TOM_BHAYYA Posted March 12, 2014 Report Posted March 12, 2014 PK kooda charity activities tho prove chesukunnadu..thana intentions ento society gurinchi so andhuke intha craze following bl@st bl@st bl@st Charity laki society ki help cheyalante Manchi manasu dhaaniki thodu dabbu unte chaalu Oka state ni nadapalante raajakeeyam teliyali.. Cbn la Governance teliyali. Ysr la dynamic ga undali.. NTR la janalaki em kavalo teliyali.. Inka saana unnai Paisa Manchi manasu kadhu.. MMS kuda manchode.. Evadi mxxxa ki.. Yeda pettukovali aadi Manchi manasunu manam
JaiJagan Posted March 12, 2014 Report Posted March 12, 2014 eeee cinemaa volantha politics loki vachi gabuu leputhunarabaa sFun_duh2
Nellore Pedda reddy Posted March 12, 2014 Report Posted March 12, 2014 ప్రజలు నిస్సాహాయులు. ప్రజలు వేసే ఓటుకు విలువ లేదు. ఇది నిజం. దానికి కారణం 95% of నాయకులు. ఓటును కొనేసుకుంటున్నారు. ప్రజలకు నాయకులను ప్రశ్నించే అర్హత లేకుండా చేస్తున్నారు. ఒక నాయకుడు బలంగా కనిపించాలంటే ఆ నాయకుడు వెనుక బలమైన అనుచరులు వుండాలి. ఆ అనుచరులు ప్రజలకు ఎంత దగ్గరగా వుంటే అంత బలమైన వాళ్ళని. రాజకీయమంటే అధికారంగా దోచుకొవడంగా మారిపోయిన ఈరోజుల్లో, రాజకీయ నాయకుల అనుచరులు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు సంపాదించుకోవడం, అందిన కాడకు దోచుకొవడం, దోచుకున్న దాంట్లో ప్రజలకు ముష్టి పాడేయటం. ఈ విధంగా ప్రజలకు దగ్గరై ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఎవరూ ఆలోచించడం లేదు. ప్రజలను మోసం చేసి ఓటుకు విలువ లేకుండా చేస్తున్నారు. అంతే కాని, ఈ నాయకుడు ప్రజలకు న్యాయం చేస్తాడు .. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌ల కోసం కాకుండా, ప్రజలకు న్యాయం చేసే ఈ నాయకుడుకు అండగా నిలబడదాం అనుకునే అనుచరులు ఎంత మంది? పవన్‌కల్యాణ్ మొండోడు .. లెక్కతో కూడిన తిక్క వుంది .. ఆవేశపరుడు .. ఎవరినీ కేర్ చెయ్యడు .. కాని ఎవరికీ అన్యాయం మాత్రం చెయ్యడు. కష్టపడి పైకి వచ్చే వాళ్ళను పొత్సహిస్తాడు. అనవసరమైన రికమెండేషన్స్ చెయ్యడు. ఇవన్నీ అర్దం చేసుకొని, మనం చెయ్యలేని పనిని పవన్‌కల్యాణ్ చెయ్యాలనుకుంటున్నాడు అని పవన్ కు అండగా నిలిచేదెవరు?? ప్రజలను ప్రభావితం చేసే ఎంతమంది పవన్ వెంట వస్తారు??ప్రజలు వేసే ఓటుకు విలువ & గౌరవం కల్పించడం ఎలా? ఒక వ్యక్తి సక్సస్ అయితే మన ప్రాంతం వాడనో, మన కులం వాడనో ఆయా వర్గాలు గర్వంగా ఫీల్ అవ్వడం & చెప్పుకోవడం సహజం. సదరు సక్సస్‌ఫుల్ వ్యక్తి వారిని ఖండించడు, కారణం ఆ వర్గం నుంచి ఎక్కడ వెలి వేయ బడతానెమోనని భయం. అప్పుడు ఖండించక పొవడంతో కొన్ని రోజులకు మా వలనే నువ్వు ఇంతటి వాడివయ్యావు అని ఆ వర్గం వాళ్లు మొదలు పెడతారు. సదరు సక్సస్‌ఫుల్ వ్యక్తి తన స్వయం కృషి, కష్టార్జితం, ఆ స్థానం సంపాదించడానికి పడిన కష్టాలు .. ఇలా అన్నీ మర్చిపోయి కేవలం మీ వలనే ఇంతటి వాడినయ్యాను అని అబద్ధాలతో మిగిలిన కాలం అంతా గడపాల్సిందే. సీమాంధ్ర ప్రాంతాల్లో ప్రధానంగా రెండు మీడియాలు శాసిస్తున్నాయి. వైయస్సార్‌సిపి మీడియా & తెలుగుదేశం మీడియా. ఘాటుగా నాటుగా డైరక్ట్‌గా విషం చిమ్మే మీడియా వైయస్సార్‌సిపి మీడియా అయితే, మీ వెనుకే వున్నాం అని నమ్మబుచ్చి, చిన్న అవకాశం దొరికిన వెంటనే వెన్నుపోటు పొడిచి విషం చిమ్మే రకం తెలుగుదేశం మీడియా. మన పార్టీకి పవన్‌కల్యాణ్ భారీగా గండి కొట్టనున్నాడు అని తెలిసిన క్షణం నుంచే పవన్‌కల్యాణ్‌పై కుల ముద్ర వేసేందుకు ప్రయత్నాలు భారీగా మొదలుపెట్టాయి. ప్రజలు నిస్సాహాయులు. నిజాయితీ నాయకులు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచెందుకు పోటిపడి గెలవాలి కాని, వాళ్ళల్లో వీక్ పాయింట్స్ క్యాష్ చేసుకొని గెలవడం కాదు. రాజకీయాలంటే ఏమి చేసినా తప్పు కాదు అని ప్రజలను నమ్మించి, మనం చేసిది సంసారంగా చూపించి, అదే పని ప్రత్యర్దులు చేస్తే వ్యభిచారంగా ప్రచారం చేసే సొంత మీడియాలతో ప్రజలను మోసం చెయ్యడం క్షమించరాని నేరం. అందుకే, ఇటువంటి కుళ్ళు రాజకీయాల్లోకి పవన్‌కల్యాణ్ రాకూడదని కొందరు మెగా అభిమానులు కోరుకొవడం అసలు తప్పు కాదు. అలా అనిమనవంతుగా ప్రజలను నిజాయితీగా చెత్యన్య వంతులను చేద్దాం. ప్రజలు నమ్మితే రాజకీయాల్లో వుందాం. లేదు అంటే మన సినిమాలు మనం చేసుకుందాం. అని అనుకుంటున్న పవన్‌కల్యాణ్ ఆలోచనలు కూడా తప్పు కాదు.
Recommended Posts