jpismahatma Posted March 10, 2014 Report Posted March 10, 2014 ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను అధికంగా ప్రభావితం చేస్తున్న పేరు పవన్ కళ్యాణ్..! పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. అతని ప్రతి కదలికా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న అధికారికంగా పవన్ ప్రెస్ మీట్ ద్వారా స్పందించబోతున్నాడని, అంతేకాకుండా.. ఆ మీట్ లో ఏం మాట్లాడబోతున్నాడో కూడా తెలిసిపోయిందని మీడియా కోడై కూస్తోంది. ఆ ప్రచారం ప్రకారం... ఈ మీట్ లో సుమారు పవన్ 45 నిమిషాలు మాట్లాడుతాడని సమాచారం. ఇందులో అనేక రాజకీయ, సామాజిక విషయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల నుండి అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉంటాయనేది టాక్. వీటితో పాటు యువత, మహిళల సమస్యలు, విద్య, ఆరోగ్యం, మహిళల పురోభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పవన్ తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తాడని సమాచారం. అంతేకాకుండా తాను అధికారం కోసం కాకుండా.. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నాని, దానికి గల కారణాలు ఏంటో.. వివరణ ఇస్తాడని తెలుస్తోంది. ఈ విషయాలతో పాటు తనను అనేక రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించినా.. తిరస్కరించడానికి గల కారణాలను కూడా పవన్ విశ్లేషిస్తాడట..! రాజకీయ వ్యవస్థ పై తాను రాసిన పుస్తకంపైనా వివరణ ఉంటుందని టాక్. ఈ వార్తల నేపథ్యంలో పవన్ స్పీచ్ పై ఇటు రాజకీయంగా, అటు సినీ ఇండస్ట్రీలో మరింత ఆసక్తి నెలకొంది.Pawan-Kalyan-s-Political-Speech-gets-leaked-over-his-Political-Entry-32757 http://www.10tv.in/news/apexpress/Pawan-Kalyan-s-Political-Speech-gets-leaked-over-his-Political-Entry-32757
Recommended Posts