను ఐయేయస్‌గా చూడాలనుకున్నారు. ఈ ఎటాక్‌ కారణంగా అది సాధ్యపడదేమోనన్న దిగులు వచ్చేసింది ఆయనకు. నిజానికి నాకు ఐయేయస్‌పై ప్రత్యేకమైన మమకారం లేదు. మాథ్స్‌లో రిసెర్చి దగ్గర్నుంచి అనేకరకాలైన ఆప్షన్స్‌ వున్నాయి నా ఎదుట. కానీ నాన్నగారు చెప్పారు కదాని ఐయేయస్‌ ప్రిపరేషన్‌కు సరేనన్నా. కానీ ఆ లక్ష్యం ఆయనకు ప్రాణం కంటె ఎక్కువ అని నాకు అర్థమయ్యేసరికి ఏడుపు వచ్చింది. అప్పటికి యిరవై వొక్క ఏళ్ల వయసున్నా మా అమ్మ భుజంమీద పడి భోరున ఏడ్చాను. అప్పుడే నిశ్చయించుకున్నా - నాన్నగారి కోసమైనా బాగా చదవాలని.  చెప్పవచ్చేదేమిటంటే తను అనుకున్నది అనుకున్నప్రకారం కాకపోతే నాన్నగారు చాలా చికాకు పడిపోయేవారు.  కానీ మా నాన్నగారు ఎంత కంగారు పడినా లాభం లేకపోయింది. మంత్రసాని రాకుండానే నేను పుట్టేశాను. అదీ ఏడోనెలలో. మా అమ్మ భయపడ్డట్టే శరీరంమీద చర్మం కూడా ఏర్పడలేదు. మెదడుకూడా ఎక్స్‌పోజ్‌ అయివుండేదట. అప్పట్లో ఇన్‌క్యుబేటర్‌లు లేవు కదా. బయటకు తీశాక కూడా శరీరాన్ని దూదిలో పెట్టి వుంచేవారు. మాటిమాటికి ఒళ్ళంతా నీలంగా అయిపోయేదట. అప్పట్లో మా ఆఖరి మేనమామ మద్రాసు గవర్నమెంటు ఆసుపత్రిలో ఎంబీబీయస్‌ పూర్తి చేసి హౌస్‌సర్జన్సీ చేస్తూండేవాడు.  జూలియర్‌ సీజర్‌ కూడా ఏడోనెలలోనే పుట్టాడట. మరి సీజర్‌కు మేనమామ వున్నాడో లేదో నాకు తెలియదు కానీ నా విషయంలో మాత్రం మా మామయ్యా, మా అమ్మా కలిసి నన్ను మరణానికి యివతలి గట్టునపడేసి బట్టకట్టించారు. మొత్తానికి మూడునెల్లదాకా జాగ్రత్తగా చూసుకునేటప్పటికి 'ఆ వీడు బతికేశాడురా' అనుకునే స్టేజి వచ్చి ఒక మామూలు పిల్లవాడిలా తయారయ్యానట. నార్మల్‌ అయ్యేదాకా నాకు కాస్త కాస్త బ్రాందీ, గాడిదపాలు పట్టేవారు. నారు పోసినవాడు నీరు పోయకపోతాడా? అని సామెత. నాకు పుట్టగానే బ్రాందీ పోశాడు. పోయడం అంటే గరాటా పెట్టి పోశారనుకోవద్దు. నాలిక్కి తాకించేవారు. అంతకంటె నోరు తెరుచుకునేది కాదు. నా పేరు గురించి మొదటే చెప్పాను కదా. పెద్దాయన కదాని గాంధీగారి పేరు పెట్టారు కానీ, నిజానికి నాకు ప్రాణంపోసి బతికించిన మేనమామ పేరు పెట్టాలని మీ కనిపిస్తోందా? తమాషా చెప్పనా? ఆయన్ని అందరూ గాంధీ డాక్టరు గారనే అంటారు. అసలు పేరు పార్వతీశ్వర సోమయాజులు అని వున్నా...! తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో హస్తవాసిగల డాక్టరుగా ఖ్యాతి గడించాడు. పేరు దేముంది కానీ, పేదవాళ్ల డాక్టరుగా పేరు బడ్డ మావయ్య తను చేసిన వైద్యానికి నా దగ్గర భారీ ఫీజే పుచ్చుకున్నాడు. నన్ను అల్లుడిగా క్లెయిమ్‌ చేశాడు. వాళ్ల పెద్దమ్మాయి ఉషనే నేను చేసుకున్నది! పసిపిల్లవాడిగా నా అర్భకత్వం చూసివున్నారు కదా. ఇంతకంటె అర్భకుడు యింకెవరూ దొరుకుతాడని అనుకుని వుంటాడు ! చిన్నప్పుడు పట్టించిన గాడిదపాల మహాత్మ్యమో ఏమో నేను గాడిద చాకిరీ చేసే సివిల్‌ సర్వీసెస్‌కు వెళ్లాను.. ఆ కథలేగా చెప్తున్నది!   xxxxxxx కొసమెరుపు - కాకినాడలో మా మాతామహుడు చావలి రామసోమయాజులుగారు పేరుమోసిన కాంగ్రెసువాది. ఆయన పేరుమీద వీధికూడా వుందక్కడ. మద్రాసు లెజిస్ల్రేటివ్‌ కౌన్సిల్‌లో మెంబర్‌. కాకినాడ మున్సిపాలిటికి పదహారేళ్లు నిర్విఘ్నంగా చైౖర్మన్‌గా చేసారు. ఆయనకు గుఱ్ఱపు బండి వుండేదట. అది సాయంకాలం ఇంటికెళ్ళే టైం అయిపోతే ఎవరు చెప్పక్కరలేకుండానే వెనక్కితిరిగి దానంతట అదే వచ్చేసేదట. తర్వాత గవర్నమెంటు సర్వీసులో చేరాక అటువంటి జీవాలను చాలా చూశాను. ఆఫీసుకి వచ్చే టైం మాట ఎలా వున్నా, వెళ్లే టైము కాగానే ఠంచన్‌గా వెళ్లిపోయేవారు. మొహం కడిగేసుకోవడం, బ్యాగ్‌ సర్దేసుకోవడం అన్నీ సాయంత్రం 5 గంటల లోపునే! అప్పుడు తెలిసింది - ఆ గుఱ్ఱం గత జన్మలో ప్రభుత్వోద్యోగి అయి వుంటుందని! -

×
×
  • Create New...