posaanisam Posted March 10, 2014 Report Posted March 10, 2014 ద్రాక్షారామం శివాలయం భీమేశాత్ ఉత్తమం దైవం న మహీతలే! అంటే భీమేశ్వరుని కంటే ఉత్తమమైన దైవం ఈ భూమిమీద లేదు అని. స్కాందపురాణంలోని గోదావరి ఖండంలో వ్యాసమహర్షి స్వయంగా చెప్పిన మాట ఇది. `ఇంతకీ ఈ భీమేశ్వరుడు ఏ ఊరిలో ఉన్నట్టూ` అంటారా? పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామంలో. ఇది కాకినాడకి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తుశకం పదవ శతాబ్ధంలో చాళుక్యభీముడు-1 అనేరాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. సామర్లకోటలో గుడిని కట్టించింది కూడా ఈయనే. అందువల్లనే ఇవి రెండు దేవాలయాలూ ఒకే విధంగా ఉంటాయి. "14వ శతాభ్దం లో శ్రీనాధుడు రచించిన భీమేశ్వరపురాణం లో పంచారామాల వివరం ఉంది. క్షీరసాగరమదనం తరువాత అసురులు శివుడిని గురించి ఘోరతపస్సుచేసి ఎన్నోవరాలు పొందారు. ఆ గర్వంతో వాళ్ళు దేవతలని అష్టకష్టాలు పెట్టడంతో, శివుడు పాశుపతాస్త్రం ప్రయోగించి వాళ్ళని నాశనంచేస్తాడు. అగ్నిజ్వాలలలో సర్వం ఆహుతి అయినా.. అసురులు పూజించిన శివలింగం మాత్రం అలాగే ఉంటుంది. దానిని అయిదు భాగాలు చేసి, పంచారామాలలో శివుడు ప్రతిష్టింపచేశాడని ఈ పురాణం చెపుతుంది." మొదటి భాగాన్ని ఇంద్రుడు అమరారామం అని పిలువబడే గుంటూరుజిల్లా అమరావతిలో, రెండవభాగాన్ని చంద్రుడు సోమారామమని పిలువబడే పశ్చిమగోదావరిజిల్లా గునుపూడి భీమవరంలో, మూడవభాగాన్ని శ్రీరాముడు క్షీరారామమని పిలువబడే పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లులోను, నాలుగవభాగాన్ని కుమారస్వామి కుమారారామం అని పిలువబడే సామర్లకోటలోనూ ప్రతిష్ఠించారు. అయిదవభాగాన్ని సప్తఋషులు ప్రతిష్ట చెయ్యాలి, కానీ ఆసమయానికి గోదావరినుంచి అభిషేక జలాలు తీసుకురావడంలో ఆలశ్యం జరగడంతో పరమశివుడు తనకుతానే శ్వయంభూగా వెలిశాడట. ద్రాక్షారామంలో గోదావరిలేదు. కానీ సప్తఋషులు దానిని అంతర్వాహినిగా తీసుకొని వచ్చారని చెపుతారు. ప్రస్తుతం ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొలనుకే ఆ జలాలు వస్తాయని చెపుతారు. అందుకే దానికి సప్తగోదావరి అని పేరు. ద్రాక్షారామం - 1. పంచారామాలలో ఒకటి 2. త్రిలింగాలలో ఒకటి (శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం) 3. నూట ఎనిమిది అతిగొప్ప శైవక్షేత్రాలలో ఒకటి 4. దక్షిణకాశీ ఋగ్వేదంలో, యజుర్వేదంలో, ఎన్నో పురాణాలలో, ఇతిహాసాలలో ద్రాక్షారామయొక్క పేరు ప్రస్తావించబడిందట. శివుని భార్య సతీదేవి యొక్క తండ్రి దక్షుడు. ఈతనియొక్క ఆరామమే(ప్రాంతం) ద్రాక్షారామం. అంటే పరమేశ్వరుని మావగారి ఊరు. అందుకేనేమో స్వయంభూగా వెలిశాడు! దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం కూడా ఇదేనట. ద్రాక్షారామంని దక్షిణకాశీ అని పిలుస్తారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. 1. వింధ్యపర్వతం పెరిగి పెరిగి సూర్యప్రకాశానికి కూడా అడ్డుపడేటంతగా ఎదిగిపోవడంతో, దాని గర్వం అణచడానికి కాశీనుంచి అగస్త్య మహర్షి వింధ్యపర్వతం దాటి వచ్చి ద్రాక్షారామంలో ఉండిపోయాడట. 2. వ్యాసమహర్షి తన శిష్యులతో కలసి కాశీలో ఇంటింటికీ తిరిగి బిక్షస్వీకరిస్తున్న క్రమంలో, ఆయనని పరీక్షించే ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు ఎక్కడా భిక్ష లభించకుండా చేశాడట. వీధులన్నీ తిరిగి అలసిపోయి, అన్నపూర్ణ కొలువున్న ఆ వూరిలోనే అన్నం దొరకలేదనే కోపంతో కాశీక్షేత్రాన్ని శపించ బోవడంతో ఆదిదంపతులు ప్రత్యక్షమై, ఊరిని విడిచి వెళ్ళిపొమ్మని చెప్తారు. అప్పుడు కాశీలాంటి మరొక క్షేత్రం ద్రాక్షారామమే కనుక ఇక్కడికి వచ్చేస్తాడు. శాతవాహనరాజులలో ఒకడైన హాలుడు గాధాసప్తసతి అనే గొప్పగ్రంధాన్ని రచించాడు. ఈయన భార్యపేరు లీలావతి. వీరిద్దరి వివాహం ద్రాక్షారామ భీమేశ్వరుని సన్నిధిలోనే జరిగిందట. లీలావతి అనే పేరుగల కావ్యంలో ఈ వివరాలు ఉన్నాయట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకే ఈ క్షేత్రాన్ని గొప్పగా ప్రస్తుతించడం జరిగింది.
posaanisam Posted March 10, 2014 Author Report Posted March 10, 2014 అంతే కాకుండా ఆదిశంకరాచార్యులవారిచే ప్రతిష్టించబడిన మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో(18) ఒకటి అని చెపుతారు ఆ కద ఇదిగొ పాదగయ - పిఠాపురం కాకినాడకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో అన్నవరం వెళ్ళే దారిలో 214 హైవే ప్రక్కన ప్రాచీనమైన పాదగయ క్షేత్రం ఉంది. పిఠాపురం చిన్న పట్టణమైనా, పౌరాణికంగా, చారిత్రకంగా నేపద్యం ఉన్న పురాతనమైన ప్రదేశం. దీని విశిష్టత ఏమిటంటే - ఇది త్రిగయక్షేత్రాలలో మూడవది, అష్టాదశ శక్తిపీఠాలలో పదవది, శ్రీదత్త అవతారాలలో ఒకటయిన శ్రీపాద శ్రీవల్లభ యొక్క జన్మస్థానము. పాదగయ, కుక్కుటేశ్వరస్వామి: కుక్కుటము అంటే కోడిపుంజు. గయాసురుడనే ఒక రాక్షసుడిని సంహరించడానికి ఈశ్వరుడు కోడి రూపం ధరించాడని ఈ స్థలపురాణం తెలియజేస్తుంది. నిజానికి రాక్షసులు కౄరులై ఉంటారు. కానీ, గయాసురుడు భాగవతోత్తముడు. విష్ణువునిగురించి తపస్సు చేసి పరమ పవిత్రమైన దేహం కావాలని కోరుకొంటాడు. ఇతను చేసిన పుణ్యకార్యాలవల్ల ఇంద్రపదవి లభిస్తుంది. కానీ పదవీత్యుడైన ఇంద్రుడు త్రిమూర్తులని ప్రసన్నంచేసుకొని తనపదవిని తనకు ఇప్పించమని కోరతాడు. త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలలో గయాసురుడి దగ్గరకు వెళ్ళి, ఒక విశేషమైన యజ్ఞం చేస్తున్నామని, అందుకోసం గయాసురుని పవిత్రదేహం ఏడురోజులపాటు కావాలని అడుగుతారు. గయాసురుడు అంగీకరిస్తాడు. ఒప్పందం ఏమిటంటే, యజ్ఞం పూర్తికాకుండా పీఠంగా ఉన్న శరీరం కదలకూడదు. గయాసురుడు తనదేహాన్ని యజ్ఞపీఠంగా చేసి శిరస్సు బీహారు గయలో(శిరోగయ), నాభి ఒరిస్సా జాజిపూర్లో(నాభిగయ), పాదాలు ఆంద్రప్రదేశ్ పిఠపురంలో(పాదగయ) ఉండేటంత పెద్దగా శరీరాన్ని పెంచుతాడు. విష్ణువు తలభాగంలో, బ్రహ్మ నాభి దగ్గర, ఈశ్వరుడు పాదముల దగ్గర ఉండి యజ్ఞంచెయ్యడం ప్రారంభించారు. గయాసురుడు కేవలం కోడి కూతనుమాత్రమే వింటూ శరీరం కదలకుండా ఆరురోజులు ఉంటాడు. కానీ, అతనిని సంహరించే ఉద్దేశ్యంతోనె ఇది అంతా జరుగుతుందికనుక విష్ణుమూర్తి ఆలోచన అనుసరించి శివుడు ఏడవరోజు రాకుండానే కోడి వేషము ధరించి కూతవేస్తాడు. గడువు ముగిసిందని భావించిన గయాసురుడు దేహాన్ని కదిలించడంతో వదించబడతాడు. ఇక్కడి స్వామి కుక్కుట లింగేస్వరస్వామి ఆయన దేవేరి శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారు. ఈమెని ఈ క్షేత్రంలో శ్రీఆదిశంకరాచార్యలవారు ప్రతిష్ఠించారట. పురుహూతికా అమ్మవారు - పదవ శక్తిపీఠం: దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుని భార్య. ఒకసారి దక్షుడు యజ్ఞం చేస్తూ ఈశ్వరుడికి ఆహ్వానం పంపడు. సతీదేవి తండ్రి చేస్తున్న యాగమే కనుక ఆహ్వానం లేకపోయినా వాత్సల్యంతో అక్కడికి వెళ్ళి అవమానింపబడుతుంది. అవమానభారంతో ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. కోపోద్రిక్తుడైన శివుడు తనగణాలతో ఆ ప్రదేశాన్ని సర్వనాశనం చేసి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని విరక్తుడై తిరుగుతాడు. ఏకశిలానంది ఈ విధమయిన వైరాగ్యం మంచిదికాదు కనుక, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. అప్పుడు ఆ ఖండికలు 108 చోట్ల పడతాయి. వాటిలో ముఖ్యమైన 18 భాగాలు పడిన ప్రదేశాలని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. వాటిలో పిఠాపురం ఒకటి. తుంటి భాగం పడిన ప్రదేశం కనుక ఇది పురుహూతికా అయ్యింది. మిగిలిన పదిహేడు శక్తిపీఠాలలో ఉన్న అమ్మవారి నమూనా ప్రతిమలను మనం ఈ మందిరంలో చూడవచ్చు. శ్రీదత్త అవతారాలలో ఒకటయిన శ్రీపాద శ్రీవల్లభ యొక్క జన్మస్థానము. విగ్రహమూర్తి స్వరూపంలో ఉన్న ఒకేఒక దత్తక్షేత్రమిదేనట. శ్రీగురుచరిత్ర అనే గ్రంధంలో ఈ జన్మ వృత్తాంతం వివరంగా ఉంది. వ్యాస మహర్షి ఈ ప్రదేశాన్ని సందర్శించి, వ్రాసిన స్కాందమహాపురాణమునందు భీమఖండం లో 36 శ్లోకాలలో పిఠాపురం గురించి వర్ణించి చెప్పాడు.ఈ భీమఖండమునే మహాకవి శ్రీనాధుడు భీమేశ్వర పురాణంగా తెలుగులో రచించడం జరిగింది. అంతే కాకుండా - ఆంధ్ర శాతవాహనులు,వెళనాటి చోళుల వంటి రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు శాశనాలవల్ల తెలుస్తుంది.
Vinuu Posted March 10, 2014 Report Posted March 10, 2014 GP....went to daksharamam....need to visit rest of the places next time.....thanq
posaanisam Posted March 10, 2014 Author Report Posted March 10, 2014 క్రీస్తుశకం పదవ శతాబ్ధంలో చాళుక్యభీముడు-1 అనేరాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. సామర్లకోటలో గుడిని కట్టించింది కూడా ఈయనే. అందువల్లనే ఇవి రెండు దేవాలయాలూ ఒకే విధంగా ఉంటాయి. సామర్లకోట శివాలయంలొ పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అనే వివరణ కుప్తంగా 10 వ శతాబ్ధానికి చెందిన కుమారారామం అని పిలువబడే సామర్లకోట (Samalkot) శివాలయం కాకినాడకి 12కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమేశ్వరస్వామి కొలువై ఉన్న పురాతన దేవాలయం ఇది. ఆయన దేవేరి బాలా త్రిపుర సుందరి. లభిస్తున్న శాశనాల ప్రకారం ఈ ప్రాంతాన్నీ పాలించిన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది. క్రీస్తుశకం 892 నుంచి 921 వరకూ కుమారా రామాన్ని రాజధానిగా మొదటి చాళుఖ్య భీముడు పరిపాలించాడు. ఈ ఆలయ ప్రాకారాన్ని, మండపాలనీ ఈయనే నిర్మించాడు. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. పంచారామ(Pancharama) క్షేత్రాలలో మిగిలిన నాలుగూ... గుంటూరుజిల్లా అమరావతిలో ఉన్న అమరారామం; తూర్పుగోదావరిజిల్లా ద్రాక్షారమంలో ఉన్న ద్రాక్షారామం; పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న క్షీరారామం; పశ్చిమగోదావరి జిల్లాలోనే భీమవరం గునుపూడిలో భీమారామం. 14వ శతాభ్దం లో శ్రీనాధుడు రచించిన భీమేశ్వరపురాణం లో పంచారామాల వివరం ఉంది. క్షీరసాగరమదనం తరువాత అసురులు శివుడిని గురించి ఘోరతపస్సుచేసి ఎన్నోవరాలు పొందారు. ఆ గర్వంతో వాళ్ళు దేవతలని అష్టకష్టాలు పెట్టడంతో, శివుడు పాశుపతాస్త్రం ప్రయోగించి వాళ్ళని నాశనంచేస్తాడు. అగ్నిజ్వాలలలో సర్వం ఆహుతి అయినా.. అసురులు పూజించిన శివలింగం మాత్రం అలాగే ఉంటుంది. దానిని అయిదు భాగాలు చేసి, పంచారామాలలో శివుడు ప్రతిష్టింపచేశాడని ఈ పురాణం చెపుతుంది. ముఖ్యంగా ఇక్కడ కుమార స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించిన కారణంగా ఈ ప్రదేశాన్ని కుమారా రామం అంటారు. ఈ దేవాలయం నిర్మాణంలో ద్రాక్షారామక్షేత్రాన్ని పోలి ఉంటుంది. రాతితో నిర్మించిన రెండు ప్రాకారాలు - లోపలి ప్రాకారం నుంచి నాలుగువైపులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. లోపలివైపు ఈ గోడ రెండు అంతస్తులుగా కట్టబడింది. స్థూపాకారపు శివలింగం, ఏకశిలా నంది, కోనేటి పుష్కరిణి, చిన్ని నమూనా దేవాలయము, కాంతులీనే ఉన్నతమైన ధ్వజ స్థంభము, శిల్పకలా సంపద..... వందస్థంభాల మండపం... కనీసం ఒక్కసారయినా చూడవలసిన ప్రదేశం ఇది. ఓం నమశ్శివాయ! ప్రతీ సంవత్సరం చైత్ర, వైసాఖమాసాల్లో సూర్యకిరణాలు ఉదయం పూట భీమేశ్వరస్వామి పాదాలను, సాయంత్రంపూట బాలా త్రిపుర సుందరి అమ్మవారి పాదాలను తాకుతాయి.
Anta Assamey Posted March 10, 2014 Report Posted March 10, 2014 Good Post ... Intiki poi chaduvuta .. :4_12_13:
posaanisam Posted March 10, 2014 Author Report Posted March 10, 2014 Drakshram kadu vayya Draksharamam thank u edited....
Recommended Posts