karan_410 Posted March 13, 2014 Report Posted March 13, 2014 నారా రోహిత్‌ని ఫాలో అయిన పవన్! March 13th, 2014, 11:42 AM IST పవర్ కోసం కాదు... ప్రశ్నించడానికే వస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అందుకోసం `జనసేన` అని పార్టీ పెట్టబోతున్నాడు. పవన్ ఎత్తుకొన్న ఈ కాన్సెప్ట్ ఏదో బాగానే ఉంది. అయితే... ఇది నారా వారి హీరో సినిమా నుంచి కాపీ కొట్టిందే అంటున్నారు ఫిల్మ్‌నగర్ జనాలు. వస్తున్నా... అడగడానికే వస్తున్నా అంటూ నారా రోహిత్ `ప్రతినిధి` అనే సినిమా చేశాడు. అందులో హీరో ప్రశ్నించడమే పనిగా పెట్టుకొన్న ఓ సాధారణ పౌరుడు. ఆ సినిమా టీజర్‌కీ, ట్రైలర్స్కీ చక్కటి స్పందన లభించింది. సమాజంలో లోటుపాట్లని ఎత్తిచూపుతూ, పాలకుల్ని ప్రశ్నించే ఓ యువకుడిగా, ప్రజలకు ప్రతినిధిగా నారా రోహిత్ నటించాడు. పోరాడేవాడు పౌరుడైతే యుద్ధం అంటారు... అదే పౌరుడైతే అంటూ నారా రోహిత్ చెప్పిన సంభాషణలు అందులో ఆకట్టుకొంటాయి. ఆ కాన్సెప్ట్నే తన నినాదంగా చేసుకొన్న పవన్‌కి ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి.
BikerBoy Posted March 13, 2014 Report Posted March 13, 2014 GP PK is also following tarakaratna foot steps...in his 1st movie he quesns govt
Recommended Posts