timmy Posted March 13, 2014 Report Posted March 13, 2014 March 13th, 2014, 05:55 PM IST పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తారా, రారా, అవన్నీ ఊహాగానాలే అన్న చర్చకు తెరపడింది. ఎట్టకేలకు ఆయన పార్టీ ‘జనసేన’గా బయటకు వచ్చింది. అంతే కాదు తాను ఏ స్థానానికి, ఎక్కడి నుంచి పోటీ చేస్తాను, తాను ఎంత మందిని ఎన్నికల బరిలోకి దించుతాను అన్న విషయాలు చూచాయిగా బయటకు వచ్చాయి. రేపే అంటే శుక్రవారం తన పార్టీ విధివిదానాలు హైటెక్స్ వేదికగా 45 నిముషాల సుదీర్ఘ ప్రసంగం ద్వారా వివరిస్తారంటున్నారు. అయితే అవి ఏమిటి? ఆయన లక్ష్యం ఏమిటి, ఆయన పార్టీ ఆశయం, దాని వెనుక ఆయనకు ఉన్న ఆశయం ఏమిటి అనేది ఇప్పుడు అటు రాజకీయ వర్గాల, ఇటు అభిమాన వర్గాల సందేహం. రాజకీయాల్లోకి వచ్చే వారికి సహజంగా ఉండే లక్ష్యం అధికార సాధన. ఏకంగా ప్రత్యేక పార్టీ పెడుతున్నారంటే ముఖ్యమంత్రి కావడం అన్నది ఆశయం అని సామాన్య జనం కూడా అనుకుంటారు. అధికారం కోసం కాకపోతే పవన్ తమ పార్టీతో ప్రజలకోసం ఏం చేయగలుగుతారు అన్నది ఆలోచించాల్సిన విషయం. కాని పవన్ పార్టీ అధికారం కోసం రావడం లేదని ఆయనే పరోక్షంగా చెప్పేసారు. పైగా ఆయన అసెంబ్లీకి కాకుండా కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని అంటున్నారు. మహా అయితే తన పార్టీ అభ్యర్థులను 40 మంది వరకు నిలబెడతారని తెలుస్తోంది. తొమ్మిది మంది వరకు ఎంపీ స్థానాలకు పోటీ చేస్తారంటున్నారు. దీని వల్ల పవన్ సాధించేదేమిటి? సీమాంద్రలో మొత్తం 194 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పవన్ 40 మందిని నిలబెట్టి టోటల్ సీట్లు గెలిచినా కూడా అధికారం మాట అటుంచి కనీసం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం కూడా అనుమానమే. ఇక ఆయన అసెంబ్లీకి కాకుండా ఎంపీకి పోటీ చేస్తున్నారంటే ఆయనకు తన సొంతరాష్ట్రంలో అధికారం వద్దనుకుంటున్నారనే అనుకోవాలి. అలాంటప్పడు తన ప్రజలకు ఆయన ఏం చేయగలరన్నది కూడా ప్రశ్నే. 40 మంది ఎమ్మెల్యేలతో ఏపిలో అధికారంలోకి వచ్చే పార్టీకి కీలక భాగస్వామిగా అయి తను అనుకున్నది సాధిస్తారనుకుందాం, కాని ఇప్పడున్న పార్టీలన్నీ వేస్ట్, వాటివి స్వార్థ రాజకీయాలు అన్న నినాదంతోనే వస్తున్నారు కాబట్టి పొత్తు పెట్టుకోలేరు. రాష్ట్రం విషయం వదిలేస్తే తొమ్మిది ఎంపీ స్తానాలు గెలుచుకుని కేంద్రంలో ఏమైనా చక్రం తిప్పగలరా అంటే అది కుదరని పనే. అటువంటప్పడు ఆయన ఎందుకు పార్టీ పెడుతున్నారు అంటే కచ్చితంగా అది మరెవరి ప్రయోజనాలను దెబ్బతీయడం కోసం అన్న అనుమానం కలుగుతుంది. ఎవరో ఆయన వెనుక ఉండి నడిపిస్తున్నారిదంతా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ పవన్ అలా లొంగే మనిషి కాదు. ఆయన వ్యక్తిత్వం అటువంటిది కాదు. కానీ మరి ఎందుకిలా జరుగుతోంది? అప్పడు వైఎస్సార్ నేతృత్వంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని సర్వేలు చెప్పాయి. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. దీంతో టిడిపిని అధికారానికి దూరం చేసిన చిరంజీవి తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ది మళ్లీ అదే పరిస్థితి. అందుకే అప్పుడు అన్న చిరంజీవితో చేయించిన పనిని ఇప్పడు తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చేయిస్తోందా అన్న అనుమానాలయితే బలంగా కలుగుతున్నాయి. లేకుంటే అధికారం కోసం కాకుండా, తాను అనుకున్న లక్ష్యానికి చేరుకునే పరిస్థితులు కల్పించుకోకుండా ఇలా పవనే కాదు ఎవరు కూడా రాజకీయాల్లోకి రారు. పైగా సినిమాల్లో నష్టాల నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్న తరుణం,రాజకీయాల్లోకి రావడానికి ఇంకా వయసేమి మీద పడలేదు, సినిమాల్లో ఇంకా ఎదిగి అన్న చిరంజీవి అంత పేరు సంపాదించుకుని అప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం పవన్ కు ఉంది. అంతే కాదు అప్పటికి రాష్ట్రంలో రాజకీయంగా ఇప్పుడున్న అనిశ్చితి దూరమవుతుంది. ఇలా ఏకోణంలో చూసుకున్నా కూడా పవన్ రాజకీయ అరగేంట్రంపై సందేహాలకే ఎక్కువ అవకాశం ఉంది. కారణం ఇప్పుడు సీమాంద్రలో జగన్ ప్రాభవం కూడా తగ్గుతోంది, టిడిపిలోకి హేమాహేమీలంతా వెళ్లి పోతున్నారు, బిజేపితో టిడిపి పొత్తు కూడా ఖరారే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సీమాంద్రలో టిడిపి పుంజుకుంది అన్న టాక్ వినపడుతోంది. మెజారిటి కాపు వర్గం టిడిపి వైపునకు టర్న్ అయింది అనుకున్న నేపథ్యంలో అదే వర్గానికి చెందిన పవన్ సడన్ గా రాజకీయాల్లోకి వస్తుండడం వెనుక బలమైన రాజకీయ వ్యూహమే దాగుందని మాత్రం అనుకుంటున్నారు. అదేంటన్నది కొన్నాళ్లు ఆగితే కాని తెలియదు. - See more at: http://telugu.gulte.com/tnews/3896/Pawan-kalyan-Party-Ambition#sthash.s4XRquGm.dpuf
Baadshah_Afdb Posted March 13, 2014 Report Posted March 13, 2014 45 min speech aa puli cinema lo oka scene vuntadhi adhi repeat chestadu emo
KadapaKingg Posted March 13, 2014 Report Posted March 13, 2014 Last time TDP ki anna ippudu Tammudu CITI_c$y
dkc Posted March 13, 2014 Report Posted March 13, 2014 first line lo oohaganalu ani aapesinte better. start chesinappudu discussion pettukondi.
Recommended Posts