Jump to content

Recommended Posts

Posted

61394478807_625x300.jpg

 

మా పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర’

 మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన 
  రాష్ట్రం ఇంకా విడిపోలేదు.. సుప్రీంకోర్టుపై మాకు ఆశ ఉంది
  తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య గోడను ప్రజలే కూల్చేశారు
  తెలంగాణ నుంచే ఇలాంటి ఉద్యమం ఆరంభమవుతుంది
  రాష్ట్ర విభజనకు చంద్రబాబునాయుడే కారకుడు 
  గవర్నర్ నరసింహన్ సూపర్‌మేన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు
  కిరణ్ అధ్యక్షుడిగా 16 మందితో కొత్త పార్టీ కార్యవర్గం
  రేపు రాజమండ్రి సభలో పార్టీ గుర్తు ప్రకటన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఇంకా విడిపోలేదని.. సుప్రీం కోర్టుపై తమకింకా ఆశ ఉందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రం విడివడినా తూర్పు, పశ్చిమ జర్మనీలు కలసిపోయిన మాదిరిగానే ప్రజల పోరాటంతో రెంటినీ తిరిగి కలుపుతామని చెప్పారు. ‘‘తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య 1961లో అడ్డుగోడ కట్టారు.. 1991 నాటికి ప్రజలే దాన్ని కూల్చి ఒకటి చేశారు. ఇక్కడ కూడా అలాగే అవుతుంది.. తెలంగాణ నుంచే ఇలాంటి ఉద్యమం ఆరంభమవుతుంది’’ అని కిరణ్ అభిప్రాయపడ్డారు. బెర్లిన్ గోడ కూల్చినప్పటి ఆ గోడ ముక్కను తన మిత్రుడొకరు తెచ్చారని, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక దాన్ని తెప్పించానంటూ ఒక చిన్న సంచిలోంచి రాయిముక్కను తీసి చూపించారు. తాను ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కిరణ్ ప్రకటించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన ప్రైవేటు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ పేరుతో పాటు 16 మందితో పార్టీ కార్యవర్గాన్నీ ప్రకటించారు.
Posted

Ohkay.. First goda kattedhham.. Time ochinappudu kulchedhham

Posted

eediki telugu janalu oka maadiriga kooda kanapadatleda......l6T6uUG.gif

Posted

Vadi bhayam vadidhi, nakka thoka thokkinodi laga sudi meedha CM ayyadu, ipudu thana constituency lo kuda win avvaledu ani bhayam tho ento vaaguthunnaadu

×
×
  • Create New...