Jump to content

3D Animation movie on Venkateswara swamy


Recommended Posts

Posted

తిరుమల శ్రీవారిపై తొలిసారిగా శ్రీబాలాజీ పేరుతో ఓ త్రీడీ యానిమేషన్ చిత్రం రూపొందుతోంది. దాదాపు 250మంది సాంకేతిక నిపుణులు ఈ చిత్ర నిర్మాణం కోసం గత ఆరు మాసాలుగా శ్రమిస్తుండడం విశేషం.

రెండు గంటల పది నిమిషాల నిడివిగల ఈ త్రీడీ యానిమేషన్ చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మే 10వ తేదీన అట్టహాసంగా జరగనుంది. రికార్డు స్థాయిలో నిర్వహించనున్న అన్నమయ్య లక్షగళార్చన కార్యక్రమంలో భాగంగా ఈ ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ చిత్రంలోని ఐదు పాటలను శ్రీ వేటూరిసుందర రామూర్తి రచించగా, కె.ఎం. రాధాకృష్ణన్ ఈ గీతాలకు సంగీతాన్ని అందించారు. అలాగే ఈ గీతాలను యస్.పి. బాలసుబ్రమణ్యం, యస్.పి. శైలజ, మధుబాలకృష్ణన్, విజయ్ ఏసుదాస్, హరిణి, గాయత్రి తదితరులు ఆలపించారు.

×
×
  • Create New...